బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బీదర్(Bidar)లోని జల్సంగి గ్రామ వాసులకు శనివారం(జనవరి 18) ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద బెలూన్(Baloon) పడింది. బెలూన్‌కు పెద్ద పేలోడ్ యంత్రం కూడా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి తోడు బెలూన్‌కు అమర్చి ఉన్న యంత్రానికి రెడ్ లైట్ వెలుగుతూ ఉండడంతో గ్రామస్తులకు భయం ఎక్కువైంది.
వెంటనే బెలూన్‌తో పాటు భారీ యంత్రమొకటి ఆకాశంలో నుంచి ఊడిపడినట్లు జల్సంగి గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే హొమ్నాబాద్ తాలూకా పోలీసులు స్పాట్‌కు చేరుకుని బెలూన్‌ను దానికి ఉన్న యంత్రాన్ని పరిశీలించారు. దానిపై ఉన్న ఒక లేఖ ఆధారంగా ఆ బెలూన్ యంత్రం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(Tifr)కు చెందినదని పోలీసులు తేల్చారు.
విషయం క్లారిటీ రావడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని తమ కేంద్రం నుంచి టీఐఎఫ్‌ఆర్ ఆకాశంలోకి బెలూన్ యంత్రాలను వదిలి వాతావరణంపై పరిశోధనలు చేస్తుంటుంది. హొమ్నాబాద్ పోలీసులు బెలూన్ గురించి సమాచారమివ్వడంతో టీఐఎఫ్‌ఆర్ బృందం అక్కడికి బయలుదేరి వెళ్లింది. బెలూన్ యంత్రం నింగిలో నుంచి ఊడిపడిన విషయాన్ని సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
A satellite payload #baloon of #TIFR , #Hyderabad fell on a house from sky in Bidar with a huge machine.
A huge size balloon (looks like an airbag) fell from the sky, created panic among the villagers Jalsangi village in #Homnabad Taluk, #Bidar district, #Karnataka , early… pic.twitter.com/Dri4CikSdE— Surya Reddy (@jsuryareddy) January 18, 2025
Comments
Please login to add a commentAdd a comment