Air Bags
-
చూడటానికి స్టయిలిష్ తలపాగ..పెట్టుకుంటే క్షణాల్లో తలనొప్పి మాయం!
శారీరక, మానసిక శ్రమల్లో ఏది ఎక్కువైనా అలసటతో ముందు తలనొప్పి వస్తుంది చాలామందికి. దాంతో ముఖం వాడిపోతుంది. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది చిత్రంలోని ఈ వార్మింగ్ ఎయిర్ మసాజర్. ఇది తలనొప్పిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దాంతో ముఖంలో సరికొత్త గ్లో వస్తుంది. చూడటానికి ఈ డివైస్ ఓ ఫ్యాషన్ హెయిర్ క్యాప్‌లా స్టయిలిష్‌గా కనిపిస్తుంది. మెషిన్ మీద అందంగా పింక్ కలర్ క్లాత్‌తో ఉన్న ఎయిర్‌బ్యాగ్ అధునాతన తలపాగా మాదిరి ఆకట్టుకుంటుంది. దీన్ని తలకు బ్యాండ్ మాదిరి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్షణాల్లో రిలాక్స్ చేస్తుంది. ఈ డివైస్ రిమోట్పైన డ్యూయల్ హీటింగ్, మసాజింగ్ యాక్షన్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోని పింక్ కలర్ ఎయిర్‌బ్యాగ్ థర్మోప్లాస్టిక్ పాలీయూరితేన్ మెటీరియల్‌తో రూపొందగా.. ఎయిర్ ట్యూబ్ సిలికాన్‌తో రూపొందింది. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఇది ఆఫ్ అవుతుంది. 50 డిగ్రీల సెల్సియస్ (122 డిగ్రీల ఫారెన్ హీట్)తో ఇది మసాజ్‌ని అందిస్తుంది. దీన్ని వినియోగించడం చాలా సులభం. ఏ పని చేసుకుంటున్నా దీని రిమోట్‌ని ఏ జేబులోనో వేసుకుని.. లేదా ఎదురుగా ఉండే బల్ల మీద పెట్టుకుని.. సులభంగా తలకు ఈ డివైస్‌ని తగిలించుకుని రిలాక్స్ కావచ్చు. భలే ఉంది కదూ! ఇలాంటి మోడల్స్‌లో మరిన్ని ఆప్షన్స్‌తో మసాజర్స్ మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. అయితే ధరల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: ఈ డివైజైలో తక్కువ ఆయిల్తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!) -
హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తమ కార్లు అన్నింటిలోనూ ఆర్ ఎయిర్ బ్యాగులను ప్రామాణింగా అందించనున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారత్ NCAP మార్గదర్శకాల ప్రకారంఈ రేటింగ్స్‌లోనూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు పేర్కొంది. భారతదేశంలో బ్రాండ్ అందించే అన్ని కార్లు, ఎస్‌యూవీల్లో ఇక 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఉంటాయి. తద్వారా హ్యుందాయ్ తమ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్న దేశంలో తొలి బ్రాండ్‌గా అవతరించింది హ్యుందాయ్ ఇండియా కూడా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) ద్వారా క్రాష్ టెస్టింగ్ కోసం తమ మూడు కార్లను స్వచ్ఛందంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) హ్యుందాయ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో 13 విభిన్న మోడళ్లను కలిగి ఉంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఈ సేఫ్టీ ఫీచర్ గ్రాండ్ i10 నియోస్, ఆరా , వెన్యూ సబ్-4 మీటర్ SUVలతో సహా మిగిలిన మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు ) ఇంతకుముందు, హ్యుందాయ్ అన్ని మోడళ్లలో అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు సీట్ బెల్ట్ రిమైండర్లను ప్రామాణికంగా చేసింది. వాటిలో చాలా వరకు ESC మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్‌ని స్టాండర్డ్‌గా అమర్చారు. తమ కంపెనీ కార్లలో ‘అందరికీ భద్రత’ అనేదే తమ అత్యంత ప్రాధాన్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ వెల్లడవించారు.పేర్కొన్నారు. వాహన భద్రతా లక్షణాల ప్రామాణీకరణలో బెంచ్‌మార్క్ సృష్టికర్తలుగా ఉన్న తాము ఇపుడిక అన్ని మోడల్స్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ప్రామాణీకరణను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) -
17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్.. కారణం ఇదే!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 17,362 యూనిట్లు రీకాల్ చేస్తోంది. వీటిలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో కె10, ఎస్–ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బలేనో, గ్రాండ్ వితారా ఉన్నాయి. ఈ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ తనిఖీ చేసి లోపాలు ఉంటే ఉచితంగా మార్పిడి చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతీ సుజుకీ అధీకృత వర్క్‌షాప్స్ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు..తగ్గే ప్రసక్తే లేదు
కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. Considering the global supply chain constraints being faced by the auto industry and its impact on the macroeconomic scenario, it has been decided to implement the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 01st October 2023. — Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022 ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎయిర్ బ్యాగుల అంశంపై స్పందించారు. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లయి చైన్ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్) కార్ల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్1, 2023 వరకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్ గడ్కరీ ట్వీట్లో పేర్కొన్నారు. కార్ల ధరలు పెరుగుతాయ్ కేంద్రం ఈ ఏడాది అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలనే నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని కార్ల తయారీ సంస్థలు వ్యతిరేకించాయి. ఎయిర్ బ్యాగుల్ని పెంచితే.. కార్ల ధరలు పెరుగుతాయని తద్వారా ఆ భారం తయారీ సంస్థలపై, కార్ల కొనుగోలు దారులపై పడుతుందని స్పష్టం చేశాయి. నిబంధనల సవరింపు ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలన్న నిబంధనల్ని సవరించింది. కేవలం 8 సీట్లున్న (ఎం -1 వేరియంట్ కార్లు) కార్లలో మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉండాలని తెలిపింది. -
ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడడంలో ‘సీటు బెల్టు’ కీలక పాత్ర
మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. ఇవీ స్థూలంగా కార్ల వంటి తేలికపాటి వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ఆయన దుర్మరణం చెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీటు బెల్టు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో సీటు బెల్టు పనితీరు, సీటు బెల్టు–ఎయిర్‌బ్యాగ్‌ల అనుసంధానం, ఒక్కోసారి సీటుబెల్టు పెట్టుకున్నా ప్రమాదాల్లో మృతిచెందేందుకు ఉన్న అవకాశాల వంటి వాటిపై కథనం. సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు.. కార్ల వంటి ఇతర వాహనదారులు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి. కానీ దేశంలో ఎక్కడా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల జరిమానాలకు భయపడి సీటు బెల్ట్‌లు ధరిస్తున్నా హైవేలపై ప్రయాణాల్లో మాత్రం చాలా మంది సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంలేదు. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొనే వారు మినహా మిగిలిన వారు వాటిని ఉపయోగించట్లేదు. ఫలితంగా ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. సీటు బెల్ట్ ధరించకపోతే అలారం మోగేలా కార్ల తయారీ కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి చాలా మంది సీట్ బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ను వినియోగిస్తున్నారు. వాటిని కార్ డెకార్స్ దుకాణాలు విక్రయిస్తున్నాయి. అయితే ఈ బకెల్స్ ద్వారా అలారం మోగకుండా ఆపినా ప్రమాదం జరగకుండా ఆపలేవని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాలు నిలిపిన ‘బెల్ట్’... ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో సీటుబెల్ట్ పెట్టుకోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. బెల్ట్ వాడని ఫలితం.. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరో ముగ్గురితో కలసి 4న అహ్మదాబాద్–ముంబై హైవేపై వెళ్తుండగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ హైఎండ్ కారు ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు ధరించిన ముందు సీట్లోని ఇద్దరు గాయాలతో బయటపడగా వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ, మరొకరు సీటు బెల్టు ధరించకపోవడంతో మృతిచెందారు. సీటు బెల్ట్ ధరించకుంటే.. ► నిర్ణీత వేగంతో వెళ్తున్న కారులో ప్రయాణికులు స్థిరంగా కూర్చున్నప్పటికీ వాహనం దేన్నయినా గుద్దుకున్నా లేదా హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా అందులోని వారు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ► ఫలితంగా వాళ్లు డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు), ముందు సీట్ల మధ్యలో ఉన్న ఖాళీ నుంచి అద్దం తదితరాలను అత్యంత వేగంగా ఢీకొంటారు. ► ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి లేదా డోర్ ఊడిపోతే అందులోంచి బయటకు ఎగిరి పడతారు. ఫలితంగా తల, ముఖం తదితర చోట్ల తీవ్ర గాయాలై మరణిస్తుంటారు. సీటు బెల్ట్ ధరిస్తే.. ► సీటు బెల్ట్ ధరించి ప్రయాణిస్తుప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నా లేదా కారు పల్టీలు కొట్టినా లేదా ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చినా ప్రయాణికులు వాహనంలోంచి ఎగిరిపడిపోకుండా కాపాడుతుంది. ► ముఖ్యంగా ప్రయాణికులు డ్యాష్ బోర్డు లేదా ముందు సీట్లకు గుద్దుకోకుండా సీటు బెల్ట్ వ్యతిరేక శక్తిని ప్రయోగిస్తుంది. ► ఫలితంగా ప్రయాణికులు కేవలం గాయాలతో బయటపడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ► 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన సతీమణి, డ్రైవర్ అక్కడికక్కడే కన్నుమూశారు. సీటు బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కోసారి ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నా... అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉండే హైఎండ్ కార్లు సైతం కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపడలేవని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ సెన్సర్లు యాక్టివేట్ అయి, తెరుచుకోవడానికి కొంత సమయం పడుతుందని.. సాధారణంగా ఇది 0.05 సెకన్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్ స్టీరింగ్ వరకు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్ వరకు ప్రయాణించి బలంగా ఢీకొనడం జరిగిపోతుందని వివరిస్తున్నారు. స్పందించేందుకు సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ముప్పు కనిపించినప్పుడు స్పందించి బ్రేక్ వేయడానికో లేదా పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమింది. ఈ మధ్యలోనే వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీలు అనేకం.. హైఎండ్ కార్లలో ఎయిర్ బ్యాగ్‌కు–సీట్ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ (ఏసీయూ)కు అనుసంధానమై ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరిగిపోతుంది. సీటు బెల్ట్‌లు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు. -
కియా ఇండియా కీలక ప్రకటన.. ఇకపై సెల్టోస్ కార్లలో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా అన్ని సెల్టోస్ కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రమాణికంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.కంపెనీ ఇప్పటికే కరెన్స్ మోడల్లో అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా ఆఫర్ చేస్తోంది. భారత్‌లో సంస్థ మొత్తం అమ్మకాల్లో సెల్టోస్ వాటా ఏకంగా 60 శాతం దాకా ఉంది.ఎనమిది మంది కూర్చునే వీలున్న వాహనాలకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను 2022 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. -
జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!
జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2022 జనవరి 1 నుంచి భారతదేశంలో తయారు చేసే అన్ని ప్యాసింజర్ కార్లలో తప్పనిసరిగా ముందు వరుస సహ ప్రయాణీకుల కోసం కూడా ఎయిర్ బ్యాగ్ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. డ్రైవరు పక్కన ఉన్న ప్రయాణీకులకు ఎయిర్ బ్యాగ్ ఇన్ స్టాల్ చేసే గడువు తేదీని మరోసారి పొడగించే అవకాశం లేదు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. జనవరి 1, 2022 నుంచి తయారు చేసే అన్ని ప్యాసింజర్ వేహికల్ మోడల్స్ లలో తప్పనిసరిగా సహ డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు. ఇంతకు ముందు, ఈ గడువు తేదీని ఆగస్టు 31 నుంచి డిసెంబర్ 31 వరకు వాయిదా వేసింది. ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల్లో డ్రైవర్ ఎయిర్ బ్యాగులు మాత్రమే తప్పనిసరి. ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో భారతదేశంలోనే దాదాపు 10 శాతం మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌హెచ్‌టిఎస్‌ఎ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందు కూర్చొన్న వారిలో మరణించే వారి శాతం 61 శాతం వరకు తగ్గింది. ఎయిర్ బ్యాగు ఉండటం వల్ల మరణాల శాతం 34 శాతం తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది. (చదవండి: భారత్‌లో బిర్యానీతో పాటు ఇది కూడా చాలా ఫేమస్..?) -
Hyderabad: గంటకు 65 కి.మీ దాటితే ప్రమాదమే..
Road Accidents Hyderabad: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమూ కారణమే. ప్రమాద సమయంలో ఆ కారు గంటకు 100 కి.మీకి పైగా వేగంతో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనం ప్రయాణించిన కారణంగానే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఫలితం దక్కలేదు. కేవలం ఈ ఒక్క ప్రమాదమే కాదు.. సిటీలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం అతివేగం వల్లే జరుగుతున్నాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. సిటీ రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువైనవని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గంటకు 65 కి.మీలు వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అని వివరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. ఆ రెంటికీ సంబంధం లేదు.. ►రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 25 కి.మీ మించట్లేదు. రహదారులు పరిస్థితి, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు, ఆక్రమణలు సహా మరెన్నో దీనికి కారణంగా మారుతున్నాయి. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవే. ►నగర రోడ్ల పైకి కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీపైగా ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాలది ఇంతకంటే ఎక్కువే. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం, నిబంధనలు లేవని పేర్కొంటున్నారు. చదవండి: (ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే బజ్జీ !) రాత్రి వేళల్లోనే ఎక్కువ.. ►వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. జంక్షన్లలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు. ►కేవలం ఇన్నర్ రింగ్ రోడ్, శివారు రహదారులు వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఫలితంగా వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. ఏటా నగర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతోంది పాదచారులే కావడం గమనార్హం. ►వాహన వేగం మితిమీరి ఉంటే... ఈ సమయంలోపే డ్రైవర్ లేదా ప్రయాణికులు స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్, సీట్లకు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ పేలిపోవడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వాహనంలోని వారిని రక్షించలేవు. ►హైదరాబాద్ నగరంలో మితిమీరిన వేగం 1,785 ప్రమాదాలకు కారణమైంది. ఫలితంగా 213 మంది చనిపోయారు. 1,548 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 237 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఓవర్ స్పీడింగ్‌తో జరిగినవి 178. కొంపల్లిలో కారు బీభత్సం కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో కారు నడపడంతో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఛోటాబజార్కు చెందిన సాయి శ్రీనివాస్ (27) అకౌంటెంట్. ఆదివారం రాత్రి ఆర్మూర్ నుంచి నగరానికి కారులో తన స్నేహితులు పిండిత శ్రీకాంత్, పవన్‌లతో కలిసి వస్తున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మహీంద్రా షోరూమ్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ గ్రిల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వీరికి బ్రీతింగ్ అనలైజ్ పరీక్ష చేయడంతో మద్యం తాగినట్లు వెల్లడైంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 337, 185 కింద కేసులు నమోదు చేశారు. సదరు కారుపై ఇప్పటికే 3 చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
1.6 మిలియన్ల హోండా కార్లు రీకాల్
వాషింగ్టన్: హోండా కంపెనీ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. ఎయిర్ బ్యాగ్ లోపాలకారణంగా అమెరికాలో 1.6 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తామని హోండా శుక్రవారం తెలిపింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించిన గడువుకు ఆరు నెలల ముందే ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లోపభూయిష్ట టకాటా ఎయిర్ బ్యాగ్‌లను రీప్లేస్ చేస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ కార్లను, అమెరికాలో దాదాపు 12.9 మిలియన్ల హోండా, అకూరా ఆటోమొబైల్స్ కార్లను రీప్లేస్ చేశామని పేర్కొంది. కాగా 2013 నుండి తకాటా ఎయిర్బ్యాగ్లలోని లోపాలతో సంభవించిన ప్రమాదాల్లో సుమారు 20 మంది మరణించారు. దీంతో అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సీరియస్‌గా స్పందించింది. -
కారు ఢీకొట్టంతో రెండు భాగాలైన ట్రాక్టర్
చౌటుప్పల్ (మునుగోడు) : కారు ట్రాక్టర్‌ను ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని లక్కారం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కొత్త ట్రాక్టర్‌ను నల్లగొండ జిల్లా కోదాడకు తీసుకెళ్తున్నారు. లక్కారం శివారులోని ఎల్డీఆర్ ఎస్టేట్ గేటు ముందుకు రాగానే వెనుక నుంచి వచ్చిన వర్నా కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయి రహదారిపై పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కుట్టి రామకృష్ణ(62) తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ట్రాక్టర్‌ను డీకొట్టిన కారులోని వ్యక్తులకు ఎలాంటి గాయాలవ్వలేదు. కారుఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన వెనుక నుంచే వస్తున్న మరో ట్రాక్టర్ డ్రైవర్ అద్దంకి వీరయ్య పోలీసులకు సమాచారమిచ్చాడు. చికిత్స నిమిత్తం ట్రాక్టర్ డ్రైవర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. వీరయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టయోటా యారిస్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా తమ బ్రాండ్ వినియోగదారులకు కార్ల సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయనుంది. యారిస్ పేరుతో సీ- సెగ్మెంట్ కారును ప్రవేశపెడుతోంది. వచ్చే నెల నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చని, మే నుంచి అమ్మకాలు మొదలవుతాయని సంస్థ తెలిపింది. తమ కొత్త యారిస్... హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్, హ్యూందాయ్ వెర్నాలకు గట్టిపోటీనిస్తుందని సంస్థ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ బ్రాండ్ వినియోగదారులకు ఇతియోస్ సెడాన్, కరోలా అట్లిస్ వంటి ఉత్తమ కార్లను అందజేశామని, ఇప్పుడు యారిస్ కూడా అందరి అభిమానాన్ని చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యారిస్ ఫీచర్లు... 1.5 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంజన్ రెండు గేర్ బాక్సులు(6- స్పీడ్ మాన్వల్ లేదా 7- స్ఫీడ్ సీవీటీ ఆటోమేటిక్) 7 ఎయిర్ బ్యాగులు ధర : 10 నుంచి 12 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం) -
కార్ల ధరలకు ‘సేఫ్టీ’ రెక్కలు..?
న్యూఢిల్లీ: అధిక వేగంతో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే దిశగా కేంద్రం చర్యలు మొదలెట్టింది. అన్ని రకాల కార్లలో 2019 జూలై 1 నుంచి ఎయిర్ బ్యాగులతో పాటు, కారు వేగం పరిమితి దాటితే హెచ్చరించే ఏర్పాట్లు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్ల ధరలు కూడా 8–10 శాతం వరకు పెరగవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, కార్లలో సీటు బెల్ట్ ధరించకపోయినా గుర్తు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌కు మాన్యువల్‌గా ఓవర్‌రైడ్ స్విచ్ తదితర వాటినీ అమర్చాలి. వాస్తవానికి కొంచెం ఖరీదైన కార్లలో ఈ ఫీచర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే. అయితే, ఇప్పటి వరకు ఇవి తప్పనిసరి కాదు. 2019 జూలై నుంచి అన్ని కార్లలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. యూరోపియన్ యూనియన్ ప్రమాణాలకు అనుగుణంగా నూతన భద్రతా ప్రమాణాలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2020 అక్టోబర్ మధ్య దశల వారీగా అమల్లోకి రానున్నాయి. ఇందులో ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్‌కు సంబంధించిన ప్రమాణాలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతమున్న కార్లలో ఇందుకు తగ్గ ఏర్పాట్లను వచ్చే ఏడాది అక్టోబర్ 1 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, అందుకు అనువైన వ్యవస్థలను అమర్చాలంటే ఒక్కో కారుకు ఎంత లేదన్నా కనీసం రూ.40,000–60,000 వరకు అదనపు ఖర్చు అవుతుందని విశ్లేషకులు, ఈ రంగానికి చెందిన వారు పేర్కొంటున్నారు. మారుతి ముందుగానే... దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో సగం వాటా కలిగిన మారుతి సుజుకి ఇండియా ఈ విషయంలో ముందంజలోనే ఉంది. ఎస్‌క్రాస్, సియాజ్, బాలెనో, ఎర్టిగా, ఇగ్నిస్, న్యూ డిజైర్, సెలెరియో మోడళ్లు అత్యాధునిక భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ మేరకు ధ్రువీకరణ కూడా లభించింది. మారుతి సుజుకి ఇండియా పోర్ట్‌ఫోలియోలో 75–80% కార్లు ఈ నిబంధనలకు సరితూగుతున్నవి కావడం గమనార్హం. ఎయిర్‌బ్యాగులు, వేగ హెచ్చరికల వంటి ఫీచర్లను చాలా మోడళ్లలో మారుతి ఇప్పటికే అందిస్తోంది. ఇతర కార్ల కంపెనీలు కూడా నిబంధనల అమలుకు సిద్ధంగానే ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉండటమే కారణం. టయోటా కూడా మారుతి మాదిరిగానే డ్రైవర్, సహ ప్రయాణికులకు ఎయిర్‌బ్యాగులను ఆఫర్ చేస్తోంది. కంపెనీల సంసిద్ధత: ప్రభుత్వ నిర్ణయాన్ని టయోటా స్వాగతించింది. సరైన దిశగా వేసిన అడుగుగా దీన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అభివర్ణించారు. ప్రమాదంలో కారు ముందుభాగంలో ప్రభావాన్ని అంచనా వేసే పరీక్షల విషయంలోనూ మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇది గంటకు 64 కిలోమీటర్ల వేగం స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండగా, మన దేశంలో అది 56 కిలోమీటర్ల వద్దే ఉన్నట్టు తెలిపారు. నిబంధనల అమలు విషయంలో ఎటువంటి సమస్యల్లేవని హోండా కార్స్ సైతం స్పష్టం చేసింది. నిబంధనల అమలుకు కార్ల తయారీదారులు సిద్ధమేనని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్సేన్ పేర్కొన్నారు. ఇంకా ఏడాదికిపైగా సమయం ఉందన్నారు. అయితే కార్లలో భద్రతా వ్యవస్థలైన ఎయిర్‌బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటితోనే భద్రత వచ్చేస్తుందన్నది తప్పుడు అభిప్రాయమని కంపెనీలు చెబుతున్నాయి. సౌకర్యాలతోనే భద్రత సాధ్యం కాదు... ‘‘నూతన వ్యవస్థలను ఏర్పాటువల్ల కార్ల బరువు గణనీయంగా పెరగబోదని ఇంజనీర్లు నిర్ధారించాలి. లేదంటే అధిక బరువు కారణంగా ఇంధన సామర్థ్యం, పనితీరు తగ్గిపోతాయి కస్టమర్లకు ఇవే ముఖ్యమైనవి. అన్ని అంశాలను సమతుల్యం చేయడమే సవాలు. మరణాలను తగ్గించడానికి కారును భద్రంగా మార్చడం ఒక్కటే సరిపోదు’’ అని మారుతి సీనియర్ ఈడీ సీవీ రామన్ వివరించారు. ♦ మన దేశంలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో 2020 నాటికి ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలన్నది లక్ష్యం. ♦ కార్లలో వేగ హెచ్చరికలను ఏర్పాటు చేస్తే కారు 80 కిలోమీటర్ల వేగం దాటిన వెంటనే ఆడియో రూపంలో హెచ్చరికలు వినిపిస్తాయి. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా వేగాన్ని గనుక పెంచితే 100 కిలోమీటర్లు దాటిన వెంటనే హెచ్చరికలు మరింత పెద్దగా వినిపిస్తాయి. 120 కిలోమీటర్లు దాటిపోతుంటే సందేశాలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ♦ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే దాన్ని ధరించాలంటూ అలార్మ్ మోగుతుంటుంది. సీట్ బెల్ట్ ధరించిన తర్వాతే అది ఆగిపోతుంది. మాన్యువల్‌గా దాన్ని ఆఫ్ చేయడానికి అవకాశం ఉండదు. ♦ కార్లను వెనక్కి తిప్పే సమయంలో సెన్సార్ల వల్ల కారుకు ఏవైనా అడ్డుగా ఉంటే ఆ విషయం డ్రైవర్‌కు తెలుస్తుంది. -
ఆపదలోనూ అదృష్టం
ప్రాణాలు కాపాడిన ఎయిర్ బ్యాగ్‌లు వెంట్రుక వాసిలో తప్పిన పెను ప్రమాదం బాలరాజుకు తప్పిన ప్రాణాపాయం సీట్ల మధ్యన ఇరుక్కుని సతీష్‌వర్మ గాయాల పాలు నర్సీపట్నం : ఆపదలోనూ అదృష్టమంటే ఇదేనేమో. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి బాలరాజుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆ కోవలోకే వస్తుందేమో. జరిగిన ప్రమాదం తీవ్రమైనదైనా, బాలరాజు, కాంగ్రెస్ నాయకుడు సతీష్ వర్మ గాయాలతో బయిటపడడం చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. కారులోని ఎయిర్ బ్యాగ్‌లు వారి ప్రాణాలు కాపాడడంతో కీలక పాత్ర పోషించగా, చెట్లను, కరెంటు స్తంభాన్ని ఢీకొనకుండా కారు కాస్త పక్కగా పోవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఓ సన్నిహితుడి వివాహానికి బుధవారం జంగారెడ్డి గూడెం వెళ్లిన బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు సతీష్ వర్మ, ఇద్దరు గన్మెన్లతో కలిసి బాలరాజు కొత్తగా కొన్న మహీంద్రా కారులో రాత్రి తిరుగుపయనమయ్యారు. తెల్లవారు జామున మూడున్నర, నాలుగు గంటల మధ్య నాతవరం మండలం ములగపూడి, బెన్నవరంల మధ్య డ్రైవరు నిద్ర మత్తు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు కుడిపక్కగా ఉన్న రెండు చెట్లను రాసుకుంటూ కారు దూసుకుపోయి నిలిచిపోయింది. సంఘటన జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత అధికార వాహనం అప్పగిం చిన బాలరాజు ఈ కొత్త కారు కొనుగోలు చేశా రు. ఈ కారు వల్లే ప్రాణాలు నిలిచాయని స్థాని కులు అంటున్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పారు. స్పెషల్ వార్డులో చికిత్స విశాఖపట్నం, మెడికల్: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి బాలరాజు విశాఖలోని కేజీహెచ్‌లో మెన్స్ స్పెషల్వార్డులో చికిత్స పొందుతున్నారు. సతీష్‌వర్మ, మరో గన్‌మెన్ కూడా అక్కడే చికిత్స పొందుతున్నారు. బాలరాజుకు ముఖం కుడిభాగం, ఎడమ మోచేయి, మోకాలు భాగాల్లో చర్మం తెగిపోవడంతో సుమారు 100 వరకూ కుట్లు వేసినట్లు చికిత్స నందిస్తున్న ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ముఖం భాగంలో ఫ్రాక్చర్లు కనపడలేదన్నారు. సతీష్ వర్మకు కాలు విరిగిపోవడంతో అత్యవసర ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేసినట్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ బి.ఉదయ్‌కుమార్ తెలిపారు. మంత్రి గంటా పరామర్శ విశాఖపట్నం, మెడికల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలరాజును రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు గురువారం రాత్రి పరామర్శించారు. ప్రమాదానికి గురైన సంఘటన వివరాలను బాలరాజును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కేజీహెచ్ సీఎస్ఆర్ఎం ఓ బంగారయ్య, కేఎస్‌ఎల్‌జీ శాస్త్రిలను ఆదేశించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు గన్మెన్లను కూడా పరామర్శించారు. బాలరాజును అరకు ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు తదితరులు పరామర్శించారు. -
లక్ష డాలర్ల కారు తుక్కుతుక్కు
ఇంటిలో ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టుకున్నట్టు అనిపించినా... అమెరికాలో ప్రభుత్వాధికారులు రూల్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారో నిరూపిస్తోంది ఈ ఉదంతం. డబ్బు తీసుకునో, డబ్బును దృష్టిలో పెట్టుకునో అక్కడ రూల్స్‌ను మార్చడాలు, రూల్స్‌ను పట్టించుకోకపోవడాలూ ఏమీ ఉండవని నిరూపిస్తోంది ఈ సంఘటన. ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో లక్ష డాలర్ల విలువజేసే వాహనాన్ని నిలువునా నాశనం చేసి పెట్టారు! మరోసారి ఇంకెవరూ ఇలాంటి పనులకు పూనుకోకుండా తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. అత్యవసర సమయాల్లో రక్షణగా ఉండే ఎయిర్ బ్యాగ్‌లు లేకుండా వాహనాలు తయారు కాకూడదు, తయారైనా.. వాటిని ఎవరూ వినియోగించకూడదనేది అమెరికాలో వాహనాలకు సంబంధించిన ఒక సేఫ్టీ లా. దీన్ని పట్టించుకోకుండా తయారై, రోడ్డుమీదకు వచ్చిన వాహనం పరిస్థితి ఇది. ల్యాండ్ రోవర్ డిఫెండర్- బండి మోడల్ పేరు ఇది. ధర లక్ష డాలర్లు. అంటే దాదాపు 65 లక్షల రూపాయలు. ఇంత ఖరీదైన వాహనాన్ని ‘ఎయిర్ బ్యాగులు లేవు’ అనే ఏకైక కారణం చెప్పి ధ్వంసం చేశారు యూఎస్ అధికారులు! కనీసం వంద కిలోమీటర్లు కూడా నడవని ఈ వాహనాన్ని సీజ్ చేసి, జేసీబీ సాయంతో తుక్కు చేశారు. మరి నిబంధనలను అతిక్రమించి.. అలాంటి వాహనాన్ని ఎలా ఉత్పత్తి చేశారు... అంటే ఇది అమెరికాలో తయారుచేసింది కాదు. బ్రిటన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాహనమిది. అనుకోకుండా ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. అక్రమపద్ధతిలో దిగుమతి చేసుకున్న ప్రమాణాలకు తగ్గస్థాయిలో లేని ఈ వాహనాన్ని నాశనం చేసి... దానికి సంబంధించి ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేశారు పోలీసులు. ఇకపై ఎవరైనా ఇలా అక్రమంగా వాహనాలను దిగుమతి చేసుకుంటే ఇలాంటి పరిస్థితి తప్పదు... అనే హెచ్చరిక జారీ చేశారు. లక్షడాలర్లు ఖర్చు చేసి వాహనాన్ని కొని, ఇలా నాశనం చేయించుకునే ధైర్యం ఎవరికైనా ఉంటుందా?