చూడటానికి స్టయిలిష్‌ తలపాగ..పెట్టుకుంటే క్షణాల్లో తలనొప్పి మాయం! | This Airbag Device Looks Stylist Hair Cap Get Rid Of A Headache | Sakshi
Sakshi News home page

చూడటానికి స్టయిలిష్‌ తలపాగ..పెట్టుకుంటే క్షణాల్లో తలనొప్పి మాయం!

Published Sun, Nov 5 2023 2:30 PM | Last Updated on Sun, Nov 5 2023 3:00 PM

This Airbag Device Looks Stylist Hair Cap Get Rid Of A Headache - Sakshi

శారీరక, మానసిక శ్రమల్లో ఏది ఎక్కువైనా అలసటతో ముందు తలనొప్పి వస్తుంది చాలామందికి. దాంతో ముఖం వాడిపోతుంది. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది చిత్రంలోని ఈ వార్మింగ్‌ ఎయిర్‌ మసాజర్‌. ఇది తలనొప్పిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దాంతో ముఖంలో సరికొత్త గ్లో వస్తుంది. చూడటానికి ఈ డివైస్‌ ఓ ఫ్యాషన్‌  హెయిర్‌ క్యాప్‌లా స్టయిలిష్‌గా కనిపిస్తుంది.

మెషిన్‌  మీద అందంగా పింక్‌ కలర్‌ క్లాత్‌తో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌ అధునాతన తలపాగా మాదిరి ఆకట్టుకుంటుంది. దీన్ని తలకు బ్యాండ్‌ మాదిరి అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఇది క్షణాల్లో రిలాక్స్‌ చేస్తుంది. ఈ డివైస్‌ రిమోట్‌పైన డ్యూయల్‌ హీటింగ్, మసాజింగ్‌ యాక్షన్‌  వంటి ఆప్షన్స్‌ ఉంటాయి. ఇందులోని పింక్‌ కలర్‌ ఎయిర్‌బ్యాగ్‌ థర్మోప్లాస్టిక్‌ పాలీయూరితేన్‌  మెటీరియల్‌తో రూపొందగా.. ఎయిర్‌ ట్యూబ్‌ సిలికాన్‌తో రూపొందింది. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఇది ఆఫ్‌ అవుతుంది. 50 డిగ్రీల సెల్సియస్‌ (122 డిగ్రీల ఫారెన్‌ హీట్‌)తో ఇది మసాజ్‌ని అందిస్తుంది.

దీన్ని వినియోగించడం చాలా సులభం. ఏ పని చేసుకుంటున్నా దీని రిమోట్‌ని ఏ జేబులోనో వేసుకుని.. లేదా ఎదురుగా ఉండే బల్ల మీద పెట్టుకుని.. సులభంగా తలకు ఈ డివైస్‌ని తగిలించుకుని రిలాక్స్‌ కావచ్చు. భలే ఉంది కదూ! ఇలాంటి మోడల్స్‌లో మరిన్ని ఆప్షన్స్‌తో మసాజర్స్‌ మార్కెట్‌లో అమ్ముడుపోతున్నాయి. అయితే ధరల విషయంలో వ్యత్యాసం ఉంటుంది.  

(చదవండి: ఈ డివైజైలో తక్కువ ఆయిల్‌తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!​)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement