Turban
-
మన్మోహన్ సింగ్ డ్రైస్సింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే..!
ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి, ప్రముఖులు, సెలబ్రిటీలు నివాళులర్పించారు. మౌనమునిగా కనిపించే గొప్ప రాజనీతిజ్ఞుడు. తానెంటనేది చేతల ద్వారానే చూపించే గొప్ప దార్శనికుడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను, విమర్శలను చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తూ..తన విలువేంటో చాటిచెప్పేవారు. అంతేగాదు తాను కూల్‌గా కనిపించినా..టైం వస్తే ఎలా దూకుడుగా వ్యవహరిస్తానో తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశానికి తెలిసొచ్చేలా చేశారు. అంతటి మహనీయుడు ఈ రోజు మన కళ్లముందు లేకపోయినా..ఆయన వదిలిన కొన్ని మధురమైన మాటలు, గడ్డు పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే మన్మోహన్ వ్యవహార శైలికి తగ్గట్టుగానే ఆయన ఆహార్యం ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుంది. బహుశా ఈ స్టైల్‌తోనే ప్రత్యర్థులను మారుమాట్లడనీయకుండా తన మాటే శాసనమయ్యేలా చేసేవారిని చెబుతుంటారు అంతరంగికులు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ దుస్తుల వార్డ్రోబ్ గురించి తెలుసుకుందామా..!రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిసిక్కుగా ఘనత దక్కించుకున్న మృదుస్వభావి మన్మోహన్ సింగ్(Manmohan Singh). ఆయన ఎక్కువగా తెల్లటి కుర్తా, నెహ్రూ మాదిరి జాకెట్లు , నీలిరంగు తలపాగతో కనిపించేవారు. ఈ వేషధారణ తాను కార్యచరణకు, ప్రగతికి పెద్దపీట వేసే వ్యక్తి అని చెప్పకనే చెబుతోంది. ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాన్ ప్రధాని ధరించి దుస్తులు దేశాన్ని నడిపించే బాధ్యతయుతమైన పనిలో ఉన్న వ్యక్తి ఆహార్యానికి అద్దంపట్టేలా ఉంటాయని అన్నారు. మన దేశ సంస్కృతిని తెలియజెప్పేలా ఆయన ధరించే నీలిరంగు తలపాగ(sky-blue turbans), తెల్లటి కుర్తా పైజామాలు ఉంటాయని ప్రశంసించారు. అంతేగాదు మాజీ ప్రధాని మన్మోహన్ ఆధునాతనంగా కనిపించేలా గౌరవప్రదమైన డ్రెస్సింగ్‌ని ఎంచుకుంటారని చెప్పారు. ప్రశాంతంగా కనిపించే తన వ్యవహారశైలికి సరిపోలిన డ్రెస్సింగ్ స్టైల్ అని అభిర్ణించారు డిజైనర్ తరుణ్. అంతేగాదు ఆయన ధరించే నీలిరంగు తలపాగా మన్మోహన్ ట్రేడ్‌మార్క్ అని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ(University of Cambridge)లో చదివిన నేపథ్యం తనలో అంతర్భాగమని తెలియజేప్పేలా ఆయన ఇలా ఎక్కువగా నీలి ఆకాశం రంగులోని తలపాగను ధరించేవారని సన్నిహితులు చెబుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ విధమైన రంగుల కలయికతో కూడిన దుస్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తికి సంకేతమని, పైగా సానుకూలంగా వ్యవహారం చక్కబెట్టుకునేలా చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు, నమ్రతతో, రిజర్వ్‌గా ఉంటే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్‌నే ఎంచుకుంటారని అన్నారు.(చదవండి: యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్‌గా యంగ్ రైటర్స్) -
Bihar: కొత్త డిప్యూటీ సీఎం తలపాగ వెనుక ఆసక్తికర కథ
పాట్నా: బిహార్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన సామ్రాట్ చౌదరి కాషాయ తలపాగా వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. గతంలో నితీశ్ బీజేపీని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సామ్రాట్ ఒక శపథం చేశారు. నితీశ్ కుమార్‌ను గద్దె దించిన తర్వాతే తాను తలపాగా తీస్తానని ప్రతిన పూనారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నితీశ్ తాజాగా బిహార్‌లో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో మీడియా ప్రతినిధులు సామ్రాట్‌కు తన తలపాగాపై ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సామ్రాట్ బీజేపీ తనకు రెండో తల్లిలాంటిదని, అయోధ్యకు వెళ్లినపుడు రాముడిని దర్శించుకునేందుకు తల వంచేందుకు వీలుగా తలపాగా తీసేస్తానని సామ్రాట్ నర్మగర్భంగా సమాధానిమిచ్చారు. సామ్రాట్ 2018లో నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూను వీడి బీజేపీలో చేరడం గమనార్హం. मुरेठा खोलने पर सम्राट बोले : मुरेठा के सम्मान में अगर मुझे अयोध्या जाकर सिर मुड़वाना पड़े तो मैं तैयार हूं#BiharCM #Bihar #BiharNews #BJP #SamratChaudhary @RJDforIndia @RohiniAcharya2 pic.twitter.com/bBOmAsDXiQ — FirstBiharJharkhand (@firstbiharnews) January 29, 2024 ఇదీచదవండి.. మోదీ మళ్లీ పీఎం అయితే.. ఖర్గే కీలక వ్యాఖ్యలు -
చూడటానికి స్టయిలిష్ తలపాగ..పెట్టుకుంటే క్షణాల్లో తలనొప్పి మాయం!
శారీరక, మానసిక శ్రమల్లో ఏది ఎక్కువైనా అలసటతో ముందు తలనొప్పి వస్తుంది చాలామందికి. దాంతో ముఖం వాడిపోతుంది. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది చిత్రంలోని ఈ వార్మింగ్ ఎయిర్ మసాజర్. ఇది తలనొప్పిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. దాంతో ముఖంలో సరికొత్త గ్లో వస్తుంది. చూడటానికి ఈ డివైస్ ఓ ఫ్యాషన్ హెయిర్ క్యాప్‌లా స్టయిలిష్‌గా కనిపిస్తుంది. మెషిన్ మీద అందంగా పింక్ కలర్ క్లాత్‌తో ఉన్న ఎయిర్‌బ్యాగ్ అధునాతన తలపాగా మాదిరి ఆకట్టుకుంటుంది. దీన్ని తలకు బ్యాండ్ మాదిరి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్షణాల్లో రిలాక్స్ చేస్తుంది. ఈ డివైస్ రిమోట్పైన డ్యూయల్ హీటింగ్, మసాజింగ్ యాక్షన్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోని పింక్ కలర్ ఎయిర్‌బ్యాగ్ థర్మోప్లాస్టిక్ పాలీయూరితేన్ మెటీరియల్‌తో రూపొందగా.. ఎయిర్ ట్యూబ్ సిలికాన్‌తో రూపొందింది. 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఇది ఆఫ్ అవుతుంది. 50 డిగ్రీల సెల్సియస్ (122 డిగ్రీల ఫారెన్ హీట్)తో ఇది మసాజ్‌ని అందిస్తుంది. దీన్ని వినియోగించడం చాలా సులభం. ఏ పని చేసుకుంటున్నా దీని రిమోట్‌ని ఏ జేబులోనో వేసుకుని.. లేదా ఎదురుగా ఉండే బల్ల మీద పెట్టుకుని.. సులభంగా తలకు ఈ డివైస్‌ని తగిలించుకుని రిలాక్స్ కావచ్చు. భలే ఉంది కదూ! ఇలాంటి మోడల్స్‌లో మరిన్ని ఆప్షన్స్‌తో మసాజర్స్ మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. అయితే ధరల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. (చదవండి: ఈ డివైజైలో తక్కువ ఆయిల్తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!) -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్‌పుత్‌లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్‌పుత్‌ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్‌పుత్‌లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్‌ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
క్షణాల్లో తలపాగా కట్టించి గిన్నిస్ రికార్డ్.. వీడియో వైరల్
భారతీయ సంప్రదాయంలో తలపాగాను వివాహాలు వంటి శుభకార్యాల్లో ధరిస్తారన్న సంగతి తెలిసిందే. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సిక్కులు మత పరంగా దీన్ని తప్పనిసరిగా ధరిస్తారు. టర్బన్ లేదా దస్తర్ పేర్లతో పిలిచే తలపాగాను ఎవరైనా కట్టుకుంటారు. కానీ క్షణాల్లో, మెరుపువేగంతో తలపాగా కట్టేయగలగడం ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య పచోలి అతి తక్కువ సమయంలోనే తలపాగాను కట్టించి గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. వృత్తిరీత్యా లాయర్ అయిన పచోలి తన వృత్తిని కొనసాగిస్తూనే, అభిరుచి మేరకు 15 ఏళ్లుగా తలపాగా కట్టే పని చేస్తున్నాడు. ఇటీవలె ఓ వ్యక్తికి కేవలం 14.12 సెకన్లలోనే తలపాగా చుట్టేసి ఆదిత్య రికార్డ్ సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వైరల్ వీడియోపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు పచోలి టాలెంట్‌కు ఫిదా అవుతుందటే, మరికొందరు మాత్రం గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేస్తూ దాని విలువను కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
తలపాగే ప్రాణాలను కాపాడింది
కెనడా: మనం వెళ్లున్నప్పుడో లేక ఎక్కడకైన వెళ్లినపుడు అనుకోకుండా అప్పటి వరకు మనతో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లను ఏ విధంగా రక్షించాలన్న ఆలోచనతో గందరగోళంలోకి వెళ్లిపోతాం. మహా అయితే ఎవరినైన సాయం చేయమని అడుగుతాం తప్ప మన వరకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనే స్ఫూరించదు. కానీ కెనడాలోన ఒక పార్కులోని ఇద్దరూ వ్యక్తులు పార్క్ దగర ఉండే నీటిలో పడిపోతే వారిని ఐదుగురు సిక్కులు తమ వద్ద రక్షించేందకు కావల్సినవి ఏమి లేకపోయినప్పటికీ వాళ్లు తలపాగనే తాడుగా చేసి మరీ వాళ్లను కాపాడతారు. (చదవండి: బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) వివరాల్లోకెళ్లితే....కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్‌లో కుల్జీందర్ కిండా అనే అతను తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తూ అనుకోకుండా ఇద్దరూ అక్కడ ఉన్న జారుడు బడ్డ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోతారు. దీంతో ఆ పార్క్‌లో ఉన ప్రజలు ఇద్దరూ వ్యక్తులు ఎవరో పడిపోయారు కాపాడంటూ అని అరుస్తారు. అటుగా వాకింగ్ చేస్తూ వస్తున్న ఐదుగురు సిక్కు స్నేహితులు ఏం జరిగిందని అక్కడి వాళ్లని అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు వాళ్లను ఏ విధంగా రక్షించాలో మొదట వాళ్లకు అర్థం కాలేదు . ఇంతలో తమ తలపాగనే తాడుగా చేసి రక్షింద్దాం అనే నిర్ణయానికి వస్తారు వాళ్లు. ఈ క్రమంలో ఆ ఐదుగురు స్నేహితులు తమ తలపాగలను, ఆఖరికి తమ దుస్తులను కూడా జత చేసి తాడుగా మార్చి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కొతసేపటి వాళ్లు సురక్షితంగా బయటపడతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏమి ఆలోచన మీది, మీరు చాలా గ్రేట్ అంటూ రకరకాలుగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) A video of the incident on Monday, in which five Sikh hikers tied their dastaars (turbans) together to save a man who had slipped and fallen at the Lower Falls at Golden Ears Park. Video courtesy @globalnews Kudos to these young men on their quick thinking and selflessness. pic.twitter.com/XQuX27OH5i — Sikh Community of BC (@BCSikhs) October 16, 2021 -
సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో
న్యూయార్క్: అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి(26)కి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం. అయితే, పూర్తి స్థాయిలో మతపరమైన వెసులుబాట్లు కల్పించకుంటే కోర్టుకెళతానని అతడు పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సుఖ్బీర్ సింగ్ 2017లో మెరైన్స్లో చేరారు. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోషన్ అందుతుందని సుఖ్బీర్ సింగ్ తూర్ సుఖ్బీర్సింగ్ తూర్ న్యూయార్క్‌టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. చదవండి: (మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ) భారత్ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్బీర్కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ‘సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతడిని గుర్తుపడతారు’అని మెరైన్‌వర్గాలు అంటున్నాయి. యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి. దీనిపై సుఖ్బీర్ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయని న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!) -
ఒబామా మెచ్చిన తలపాగా
ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జివాన్‌దీప్. శాన్ డియాగోకు చెందిన ఈయన ఎల్‌జీబీటీక్యూలు జరుపుకునే ప్రైడ్ మంత్ ఉత్సవాల్లో భాగంగా ధరించిన ఇంద్ర ధనుస్సు రంగుల తలపాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను ముగ్ధుడిని చేసింది. ప్రైడ్ మంత్ ఉత్సవాలు ప్రారంభమైన జూన్ 1న జివాన్‌దీప్ ట్విట్టర్లో పెట్టిన ఈ ఫోటోకు లక్షకుపైగా లైకులు 15వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. బైసెక్సువల్ అయిన జివాన్ ఈ ఫోటోకు ‘బై సెక్సువల్ బ్రెయిన్ సైంటిస్టయినందుకు గర్వంగా ఉంది. నా గుర్తింపునకు సంబంధించిన అన్ని అంశాలను(తలపాగా, గడ్డం) వ్యక్తీకరించగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే స్వేచ్ఛను ఇతరులు కూడా ప్రదర్శించేలా చూసేందుకు కృషి చేస్తాను’అని కేప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోకు తాజాగా ఒబామా కూడా లైక్ కొట్టారు. ‘జివాన్‌దీప్ మీరు గర్వపడే పని చేశారు . ఈ దేశంలో గేలకు మరింత సమానత్వం కల్పించేందుకు మీరు చేసిన కృషికి ధన్యవాదాలు...అన్నట్టు.. మీ తలపాగా అద్భుతంగా ఉంది. అందరికీ ప్రైడ్ మంత్ శుభాకాంక్షలు.’అని ఒబామా ట్వీట్ చేశారు. జూన్ 4న ఒబామా చేసిన ఈ ట్వీట్‌కు 3 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒబామా, కెనడా ప్రధాని ట్రూడో ఎల్జీబీటీక్యూలకు మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. 1969 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ లు ప్రైడ్ మంత్ జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం అమెరికాలోని గ్రీన్విచ్ గ్రామంలోని ఒక బారులో గేలు సంబరాలు చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా గేలు హక్కుల కోసం ఉద్యమించారు.ఫలితంగా ఇతరులతో పాటు సమానంగా హక్కులు సాధించారు. ఆ ఘటనకు గుర్తుగా ప్రతీ జూన్‌లో ఎల్‌జీబీటీక్యూలు ప్రైడ్ మంత్ నిర్వహిస్తారు. -
తలపాగాతో ప్రవేశానికి అమెరికా బార్ నో
న్యూయార్క్: తలపాగా ధరించిన కారణంగా అమెరికాలో ఓ సిక్కు యువకుడిని బార్లోకి అనుమతించలేదు. అర్థరాత్రి దాటిన తన స్నేహితుడి కలుసుకోవడానికి వెళ్లిన ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు మీడియా పేర్కొంది. గురువీందర్ గ్రేవల్ అనే యువకుడు అర్థరాత్రి తర్వాత తలపాగాతో పోర్ట్ జెఫర్‌సన్‌లోని హర్బర్ గ్రిల్ బార్కి వెళ్లాడు. అక్కడి భద్రతా సిబ్బంది తలపాగా ఉన్న కారణంగా అతడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది తమ సాంప్రదాయం అని మేనేజర్‌కి వివరించినా ప్రవేశానికి అనుమతించలేదని గురువీందర్ తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత హర్బర్ గ్రిల్ ఫేస్బుక్లో క్షమాపణలు తెలపడంతో పాటు వివరణ ఇచ్చింది. శుక్రవారం, శనివారాల్లో రాత్రి పది గంటల తర్వాత టోపీలు, హ్యాట్లు ధరించిరావడంపై నిషేధం విధించామని, అంతేకానీ సాంప్రదాయంగా ధరించేవాటిపై ఎలాంటి నిషేధం లేదని చెప్పుకొచ్చింది. -
అరుదైన గౌరవం.. అంతలోనే అపఖ్యాతి
లండన్ : పేరు ప్రఖ్యాతులు సాధించడం ఎంత కష్టమో వాటిని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చరణ్‌ప్రీత్ సింగ్ లాల్(22). బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తలపాగా ధరించి మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న సైనికుడిగా రికార్డు సృష్టించిన చరణ్‌ప్రీత్ సింగ్ ఎంతో కాలం గడవకముందే ఆ పేరును పొగొట్టుకోవడమే కాకా ఉద్యోగాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు. వివరాలు.. చరణ్‌ప్రీత్ సింగ్ బ్రిటన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రాణి ఎలిజబేత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొన్న ఏకైక సైనికుడిగా వార్తల్లో నిలిచాడు. ఇంత పేరు సాధించిన చరణ్‌ప్రీత్ సింగ్ గత వారం నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. చరణ్‌ప్రీత్ సింగ్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకున్నట్లు ఈ టెస్ట్‌లో తేలీంది. దాంతో త్వరలోనే అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఆర్మీ అధికారి ఒకరు ‘చరణ్‌ప్రీత్ సింగ్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నామో.. ఇప్పుడు అతను చేసిన పని అంత ఇబ్బందికరంగా మారింది. సైనికులందరికి అప్పుడప్పుడు ఇలా డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తుంటాం. ఈ సారి చరణ్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సైనికులు కూడా మత్తు పదర్ధాలు తీసుకున్నట్లు తెలిసింద’ని తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన చరణ్‌ప్రీత్ సింగ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్‌కి వలస వెళ్లాడు. చదువు పూర్తయిన తరువాత 2016, జనవరిలో సైనికుడిగా బ్రిటీష్ ఆర్మీలో చేరాడు. -
‘భాజీ.. మీ లుక్ అస్సలు బాలేదు’
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్బజన్ సింగ్ బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టడమే కాదు.. తనకు ఉచిత సలహాలు ఇచ్చిన వారికి దిమ్మ తిరిగే సమాధానాలు ఇవ్వడంలోనూ దిట్ట. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపించాడు భజ్జీ. విషయమేమిటంటే.. సీఎస్కే జట్టుతో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో హర్బజన్ క్యాప్ ధరించి.. తోటి ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్న వీడియో ఒకటి ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన ఓ నెటిజన్.. ‘భాజీ.. (వయసులో నాకంటే చిన్న వారైనా మీరెంతో సాధించారు. అందుకే భాజీ అని సంబోధిస్తున్నా) మీ ట్విటర్ అకౌంట్‌కు హర్బజన్ టర్బోనేటర్ అని పేరు పెట్టుకున్నారు కదా. మరి మీరు చిన్న జడతో కూడిన పర్కా (సిక్కులు ధరించే తలపాగా వంటిది) ధరించవచ్చు కదా. అప్పుడే నిజమైన సర్దార్‌లా ఉంటారు. ప్రస్తుతం మీ లుక్ విసుగు తెప్పిస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందనగా హర్బజన్.. ‘భాయ్ మీ ఇంటి ఙ్ఞానాన్ని నాకు పంచకండి. ఒక సర్దార్ ఎలా ఉండాలో మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదం’టూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. Was that you ???? Ufff 🙈🙈 @DJBravo47 according to @mvj888 it was you 💨💨💨 @ChennaiIPL #nofartzone 😜 pic.twitter.com/UcnA6UdkSh — Harbhajan Turbanator (@harbhajan_singh) May 3, 2018 Bhaji... (U r younger to me inspite of that I said Bhaji to u becoz ur acheivments r much better then me) u kept title Harbhajan Turbanator.If u can't afford to wear Turban.Pls wear patka with little juda So u look Sardar.presant look is disgusting. https://t.co/j6Zikk8a79 — Mitwa (@Mitwa34Mitwa) May 3, 2018 -
తలపాగా మాకు అంగీకారమే: ఫిబా
వాషింగ్టన్: అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఆడే సిక్కు క్రీడాకారులకు ఊరట లభించింది. తమ సంప్రదాయక తలపాగా (టర్బన్) ధరించి ఆడటంపై ఉన్న నిషేధాన్ని అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఫిబా) ఎత్తివేసేందుకు నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌లో గత నెల 27, 28న జరిగిన ‘ఫిబా’ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిబంధన మార్పునకు మద్దతు ప్రకటించారు. 2014లో చైనాలో జరిగిన ఫిబా ఆసియా కప్‌లో పాల్గొన్న ఇద్దరు భారత సిక్కు ఆటగాళ్లను తలపాగా తొలగించి ఆడాల్సిందిగా రిఫరీ సూచించారు. అలా చేయకపోతే ‘ఫిబా’ అధికారిక నిబంధనను అతిక్రమించినట్టు అవుతుందని చెప్పారు. ఆటగాళ్లు ఎలాంటి వస్తువులను ధరించి పోటీల్లో పాల్గొనకూడదని, అవి ఇతరులను గాయపరిచే అవకాశం ఉందని ‘ఫిబా’ నిబంధన సూచిస్తోంది. దీంతో అప్పటి నుంచి ఈ నిబంధనపై వ్యతిరేకత వ్యక్తమవుతుండగా ఎట్టకేలకు ‘ఫిబా’ దీన్ని మార్చేందుకు అంగీకరించినట్టయ్యింది. -
నిజమైన హీరో అంటే ఈ తాతయ్యనే!
65 ఏళ్ల అవతార్ హోతి, ఆయన కొడుకు పాల్ ఎప్పటిలాగే తమ పంటపొలంలో పనిచేసకుంటున్నారు. వీరి పొలానికి పక్కనే నార్త్ తాంప్సన్ నది కాలువ ఉంది. చలికాలం కావడంతో చల్లటి నీటితో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇంతలోనే ఓ 14 ఏళ్ల అమ్మాయి అరుపులు-కేకలు వినిపించాయి. నదిలో కొట్టుకుపోతూ ఆమె సాయం కోసం అర్థించింది. వెంటనే అవతార్, పాల్ నది దగ్గరకు వెళ్లి చూశారు. కెరటాల్లో కొట్టుకుపోతూ బాధితురాలు కేకలు వేస్తోంది. పాల్‌కు ఏం చేయాలో తోచలేదు. కానీ చురుగ్గా ఆలోచించిన హోతి మాత్రం వెంటనే తలపాగా తీసి.. సాయంగా బాధితురాలి కోసం విసిరాడు. ఆమె దానిని అందుకొని సురక్షితంగా బయటపడింది. నదిలో కొట్టుకుపోతున్న షాక్‌లో ఉన్న ఆమెకు తండ్రీకొడుకులు ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. భారత సంతతికి చెందిన 65 ఏళ్ల హోతిని ఇప్పుడు కెనడాలో అందరూ నిజమైన హీరో అని పొగుడుతున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం కేమ్లూప్స్లో ఉంటున్న ఆయన చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నదిలో కొట్టుకుపోతున్న అమ్మాయికి తలపాగాను తాడులా అందించి.. ఒడ్డుకు తీసుకురావడమే కాదు.. చలినీటిలో గడ్డకట్టుకుపోయిన ఆమె కోలుకునేలా తండ్రీ-కొడుకులు సపర్యలు చేశారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలిని తమ కారులో సమీపంలోని ఆమె బామ్మ ఇంట్లో వదిలిపెట్టి వచ్చామని పాల్ తెలిపాడు. సమయస్ఫూర్తితో తన తండ్రి చేసిన సాహసం తనకు గర్వకారణంగా ఉందని అతను సీబీసీ న్యూస్‌కు తెలిపాడు. -
అమెరికా దాష్టీకం!
సాన్ ఫ్రాన్సిస్కో: అతడు చిన్న వయస్సులోనే అమెరికాలోని సిక్కులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఓ పుస్తకం రాశాడు. 'బుల్లియింగ్ ఆఫ్ సిఖ్ అమెరికన్ చిల్డ్రన్: థ్రూ ద ఐస్ ఆఫ్ ఏ సిఖ్ అమెరికన్ హై స్కూల్ స్టూడెంట్' పేరిట 18 ఏళ్లకే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకంపై ఉపన్యాసించేందుకు, సిక్కు పిల్లల్లో స్ఫూర్తి రగిలించేందుకు అతిథిగా అతన్ని ఓ యూత్ సమావేశాలకు ఆహ్వానించారు. కానీ ఈ సమావేశాలకు వెళుతుండగానే అమెరికాలో సిక్కుల పట్ల ఎలాంటి వివక్ష ఉంటుందో అతనికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. సిక్కు-అమెరికన్ అయిన కరణ్వీర్ సింగ్ పన్ను తలపాగాను కాలిఫోర్నియా విమానాశ్రయ సిబ్బంది బలవంతంగా అతనితోనే తీయించారు. న్యూజెర్సీకి చెందిన కరణ్వీర్ సింగ్ కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్‌లో జరుగనున్న సిక్కు యూత్ సమావేశాలకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 'కాలిఫోర్నియా ఎయిర్‌పోర్టులో మెటల్ డిటెక్టర్ నుంచి వెళ్లిన తర్వాత నా తలపాగా తొలగించామని సిబ్బంది అడిగారు. అనంతరం పేలుడు పదార్థాలు ఉన్నాయా? అని స్వాబ్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలినా మరోసారి తనిఖీలకు తీసుకెళ్లారు. అక్కడ నా చేత తలపాగాను పూర్తిగా తీయించి.. మరోసారి తలపాగాను స్కాన్ చేశారు. తలపాగా తీయడానికి నేను మొదట నిరాకరించాను. కానీ తలపాగా తీయకుంటే నిన్ను విమానం ఎక్కనివ్వబోమని బెదరించారు. దాంతో నేను అంగీకరించాను. ఆ తర్వాత తలపాగా చుట్టుకోవడానికి సిబ్బంది ఓ అద్దం నాకు ఇచ్చారు' అని కరణ్వీర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. నీ తలపాగాలో ఏమైనా ఉందా? అని సిబ్బంది తనను అడిగారని, అయితే, నా తలపాగా కింద పొడవైన వెంట్రుకలు, దానికింద మెదడు ఉన్నాయని మర్యాదపూర్వకంగా వారికి సమాధానమిచ్చినట్టు అతను చెప్పాడు. సిక్కు యువకుడికి జరిగిన అవమానంపై స్పందించడానికి అమెరికా ట్రాన్స్ పోర్టెషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) నిరాకరించింది. ప్రయాణికులందరి పట్ల హుందాగా నడుచుకోవాలని సిబ్బందికి తాము ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తోంది. -
ఆ సిక్కు నటుడికి ఎయిర్ లైన్స్ క్షమాపణ
న్యూయార్క్: ఎయిర్ పోర్టులో అవమానానికి గురైన సిక్కు నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాకు ఎరోమెక్సికో క్షమాపణలు చెప్పింది. రెండు రోజుల క్రితం మెక్సికో ఎయిర్ పోర్టులో తలపాగా విప్పని కారణంగా సిక్కు నటుడిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. ఈ విషయమై అతనికి కలిగిన అసౌకర్యానికి ఆ అధికారులు విచారం వ్యక్తం చేస్తూ క్షమించమని కోరారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలన్న దానిపై కాస్త స్పష్టత తీసుకొచ్చారు. ప్రయాణికుల మత విశ్వాసాలను గౌరవించాలని, అన్ని మతాల వారిని ఒకేతీరుగా చూడాలని ఎరో మెక్సికో అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్యూరిటీ అంశాలపై జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రయాణికులను అగౌరవపరచరాదని సిబ్బందికి సూచించింది. న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి మంగళవారం పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కచ్చితంగా పాల్గొనాలని, తాను లేకపోతే షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా ఎరోమెక్సికో ప్రయాణికులతో ప్రవర్తించాల్సిన అంశాలపై కొన్ని ప్రకటనలు జారీచేస్తూ నటుడు వారిస్ అహ్లువాలియాకు క్షమాపణలు తెలిపారు. -
సిక్కు నటుడికి చేదు అనుభవం
మెక్సికో: సిక్కు జాతీయుడికి మెక్సికో ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాను మెక్సికో ఫ్లైట్ సిబ్బంది మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. ఆ నటుడు మెక్సికో నుంచి న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే, తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. ఈ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి సిద్ధమైన సిక్కు వ్యక్తి ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి జాత్యహంకారానికి గురయ్యాడు. తాను లేకపోతే న్యూయార్క్ లో ఫ్యాషన్ షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. యూఎస్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు సెక్యూరిటీ నిమిత్తం కొన్ని రూల్స్ పాటించాలని సోమవారం తమకు ఆదేశాలు వచ్చాయని మెక్సికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అతడికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని... ప్రయాణికుల మత విశ్వాసాలను పక్కనబెట్టి నిబంధనలు పాటించడమే తమ బాధ్యత అని ఎయిర్ లైన్స్ అధికారులు వివరించారు. -
తలపాగా విప్పి నలుగురిని కాపాడాడు...
సంగ్రూర్ (పంజాబ్): మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి నలుగురు యువకుల ప్రాణాలు కాపాడేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడిని హీరోని చేసింది. అతడే 24 ఏళ్ల ఇందర్ పాల్ సింగ్. మత ఆచారాన్ని మించి అతడు చూపించిన మానవత్వానికి అందరూ జేజేలు కొడుతున్నారు. సిక్కులు అనే కాదు ఎవరైనా సరే వారి మత ఆచారాలను పక్కన పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం సాటి వ్యక్తులను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి తలపాగాను తీసి, మరో సిక్కు యువకుడి సహాయంతో వారిని రక్షించాడు. గణేష్ నిమజ్జనంలో భాగంగా సునం గ్రామానికి చెంవదిన నలుగురు యువకులు ఇంద్రపాల్ సింగ్, జీవన్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, ఇందర్ తివారీ కెనాల్ గోడపై నిలుచున్నారు. అనుకోకుండా ఒకే సారి పెద్ద ఎత్తున నీరు రావడంతో అదుపుతప్పి వాళ్లు నీళ్లలో పడిపోయారు. కెనాల్ లో నలుగురు యువకులు చిక్కుకుని కొట్టుకుపోవడాన్ని ఇందర్ పాల్ సింగ్ గమనించాడు. వీరిని కాపాడటానికి తొలుత ఒక వైరుని వీళ్లకి అందించాడు. కానీ అది తెగిపోవడంతో మరోదారిలేక అక్కడే గట్టుపై కూర్చున్న ఇంద్రపాల్ సింగ్ తన తలపాగాని తీసి వారికి ఇచ్చాడు. ఒడ్డు పైనే ఉన్న మరో సిక్కు యువకుడు ఆ తల పాగా సహాయంతో నలుగురు యువకులు నీళ్లలో కొట్టుకు పోకుండా ఒక్కొక్కరిని ఒడ్డుకు లాగి కాపాడాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోని చూసిన వారందరు ఇందర్ పాల్ చూపించిన మానవత్వానికి జేజేలు కొడుతున్నారు. -
మతాన్ని మించిన మానవత్వం...
-
మతం.. మానవత్వం.. ఫర్నిచర్
ఆక్లాండ్ మతం కన్నా మానవత్వం మిన్న అని నిరూపించాడో ఓ సిక్కు యువకుడు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాలుడిని కాపాడేందుకు, మత నిబంధనను కూడా పక్కన బెట్టిన ఆ యువకుడి తీరు ప్రశంసలందుకుంది. అతడి చొరవను మెచ్చుకున్న స్థానిక టీవీ చానల్ ఒకటి.. ఓ ఫర్నిచర్ షాపు సహకారంతో.. అతడి అపార్టుమెంటులో కావల్సిన మొత్తం ఫర్నిచర్ అంతటినీ ఉచితంగా అందించింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం.. 22 ఏళ్ల హర్మన్ సింగ్ తన అపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో రోడ్డు మీద కీచుమనే శబ్దంతో సడన్ బ్రేక్.. శబ్దం. మళ్లీ రయ్ మని దూసుకుపోయిన సౌండ్.. చిన్న పిల్లల అరుపులు, ఏడుపులు వినిపించాయి. అంతే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నాడు. అక్కతో కలిసి స్కూలుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. తలకు దెబ్బ తగలడంతో విపరీతమైన రక్తస్రావంతో బాలుడు ప్రమాదకర స్థితిలో పడి ఉన్నాడు. ముందు ఆ రక్తస్రావాన్ని ఆపాలి. ఎలా.. ఇంకేమీ ఆలోచించలేదు.. తన తలపై ఉన్న తలపాగా తీసి బాబుకు కట్టుకట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. ''నేను మతం గురించి గానీ, మరే విషయం గురించి గానీ ఏమీ ఆలోచించలేదు.. ఎలాగైనా కారుతున్న రక్తాన్ని ఆపాలి. అంతే.. అందుకే ఆలా చేశాను'' అన్నాడు హర్మన్ సింగ్. తనకు చాలా ఆనందంగా ఉందని, ఇపుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సింగ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. మానవత్వానికి పెద్దపీట వేసినందుకు చాలా మంది సిక్కులు కూడా అతణ్ని అభినందనల్లో ముంచెత్తారు. -
మతాచారం కంటే మానవత్వమే మిన్నగా..
ఆక్లాండ్: మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి ఒక బాలుడి ప్రాణాలు కాపాడిన 22 ఏళ్ల హర్మన్ సింగ్ హీరో అయ్యాడు. అతని మత ఆచారాన్ని మించిన మానవత్వానికి అందరూ జై జైలు కొడుతున్నారు. హర్మన్ సింగ్ న్యూజిలాండ్ లో అక్లాండ్ లో నివాసం ఉంటున్నాడు.. అదే ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు తన సోదరితో స్కూలుకి బయలుదేరాడు. మార్గమధ్యలో ఒక కారు ఆ బాలున్ని ఢీకొంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్న హర్మన్ సింగ్ వెంటనే అక్కడకి వెళ్లాడు. బాలుడికి తలనుంచి రక్తస్రావం అవ్వడం గమనించిన సింగ్ ఇంకో ఆలోచన లేకుండానే తన తల పాగాని తీసి బాలుడికి గాయమైన ప్రాంతంలో గట్టిగా కట్టాడు. తీవ్ర గాయాలతో అసుపత్రిలో చేరిన ఆ బాలుడి పరిస్థితి మొదట క్లిష్టంగా ఉన్న ప్రస్తుతం నిలకడగానే ఉంది. 'సిక్కు మత ఆచారం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో తల పాగాని తీయడం క్షమించరాని నేరం. నాకు తలపాగా మీద అపారమైన భక్తి ఉంది. కానీ ఆ సమయంలో మత ఆచారం గురించి ఆలోచించలేదు. ఆ ప్రమాదంలో గాయలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలున్ని రక్షించడమే నా కర్తవ్యంగా భావించాను' అని సింగ్ అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇదంతా గమనించిన గగన్ దిల్లాన్ అనే వ్యక్తి ఫోటో తీసి ఫేస్ బుక్‌లో పోస్టు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. పోస్టు చేసిన తక్కువ వ్యవధిలోనే హర్మన్ సింగ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి.