న్యూయార్క్: అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి(26)కి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం. అయితే, పూర్తి స్థాయిలో మతపరమైన వెసులుబాట్లు కల్పించకుంటే కోర్టుకెళతానని అతడు పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సుఖ్‌బీర్ సింగ్ 2017లో మెరైన్స్‌లో చేరారు. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోషన్ అందుతుందని సుఖ్‌బీర్ సింగ్ తూర్ సుఖ్‌బీర్‌సింగ్ తూర్ న్యూయార్క్‌టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. చదవండి: (మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ)
భారత్ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్‌బీర్‌కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ‘సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతడిని గుర్తుపడతారు’అని మెరైన్‌వర్గాలు అంటున్నాయి. యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి. దీనిపై సుఖ్‌బీర్ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయని న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!)
Comments
Please login to add a commentAdd a comment