Marine
-
ముంబై విక్టరీ పరేడ్‌లో భయానక దృశ్యాలు
ఉత్తర ప్రదేశ్ హత్రాస్‌లో తొక్కిసలాట మరువకముందే ముంబైలో మరోసారి జనాలు గుమ్మిగూడారు. టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందకు మెరెనాడ్రైవ్ జనసంద్రమైంది. ఈ సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకి చేరుకోవడంతో కొందరు స్పృహ తప్పి కిందపడిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు వద్ద అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు. అక్కడ నుంచి నారిమన్ పాయింట్‌కు వచ్చిన టీమ్ఇండియాకు భారీ సంఖ్యలో అభిమానులు అభినందనలు తెలిపారు. ఈ టీమిండియా విజయ యాత్ర సాగిన మెరైన్‌డ్రైవ్ రోడ్డు జన సంద్రాన్ని తలపించింది. ఎక్కువ సంఖ్యలో అభిమానులు కదలిరావడంతో పలువురు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.The Mumbai cop fighting with everything he’s got to take the girl to safety deserves a medal! 🫡 pic.twitter.com/Vuz5pN2pUV— Akshita Nandagopal (@Akshita_N) July 5, 2024 ఒకానొక సమయంలో ఓ యువతి స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు అభిమానులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, గాయపడిన అభిమానులు మాట్లాడుతూ.. ఒక్కసారిగా అక్కడికి భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. పోలీసులు కూడా వారిని నిలువరించలేకపోయారు. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు అభిమానులు గాయపడ్డారని చెప్పుకొచ్చారు. It seems the whole of #Mumbai has stepped out for the #VictoryParade It's pure magic ❤️ pic.twitter.com/skZXf3kvY1— Vertigo_Warrior (@VertigoWarrior) July 4, 2024 ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం హత్రాస్‌లో కూడా ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. భోలే బాబా నిర్వహించిన సత్సాంగ్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 121 మంది చనిపోయినట్టు యూపీ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఇక, ఈ ఘటన తెలిసి కూడా ముంబైలో ఇలా అభిమానులు గుమ్మిగూడటాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. -
దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్ ‘ఏపీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత సాధించింది. ఏపీని దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా గతంలోనూ మన రాష్ట్రం ఇదే అవార్డును దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ అధికారులు, సిబ్బందికి ట్విట్టర్ ద్వారా శనివారం అభినందనలు తెలిపారు. Govt. of AP, Agriculture Dept. - e-Crop Application gets SKOCH Award 2023. Hearty Congratulations to all concerned officers in the Department. pic.twitter.com/oLkr4BWYuB — Gopal Krishna Dwivedi IAS (@GKDwivediIAS) November 18, 2023 -
మళ్లీ మరీన్ చేతిలో...
ఒడెన్స్: పీవీ సింధు, కరోలినా మరీన్ మధ్య మంచి స్నేహం ఉంది. కోర్టులో ప్రత్యర్థులే అయినా కోర్టు బయట తమ సాన్నిహిత్యం గురించి వీరిద్దరు చాలా సార్లు చెప్పుకున్నారు. కానీ శనివారం ఇద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు అనూహ్య రీతిలో సాగింది. ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించే క్రమంలో అరుపులు, కేకలతో పాటు పలు మార్లు ఇద్దరూ అంపైర్ల హెచ్చరికకు కూడా గురయ్యారు. అయితే చివరకు 73 నిమిషాల సమరం తర్వాత భారత షట్లర్ పరాజయం పక్షానే నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉండగా, ఇప్పుడు అది 5–11కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్ సెమీ ఫైనల్లో సింధు ఓటమిపాలైంది. కరోలినా మరీన్ (స్పెయిన్) 21–18, 19–21, 21–7 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. ఇద్దరు ప్లేయర్లు తమదైన శైలిలో చెలరేగడంతో తొలి గేమ్ దాదాపు సమంగా సాగింది. విరామ సమయంలో సింధు 11–10తో ఒక పాయింట్ ముందంజలో ఉంది. ఆ తర్వాతా ఇదే కొనసాగి స్కోరు 18–18కి చేరింది. అయితే మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకొని గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు దూసుకుపోయింది. చకచకా పాయింట్లు సాధించిన ఆమె ఎక్కడా ఆధిక్యం తగ్గనీయకుండా 11–3కు చేరింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటించిన మరీన్ వరుసగా పాయింట్లు గెలుచుకొని అంతరాన్ని తగ్గించింది. సింధు 20–16తో ముందంజలో నిలిచిన తర్వాత మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో 20–19గా మారింది. కానీ స్మాష్‌తో పాయింట్ సాధించి సింధు గేమ్ గెలుచుకుంది. చివరి గేమ్ మాత్రం పూర్తి ఏకపక్షంగా మారిపోయింది. మరీన్ జోరు ముందు భారత షట్లర్ నిలవలేకపోయింది. ముందు 3–0, ఆపై 3–2...ఆ తర్వాత ఆమె జోరు సాగిపోయింది. వరుసగా 11 పాయింట్లు సాధించిన మరీన్ 14–2 దాకా వెళ్లింది. అనంతరం మ్యాచ్‌ను ముగించేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. మరీన్ అరుపులు... సింధు అసహనం పాయింట్లు సాధించినప్పుడు అతిగా భావోద్వేగాలు ప్రదర్శించవద్దని అంపైర్ ఇద్దరినీ పిలిచి మ్యాచ్‌లో పలు మార్లు వారించాడు. అయితే మరీన్ తన అరుపులను ఆపకపోగా, సర్వీస్ అందుకునేందుకు సింధు ఎక్కువ సమయం తీసుకుంది. తొలి గేమ్‌ను మరీన్ను మళ్లీ అంపైర్ హెచ్చరించాడు. మూడో గేమ్‌లో సర్వీస్ ఆలస్యానికి సింధును అంపైర్ ప్రశ్నించగా...‘ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా’ అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్ ఇద్దరికీ ‘ఎల్లో కార్డు’లు కూడా చూపించాల్సి వచ్చింది. -
మెరైన్ బీమాపై శ్రీరామ్ జనరల్ ఫోకస్
చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్‌రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
అమెరికా ఆర్మీ క్యాంపుల్లో కొందరు నేరగాళ్లు
అమెరికాలోని శాన్ డియాగోలోగల మెరైన్ కార్ప్స్ బేస్ క్యాంప్ పెండిల్టన్లోని బ్యారక్స్‌లో గతంలో తప్పిపోయిన 14 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఒక యూఎస్ మెరైన్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బాధిత బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆ బాలికను ఎవరో అక్రమంగా విక్రయించారని, ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. శాన్ డియాగో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఒక బాలిక జూన్ 9 న ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయి, ఇంటికి తిరిగి రాలేదని జూన్ 13 న ఆ బాలిక అమ్మమ్మ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా ఆబాలిక అదృశ్యమైన 20 రోజుల తర్వాత జూన్ 28న మిలటరీ పోలీసులు ఆమెను బ్యారక్స్ లోపల కనుగొన్నారని ఆమె అత్త కాసౌండ్రా పెరెజ్ తెలిపారు. ‘ఆ బాలిక ఆచూకీ మిలటరీ పోలీసులకు బ్యారక్‌లో లభ్యమయ్యింది. లైంగిక కార్యకలాపాల కోసం ఆమెను ఎవరో సైనికునికి విక్రయించారు’ అని పెరెజ్ టిక్‌టాక్ వీడియోలో తెలిపారు. మెరైన్ బేస్ క్యాంప్‌లో బాలిక ఉందని షెరీఫ్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా ఆ బాలిక గతంలోనూ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోయేదని, అయితే త్వరగా ఇంటికి తిరిగి వచ్చేదని ఆమె అమ్మమ్మ మీడియాకు తెలిపారు. నేవల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ కు చెందిన షెరీఫ్ విభాగం, శాన్ డియాగో హ్యూమన్ ట్రాఫికింగ్ టాస్క్ ఫోర్స్ సాయంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. కంబాట్ లాజిస్టిక్స్ బెటాలియన్ 5, 1వ మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్‌లో సభ్యుడైన ఒక మెరైన్ను జూన్ 28న ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్ కెప్టెన్ చక్ పామర్ తెలిపారు. కాగా పేరు వెల్లడికాని ఆ మెరైన్‌పై ఇంకా అభియోగాలు మోపలేదు. మెరైన్ కార్ప్స్ చేతికి సంకెళ్లి వేసి పోలీసులు తీసుకెళ్లిన ఫోటో ఇలీవల సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. కాగా తన మేనకోడలిపై జరిగిన అత్యాచారాన్ని సైన్యం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని పెరెజ్ ఆరోపించారు. ఈ ఘటనకు బేస్ క్యాంప్దే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వారే ఆ బాలికను బేస్‌లోకి తీసుకురావడానికి అనుమతించారు. అక్కడ అతను ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉన్నందున అడ్డుకోలేకపోయిందని పెరెజ్ అన్నారు. కాగా అధికారులు ఆ బాలికను ఆమె అమ్మమ్మకు అప్పగించారు. ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు -
150 మిలియన్ ఏళ్ల నాటి జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు
150 million-year-old marine invertebrate Named after Ukraine President: పోలాండ్లోని పాలియోంటాలజిస్టులు 150 మిలియన్ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు పెట్టారు. ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. ఇది ఒక రకమైన ఈక నక్షత్రం అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రగర్భాంలో ఉండేలా సుమారు 10 పొడవాటి చేతులు, పదునైన టెన్టకిల్ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా ఉక్రెయిన్‌ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీ. మాతృభూమి రక్షణకై జెలన్స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి అతని పేరుని సూచించారు. ఈ మేరకు ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్ స్కీ గా నామకరణం చేశారు. ఇలాంటి వితజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి. ఐతే ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి. కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతుకుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు గానీ ఇతర జీవులకు విషపూరితమే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. (చదవండి: పాపం యాన్ యాన్.. తిండి మానేసి మరీ కన్నుమూసింది) -
మరో భారీ మెరైన్ కంపెనీని టేకోవర్ చేసిన ఆదానీ
ఇండియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ ఖాతాలో మరో కంపెనీ వచ్చి చేరింది. థర్డ్ పార్టీ మెరైన్ సర్వీసులు అందిస్తున్న ఓషియన్ స్పార్కిల్ సంస్థను అదాని గ్రూపుకు చెందిన ఆదానీ హర్బర్ సర్వీసెస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందు కోసం రూ.1530 కోట్లను అదానీ హర్బర్ సర్వీసెస్ వెచ్చించింది. ఇండియాలో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించడం తమ లక్ష్యమని ఆదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సీఈవో కరన్ అదానీ తెలిపారు. తాజాగా కుదిరిన డీల్ వల్ల రాబోయే ఐదేళ్లలో ఓషియన్ స్పార్కిల్ లాభాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారయన. ఓషియన్ స్పార్కిల్ సంస్థ 1995లో ఏర్పాటైంది. ఇండియాతో పాటు శ్రీలంక, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, ఆఫ్రికా దేశాల్లో సేవలు కొనసాగిస్తోంది. ఇండియాలో ఉన్న మేజర్, మైనర్ పోర్టుల్లో ఓషియన్ స్పార్కిల్ పని చేస్తోంది. ఈ కంపెనీలో దేశవ్యాప్తంగా 1800ల మంది పని చేస్తున్నారు. చదవండి: Multibagger Stock: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు! -
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో
న్యూయార్క్: అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడి(26)కి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం. అయితే, పూర్తి స్థాయిలో మతపరమైన వెసులుబాట్లు కల్పించకుంటే కోర్టుకెళతానని అతడు పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సుఖ్బీర్ సింగ్ 2017లో మెరైన్స్లో చేరారు. ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌గా ప్రమోషన్ అందుతుందని సుఖ్బీర్ సింగ్ తూర్ సుఖ్బీర్సింగ్ తూర్ న్యూయార్క్‌టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. చదవండి: (మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ) భారత్ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్బీర్కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ‘సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతడిని గుర్తుపడతారు’అని మెరైన్‌వర్గాలు అంటున్నాయి. యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి. దీనిపై సుఖ్బీర్ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయని న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యూఎస్ అమర సైనికుని భార్య
కాబూల్ ఉగ్రవాద పేలుడులో మరణించిన ఓ సైనికుడి భార్య ఇటీవల ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తన భర్త జ్ఞాపకార్థం తన కూతురుకి అతని పేరు పెట్టుకుంది. దురదృష్టవశాత్తు బేబీ లెవీ రైలీ రోజ్ పుట్టినప్పటి నుంచి తన వీరోచిత తండ్రి రైలీ మెక్‌కొల్లమ్‌ని చూడలేదు. ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన భయానక బాంబు దాడిలో రైలీ మరణించాడు. ఆ ఘటనలో 170 మంది స్థానికులు, 13 మంది యూఎస్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆ పేలుడుకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్-కే ప్రకటించింది. ఆఫ్గన్ నుంచి తరలింపు ప్రారంభమైన కారణంగా రైలీని యూఎస్ ప్రభుత్వం అక్కడికి పంపింది. ఘటన జరిగిన రోజు విమానాశ్రయ తనిఖీ కేంద్రం నిర్వహిస్తున్నప్పుడు ఈ విషాదం చోటు చేసుకుని ఉండొచ్చని అధికారులు తెలిపారు. రైలీ మెక్‌కొల్లమ్‌కి ఈ ఫిబ్రవరిలో వివాహం జరిగింది. రైలీ దేశ సేవలో ప్రాణాలు కోల్పోయినందుకు తాను చాలా గర్వపడుతున్నానని అతని తల్లి తెలిపింది. అనంతరం ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. 15 సంవత్సరాల క్రితం, తొమ్మిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త మరణించాడని, దురదృష్టవశాత్తు అదే చరిత్ర పునరావృతమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! -
అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు
సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ నుంచి భయంతో వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా మరో మూడు మిలటరీ బేస్‌లను కేటాయించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్‌లో శరణార్థుల కోసం కేటాయించిన స్థావరాలతో పాటు తాజాగా మెరైన్ కార్ప్స్ బేస్, ఫోర్ట్ పికెట్, హోలోమ్యాన్ ఎయిర్‌బేస్‌లను సైతం వీరి కోసం కేటాయిస్తున్నట్లు యూఎస్ ప్రతినిధి జాన్ కిర్బే చెప్పారు. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యులు, రిస్కు ఎదుర్కొంటున్న వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని, ఈ మిషన్ కు అదనపు మద్దతు కోసం కొత్త బేస్‌లను కేటాయించామని కిర్బే తెలిపారు.చదవండి: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు దీంతో అఫ్గాన్ శరణార్థుల కోసం అమెరికా స్వదేశంలో కేటాయించిన స్థావరాల సంఖ్య ఏడుకు చేరిందన్నారు. ఇవి కాకుండా ఖతార్, బహ్రెయిన్, జర్మనీల్లో అమెరికాకు మరో 10 స్థావరాలున్నాయని ఆయన వివరించారు. అమెరికాలోని అన్ని స్థావరాలు కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించగలవని కిర్బే చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో మిలటరీకి హోమ్‌ల్యాండ్ శాఖ, ఆరోగ్య శాఖ సహాయం చేస్తున్నాయని వివరించారు. సరిహద్దు దేశాలేవీ అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు ఏ బేస్‌లో ఎంతమంది? జర్మనీలోని రమ్స్టెయిన్ బేస్‌కు గతవారం దాదాపు 7,500మంది శరణార్థులు వచ్చారు. ఈ బేస్ సామర్ధ్యం 12వేలని అధికారులు చెప్పారు. బహ్రెయిన్‌లోని ఇసా ఎయిర్‌బేస్‌లో 5 వేల మందికి ఆశ్రయం కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఫోర్ట్ బ్లిస్‌లో 650 మందికి ఆవాసం కల్పించారు. దీని సామర్థ్యం పదివేలని అధికారులు చెప్పారు. ఫోర్ట్ డిక్స్లో 9,500 మందికి టెంట్ హౌస్‌ల్లో నివాసం కల్పించారు. అయితే కొన్ని బేస్‌ల్లో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అల్ ఉదైద్ బేస్‌లో పరిస్థితి నరకం కన్నా హీనంగా ఉందని, ఎలుకలు తిరుగుతున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు మిలటరీ బేస్‌ల్లో శరణార్థు లకు తాత్కాలిక నివాసం కల్పిస్తున్నారు కానీ, తర్వాత వీరిని ఎక్కడకు తరలిస్తారన్న విషయమై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వీరికి శాశ్వత ఆవాసం కల్పించేందుకు ముందుకువస్తున్నారు. ఈ బేస్‌లను అధ్యక్షుడు బైడెన్ సందర్శించాల్సి ఉన్నా, కాబూల్ పేలుళ్ల కారణంగా వాయిదా పడింది. సరిహద్దు దేశాలు మానవతా ధృక్పధంతో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐరాస కోరింది. –నేషనల్ డెస్క్, సాక్షి -
యుద్ధం మొదలైనపుడు పుట్టాడు.. యుద్ధంతో పాటే..
‘‘ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాదే తను జన్మించాడు.. ఈ యుద్ధం ముగిసే దశలోనే తన జీవితం కూడా ముగిసిపోయింది’’- స్టీవ్ నికోయి, కాలిఫోర్నియా పోలీస్ అధికారి. వాషింగ్టన్: స్టీవ్ నికోయి గురువారం నుంచి టీవీకే అతుక్కుపోయారు. తన కొడుకు లాన్స్ కార్పొరల్ కరీం నికోయి గురించి ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆయన గుండె వేగంతో కొట్టుకుంటోంది. ముగ్గురు సైనికులు వచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టగానే విషయం అర్థమైపోయింది. తన కొడుకు ఇక లేడనే మాట నికోయి చెవిన పడింది. కాలిఫోర్నియాకు చెందిన సైనికుడు, 20 ఏళ్ల కరీం నికోయి.. అఫ్గనిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాబూల్ పేలుళ్లకు సరిగ్గా ఒక్కరోజు ముందు అఫ్గన్ చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ తీసుకున్న వీడియోను ఇంట్లో వాళ్లకు పంపించాడు. అది చూసి ఎంతగానో సంతోషించారు కుటుంబ సభ్యులు. కరీం బాగున్నాడు.. త్వరలోనే ఇంటికి వచ్చేస్తాడని భావించారు. కానీ, 24 గంటలు గడవకముందే తమను శాశ్వతంగా వీడి వెళ్లిపోతాడని వారు అస్సలు ఊహించలేదు. ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్-కె) గ్రూపు కాబూల్‌లో జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో కరీం నికోయి మృతి చెందాడు. అతడితో సహా 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. వైయోమింగ్‌కు చెందిన లాన్స్ కార్పొరల్ రిలీ మెకల్లమ్(20), మాక్స్టన్ సోవియాక్(22), కరీం నికోయి(20) పిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. యుద్ధంతో పాటే తన జీవితం కూడా.. ‘‘ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాదే తను జన్మించాడు.. ఈ యుద్ధం ముగిసే దశలోనే తన జీవితం కూడా ముగిసిపోయింది’’ అని కరీం తండ్రి స్టీవ్ నికోయి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2001లో అఫ్గనిస్తాన్‌లో అమెరికా సేనల మోహరింపు నాటి నుంచి ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పనితీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శించారు. అదే విధంగా అఫ్గన్‌లో పనిచేస్తున్న కమాండర్లు ముందే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైతే ఇంతటి దురదృష్టకర ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. తన కొడుకు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కాబూల్ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా! తండ్రి కాబోతున్నాడనే సంతోషం నిలవలేదు.. వైయోమింగ్‌కు చెందిన రిలీ మెకల్లమ్ చిన్ననాటి నుంచే సైన్యంలో సేవలు అందించాలని భావించాడు. గతంలో జోర్డాన్‌లో పనిచేసిన అతడు ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో బాధ్యతలు చేపట్టాడు. కాబూల్ పేలుళ్లు జరిగినపుడు చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న అతడు మరణించాడు. ‘‘పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నా సోదరుడు సైనికుడిగా ఉండాలని ఆరాటపడేవాడు. బొమ్మ తుపాకీతో పహారా కాసేవాడు. పింక్ ప్రిన్సెస్ స్నో బూట్స్ ధరించి.. తాను దుండగులను మట్టుపెడతానంటూ తన ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని సంతోషపెట్టేవాడు. మరో మూడు వారాల్లో తనకు బిడ్డ పుట్టబోతోంది. ఒక గొప్ప తండ్రిగా ఉండాలని తను భావించాడు. కానీ అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’’ అని మెకల్లమ్ సోదరి ఖియెనె మెకల్లమ్ అసోసియేటెడ్ ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. ‘‘నచ్చిన పనిచేస్తూ చనిపోయినా ఫర్వాలేదని’’ మెకల్లమ్ చెప్పేవాడంటూ అతడి స్నేహితులు గుర్తు చేసుకున్నారు. ఒకవేళ అదే జరిగితే.. నేను చంపేవైపే ఉంటాను.. మాక్స్టన్ సోవియాక్.. అమరులైన 13 మంది సైనికుల్లో ఒకరు. ‘‘చంపడం లేదా చంపబడటం.. తప్పదు అనుకుంటే.. నేను కచ్చితంగా చంపే వైపే ఉంటాను’’ అంటూ ఇటీవలే తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. యుద్ధం తప్పనిసరైతే ఎంతదాకానైనా వెళ్తానంటూ సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటో షేర్ చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ గురువారం నాటి పేలుళ్ల ఘటనలో ఆయన మృత్యువాత పడ్డారు. చిన్న వయస్సులోనే మాక్స్టన్ ప్రాణాలు కోల్పోవడం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. View this post on Instagram A post shared by Maxton Soviak (@max_soviak) నా చిన్నారి తమ్ముడు చనిపోయాడు.. మాక్స్టన్ మృతిపై స్పందించిన అతడి సోదరి మెర్లిన్ సోవియాక్ శనివారం ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇకపై మాట్లాడను కూడా. కానీ.. ఎంతో అందమైన మనసు కలిగిన, తెలివిగల వాడైన, ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన నా చిన్నారి తమ్ముడు.. ఇతరులు ప్రాణాలు కాపాడే క్రమంలో చనిపోయాడు. తనొక మెడిక్. తోటి వాళ్లకు సాయం చేసేవాడు. తను లేని లోటును మాకు ఎవరు పూడ్చలేరు. మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. తనింకా పిల్లాడే. మా పిల్లలను శవాలుగా మారేందుకే మేం సైన్యంలోకి పంపించామా? మాలాంటి కుటుంబాలు తీవ్ర వేదన అనుభవిస్తున్నాయి. నా గుండె ముక్కలైపోతోంది. వాళ్లు ఇక తిరిగిరారు కదా. అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది’’ అని తమ్ముడితో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను పంచుకున్నారు. View this post on Instagram A post shared by Marilyn Soviak (@nighht__maree) కాగా వీరు ముగ్గురితో పాటు హంటర్ లోపెజ్, టేలర్ హూవర్, డియాగన్ విలియం- టైలర్ పేజ్ మరణించిన సైనికుల జాబితాలో ఉన్నారు. అయితే, కాబూల్ పేలుళ్లలో మరణించిన సైనికుల వివరాలను అమెరికా రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -వెబ్‌డెస్క్(ది ట్రిబ్యూన్, అసోసియేటెడ్ ప్రెస్ సౌజన్యంతో) చదవండి: ఐసిస్ ఖోరసాన్- వీళ్లెంత దుర్మార్గులంటే.. -
ఆంధ్ర రొయ్యా మజాకా.. అక్కడ మీసం మెలేస్తోందండి!
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీసం మెలేస్తోంది. నాణ్యమైన, అత్యంత రుచికరమైన రొయ్యలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందటంతో ప్రపంచంలోని 61 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ఎగుమతుల విలువ అక్షరాలా రూ.16,183 కోట్లు. డీజీసీఐఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని ఏ రాష్ట్రాలు వేటిని ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్నాయో 2020 సంవత్సర నివేదికలో డీజీసీఐఎస్ పేర్కొంది. రొయ్యలతోపాటు ఫెర్రో–సిలికా, మాంగనీస్ మన రాష్ట్రం నుంచి 69 దేశాలకు ఎగుమతి చేశారు. రాష్ట్రం నుంచి 45 దేశాలకు బియ్యం ఎగుమతి కాగా.. వాటి విలువ రూ.3,015.9 కోట్లుగా నివేదిక వెల్లడించింది. పొగాకు, క్యాప్సికం వంటివి కూడా మన రాష్ట్రం నుంచి భారీగానే ఎగుమతి అయ్యాయని తెలిపింది. కేరళ నుంచి బంగారం.. హరియాణ నుంచి బాస్మతి రైస్ కేరళ నుంచి ఎక్కువ స్థాయిలో బంగారం ఎగుమతి అయినట్టు వెల్లడైంది. ఎనిమిది దేశాలకే ఇది ఎగుమతి అయినా దీని విలువ అక్షరాలా రూ.43,233.83 కోట్లు. కేరళ నుంచి జీడిపప్పు 47 దేశాలకు ఎగుమతి అయింది. బిర్యానీకి ప్రసిద్ధి గాంచిన బాస్మతి రకం బియ్యం హరియాణ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. 121 దేశాలకు రూ.16,443.09 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని హరియాణ ఎగుమతి చేసింది. గుజరాత్ నుంచి 48 దేశాలకు రూ.77,325.1 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్‌ను ఎగుమతి చేశారు. మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో అతిపెద్ద విలువ కలిగినది డైమండ్స్ కాగా.. మహారాష్ట్ర నుంచి 77 దేశాలకు డైమండ్స్ ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 1.70 లక్షల కోట్లు. ఢిల్లీ నుంచి టర్బో జెట్స్ పెద్దఎత్తున ఎగుమతి కాగా.. వీటి విలువ రూ.11,600 కోట్లుగా డీజీసీఐఎస్ తేల్చింది. జమ్ముకశ్మీర్ నుంచి ఉన్ని, సిక్కిం పాస్తాను, త్రిపుర ఉల్లిగడ్డలను ఎక్కువగా ఎగుమతి చేశాయి. -
3 నెలలు కార్లోనే.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగం సాధించా
న్యూజెర్సీ: కరోనా కారణంగా దేశంలో ఎక్కడి వ్యక్తులు అక్కడే ఉండిపోవడం, మరికొందరు ఇంటికే పరిమితం కావడం వలన అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక నిరుద్యోగుల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాక్డౌన్, ఉద్యోగం లేకపోవడం, సంపాదన లేక అనేక మంది కరోనా కాలంలో బ్రతకడమే కష్టంగా మారింది. ఇదే కోవలోనే యూఎస్ మెరైన్ కార్ప్స్లో ఉద్యోగం చేసే జాక్ జోన్స్ 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మెరైన్ కార్ప్స్లో మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అయిన జాక్.. దళాలను వదిలిపెట్టి ట్రక్ డ్రైవర్‌గా సొంత ట్రాన్స్పోర్ట్ సంస్థను నెలకొల్పడానికి ఎంతో కష్టడడ్డాడు. ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో అతని అదృష్టం తిరోగమనం పట్టింది. చివరకు తన కుటుంబాన్ని పోషించడం కూడా చాలా కష్టమైంది. 2020లో అతని జీవితం మరింత సవాలుగా మారింది. వెనక్కి తిరిగి చూస్తే యూఎస్ మెరైన్గా పనిచేసి అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సాధారణ జీవితం గడపడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని జాక్ చెప్పాడు. ఇంకా అనేక విషయాలపై స్పందిసస్తూ.. 'నేను సాధారణ జీవితం గడపడానికి మానసికంగా సిద్ధంగా లేను అయినా తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో మాటలో చెప్పాలంటే సాధారణ జీవితానికి అలవాటుపడటానికి చాలా కష్టమైంది. దాదాపు మూడు నెలల పాటు కారులోనే ఉండిపోయాను. (ఇక లేదనుకున్నారు, కానీ 27 ఏళ్ల తరువాత...) అప్పడుప్పడు స్నేహితుడితో కలిసి క్లాస్, హోటళ్లకు వెళ్లడానికి మాత్రమే అతికొద్ది సమయం బయటకు వచ్చేవాడిని. వ్యక్తిగతంగా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను' అంటూ జాక్ చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య సుదీర్ఘ ఇంటరర్యూ ప్రక్రియను పూర్తి చేసి.. మూడు నెలల సుదీర్ఘ కష్టం తర్వాత మైక్రోసాఫ్ట్ ఉద్యోగం పొందాను. ఇప్పడు ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. నా భార్యను హే మీకు ఎలాంటి ఇల్లు కావాలి అని అడగగలుగుతున్నాను' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. -
రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నివారణకు ఎలాంటి మందు లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైంటిస్టుల పరిశోధన ఆసక్తికరంగా మారింది. కరోనా వ్యాప్తిని సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచు (మెరైన్ రెడ్ ఆల్గే) తో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. దీని నుంచి తయారుచేసిన జీవరసాయన పొడి యాంటీ-వైరల్ ఏజెంట్ గా పని చేస్తుందని వెల్లడించారు. వృక్షజాలం, జంతుజాలం, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఎత్తైన మొక్కలులాంటి సహజ వనరుల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులు వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులతో పోరాడటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు, కరోనా వైరస్ నిరోధానికి ప్రధానంగా పనిచేస్తాయని రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వినోద్ నాగ్లే, మహాదేవ్ గైక్వాడ్, యోగేశ్ పవార్, సంతను దాస్‌గుప్తా బృందం తెలిపింది. తాజా పరిశోధనల ప్రకారం శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకుంటాయని తమ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా ఇవి పనిచేస్తాయన్నారు. అంతేకాదు కరోనా యాంటీ వైరల్ మందులు మాత్రమే కాకుండా శానిటరైజ్ వస్తువులపై వైరస్ చేరకుండా కోటింగ్ (పై పూతగా)గా కూడా వాడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడంలో పోర్ఫిరీడియంతో సహా వివిధ జీవ వనరులనుంచి లభ్యమయ్యే క్యారేజీనన్ పాత్ర ప్రశంసనీయమని తేల్చారు. (కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్) తమ పరిశోధనకు మద్దతుగా క్లినికల్ ట్రయల్ అధ్యయనాలలో క్యారేజీనన్, సల్ఫేట్ పాలిసాకరైడ్ పాటు పోర్ఫిరిడియం ఇపిఎస్‌ను కూడా వినియోగించవచ్చని తెలిపారు. ఎందుకుంటే ఈ నాచు నుంచి ఉత్పత్తి అయ్యే ఎక్సోపోలిసాచురైడ్లలోని బహుళ అణువులతో (మాలిక్యులస్) చికిత్స సానుకూల ప్రయోజనం కనిపిస్తుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలకు సంబంధించిన మల్టీడిసిప్లినరీ ప్రిప్రింట్ ప్లాట్‌ఫామ్ ప్రిప్రింట్స్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ నెల ప్రారంభంలో ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో కరోనాపై రిలయన్స్ లైఫ్ సైన్సెస్ చేస్తున్న పరిశోధనల గురించి ప్రస్తావించడం గమనార్హం. సహజమైన పాలీశాచురేడ్స్ పుష్కలంగా ఉన్న సీవీడ్స్ (సముద్ర నాచు)కు ఆహార ఉత్పత్తులు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఔషధ పరిశ్రమల మార్కెట్ లో భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) -
ప్రైవేట్ బోట్లును అనుమతించకండి: ఎస్పీ
సాక్షి, కృష్ణా : మంగళవారం జిల్లా ఎస్పీ రవీద్రనాథ్ బాబు మెరైన్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెరైన్ సేవలు మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. మెరైన్ బోట్లను నిత్యం గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలు, మెరైన్ సిబ్బందితో కలిసి తీర ప్రాంత గ్రామాలలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిలకలదిండి, ఓర్లగొందితిప్ప, పాలకాయ తిప్పి పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ పరిస్థితులు సమీక్షిస్తామని అన్నారు. మత్స్యకారుల సంరక్షణ కోసం నిరంతర కార్యాచరణ రూపొందిస్తున్నామని, తీర ప్రాంత సంరక్షణ కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి, వేట వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మెరైన్ పోలీస్ స్టేషన్లో సరిపడ సిబ్బందిని ఏర్పాటు చేసి, మెరైన్ ఉనికి చాటేలా కార్యాచరణ చేపడతామన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్ బోట్లు కాకుండా, ప్రైవేట్ బోట్లు అనుమతించ వద్దని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సత్తిబాబు, కృష్ణ కాంత్ పటేల్ , డీఎస్పీ ధర్మేంద్ర, మెరైన్ ఎసై, సిఐలు పాల్గొన్నారు. -
వైరల్ : తీరంలో వెలుగులు; ప్రమాదానికి సంకేతం..!
సాక్షి, చెన్నై : సముద్ర తీరంలో కాసేపు సేద తీరితే ఎవరికైనా ఉల్లాసంగా ఉంటుంది. అక్కడ రంగురంగుల కాంతులు కూడా ఉంటే డబుల్ ఖుష్ లభించినట్టే..! చెన్నైలోని బంగాళాఖాతం తూర్పు తీరంలో ఆదివారం రాత్రి కనిపించిన ఓ దృశ్యం టూరిస్టులను తెగ ఆకట్టుకుంది. సముద్రం అలలపై నీలం రంగు కాంతి తేలియాడుతూ వస్తుంటే అక్కడున్న వారందరూ ఎంజాయ్ చేశారు. సహజసిద్ధమైన ఈ దృశ్యాన్ని కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ అయింది. తిరువాన్మియూర్, ఇంజామ్‌బాక్కం బీచ్‌లో ఈ వింత వెలుగు చూసింది. బెసంత్ నగర్ బీచ్‌తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ కాంతి వెలుగులు కనిపించినట్టు స్థానికులు తెలిపారు. అయితే, ఈ ఆహ్లాదభరిత కాంతులు ప్రమాదానికి సంకేతమని సముద్ర నిపుణులు అంటున్నారు. ఇది బయోల్యూమినస్ కాంతిగా చెప్తున్నారు. కోస్టల్ రిసోర్స్ సెంటర్ అధికారి పూజా కుమార్ మాట్లాడుతూ.. ‘తుమ్మెదలు, బీటిల్స్, ఆంగ్లర్‌ఫిష్, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులతో పాటు నాక్టీలియా ఆల్గే వల్ల ఈ బయోల్యూమినస్ కాంతి పుట్టుకొస్తుంది. అయితే, ఈ ఆల్గే వల్ల సముద్రంలో భారీ మొత్తంలో అమ్మోనియా పేరుకుపోతుంది. అది సముద్ర జీవులకు మంచిది కాదు. అమ్మోనియా వల్ల సముద్ర జీవుల ఆహార చక్రం నాశనం అవుతుంది. ఫలితంగా చేపల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అది చేపల ఆహారంలో బాగమైన ప్లాంక్టోన్‌ను కూడా నాక్టీలియా ఆల్గే తినేస్తుంది. ఆక్సిజెన్ లేని ప్రాంతాల్లోనే ఈ ఆల్గే పుట్టుకొస్తుంది. తీర ప్రాంతాలు కాలుష్యమవడం దీనికి కారణం’అన్నారు. -
సముద్రాన్ని కాపాడతా!
పుణె: మహారాష్ట్రలోని పుణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్ ఖాజీ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సముద్ర జీవజాలంపై వ్యర్థాల ప్రభావం ఎలా ఉంటోందో పలు డాక్యుమెంటరీల ద్వారా తెలుసుకున్న ఖాజీ.. ఎలాగైనా సముద్ర జీవులను కాపాడాలని, అందుకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ ప్రధాన కారణంగా గుర్తించి.. సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కారకాల్లో ప్రధానమైనది ప్లాస్టిక్ అని తెలుసుకున్న ఖాజీ.. ఆ ప్లాస్టిక్‌ను నిర్మూలించేలా ఓ నౌకను డిజైన్ చేశాడు. దానికి ఎర్విస్ అని పేరు పెట్టాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్థాలను వేరుచేసి, శుద్ధ జలాలను సముద్రంలోకి తిరిగి పంపుతుంది. మేధావుల నుంచి ప్రశంసలు.. టెడ్ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక గురించి ఖాజీ వివరించడంతో శాస్త్రవేత్తలు, మెరైన్ నిపుణులు, మేధావుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. వారంతా ఖాజీ ప్రతిభకు అబ్బురపడ్డారు. ఇక ఎర్విస్ నౌక కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి, దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది. హాట్సాఫ్ ఖాజీ.. సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్థాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలురంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పన్నెండేళ్ల బాలుడు హజీక్ ఖాజీ చేస్తున్న ప్రయత్నానికి అంతా హాట్సాఫ్ అంటున్నారు. -
ఇప్పటి ఎడారి.. ఒకప్పటి సముద్రం
జైపూర్ : ఎడారి.. కనుచూపు మేర ఇసుక తప్ప మరొకటి కనిపించని ప్రాంతం. మచ్చుకోక చోట మాత్రమే నీరు. మన దేశంలో ఎడారి అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజస్ధాన్. అయితే ఇప్పటి ఈ ఎడారి ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా..? పూర్తిగా నీరు ఆవరించి ఉండేది. చెలమలు, చెరువుల కాదు.. ఏకంగా సముద్రం. అవును ఇప్పటి ఈ ఎడారి ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేదంట. నమ్మడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఏడాది నుంచి గుజరాత్, రాజస్థాన్‌లో విస్తరించిన ఎడారి ప్రాంతంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. పాలియెంటాలజీ(శిలాజాల అధ్యాయనం) విభాగం డైరెక్టర్ దేబసిష్ భట్టాచార్య అధ్వర్యంలో నిర్వహస్తున్న ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జైసల్మేర్ జిల్లాలోని ఈ ఎడారి ప్రాంతంలో పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన అనేక శిలాజాలు బయటపడ్డాయి. వీటిలో తొలి తరం తిమింగలానికి సంబంధించినవి, షార్క్, మొసలి దంతాలు, తాబేలు ఎముకకు సంబంధించిన శిలజాలు ఉన్నాయి. ఇవన్ని పూర్వ చారిత్రక యుగానికి సంబంధించినవే కాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇవన్ని జలచరాలు. ఇవన్ని మధ్య శిలాయుగానికి చెందినవి. జైసల్మేర్ జిల్లాలో దొరికిన ఈ శిలజాలు అన్ని మధ్య శిలా యుగానికి చెందినవిగా భట్టాచార్య టీం గుర్తించింది. మధ్య శిలా యుగం అంటే దాదాపు 47 లక్షల సంవత్సరాల కాలం నాటి జీవజాలం. అంటే ప్రస్తుతం ఎడారి విస్తరించిన ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల క్రితం సముద్రం ఉండేదని స్పష్టంగా అర్ధమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల క్రమేణ వచ్చిన వాతావరణ మార్పులు మూలంగా ప్రస్తుతం ఉన్న ఎడారిగా రూపాంతరం చెంది ఉంటుందని శ్రాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాక గుజరాత్, కచ్ బేసిన్ ప్రాంతాల్లో ఒకే రకమైన వాతావరణ మార్పులు సంభవించి ఉంటాయని భట్టాచార్య టీం అంచనా వేస్తుంది. అయితే ఒకప్పుడు ఉన్న సముద్రం అంతరించి ఇప్పటి ఎడారి ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత పరిశోధన చేయాల్సి ఉంటుందని భట్టాచార్య ప్రకటించారు. -
దూసుకొస్తున్న‘మెకును’ పెను తుపాను..
పణాజి,గోవా : పెను తుపాను ‘మెకును’ గోవా వైపు దూసుకొస్తోంది. దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మస్కట్‌లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సముద్రంలో గురువారం రాత్రి మెకును తుపాను సంభవించింది. ఈ తుపాను గోవా వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. వాతావరణంలో మార్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. తీరం వెంబడి సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ద్రిష్టి మెరైన్ రంగంలోకి దిగింది. వీరితో పాటు వీలైనంత ఎక్కువ మంది లైఫ్ గార్డ్స్ కూడా సముద్ర తీరం వెంబడి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను ఎవరిని సముద్ర తీరం వైపు అనుమతించడం లేదని ద్రిష్టి మెరైన్ వెల్లడించింది. -
తీరం.. రక్షణ ప్రశ్నార్థకం
♦ తెరపైకి మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ♦గతంలోనే స్థల పరిశీలన ♦ ఐదేళ్లుగా నిరీక్షణ నరసాపురం : నరసాపురం తీరప్రాంతంలో రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలంగా మెరైన్‌పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై హడాÐవుడి చేయడం, మళ్లీ విషయం మరుగున పడడం పరిపాటిగా మారింది. నాలుగైదేళ్లుగా ఇదేతంతు నడుస్తోంది. రెండేళ్ల క్రితం అంతర్వేదిలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో, ఇక ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు ఉండవని భావించారు. అయితే జిల్లాలో తీరప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. కచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని రెవెన్యూ శాఖలు పేర్కొంటున్నాయి. కొన్నేళ్ల క్రితం సముద్ర మార్గం ద్వారా కసబ్ సహా పలువురు తీవ్రవాదులు ముంబై నగరంలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. సరిగ్గా అప్పుడే కేంద్రం మన రాష్ట్ర తీరప్రాంత జిల్లాల్లో రక్షణ చర్యలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా నరసాపురం తీరప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఉపయోగాలున్నా.. పెండింగ్ ఎందుకో? మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఐదేళ్ల క్రితం అంటే 2012లో దాదాపు రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడిన ప్రతినిధి బృందం నరసాపురం తీరగ్రామాల్లో పర్యటించింది. నరసాపురం మండలం చినమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. చినమైనవానిలంకలో ఓ ప్రాంతాన్ని స్టేషన్ ఏర్పాటుకు అనువుగా గుర్తించారు. అయితే నరసాపురంతో పాటు ప్రతిపాదనలో ఉన్న మరోప్రదేశమైన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మాత్రం 2013లో మెరైన్‌పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేశారు. ఇక్కడ మాత్రం పెండింగ్ పెట్టారు. మన జిల్లాలోని నరసాపురంలో 19 కిలో మీటర్ల మేర తీరప్రాంత ఉంది. తరచూ ప్రకృతి విపత్తులు సంభవించడంతో ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ అవసరమని నిపుణులు గుర్తించారు. ఈ స్టేషన్ అందుబాటులో ఉంటే తీరప్రాంత భద్రత, రక్షణే కాకుండా ఇతర ఉపయోగాలుంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణహాని కలుగకుండా రక్షించడం మెరైన్ స్టేషన్ సిబ్బంది చేస్తుంటారు. బోట్లు, విపత్తు రక్షణ సామగ్రి వారివద్ద అందుబాటులో ఉంటుంది. మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలపై ఇటీవల పోలీస్‌శాఖ మరోసారి కేంద్రం దృష్టిలో పెట్టింది. ఇంతకుముందు ఎస్పీగా పని చేసిన భాస్కర్‌భూషణ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థల పరిశీలన కూడా చేశారు. ఇటీవల కదలికతో మెరైన్ స్టేషన్ సాకారమవుతుందోలేదో వేచిచూడాల్సి ఉంది. స్థలం సమస్యలేదు సుమిత్ కుమార్ గాంధీ, సబ్‌కలెక్టర్ తీరంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల సమస్య లేదు. గతంలో గుర్తించాలమని చెపుతున్న చినమైనవానిలంకలో కూడా ప్రభుత్వ భూములున్నాయి. నేను బాధ్యతలు తీసుకున్న తరువాత మాత్రం ఈ అంశం నా దృష్టికి రాలేదు. -
అంతర్గత భద్రతకు మెరైన్ పోలీసు వ్యవస్థ
పల్లిపాలెం(సఖినేటిపల్లి) : అంతర్గత భద్రతకు మెరైన్ పోలీసు వ్యవస్థ ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం గ్రామంలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మాణ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన నూతన మెరైన్ పోలీసు స్టేషన్ భవనాన్ని డిప్యూటీ సీఎం రాజప్ప ప్రారంభించారు. అలాగే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యారావు అద్యక్షతన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప ముఖ్య అతిథిగా మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని అన్నారు. అలాగే రాష్ట్రాభివృద్థికి శాంతిభద్రతల అంశం చాలా కీలకమని, దీనికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తీర ప్రాంత భద్రతలో 21 మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. తీర రక్షణలో కేంద్రం కోస్ట్‌గార్డ్ వ్యవస్థ, రాష్ట్రం మెరైన్ వ్యవస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్టేషన్లకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకునేందుకు తగిన నిధులు బడ్జెట్లో కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అలాగే పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వెల్లడించారు. మత్య్సకారుల సంక్షేమానికి ప్రభత్వం పలు పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ, సెప్టెంబర్‌లో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సౌత్ కోస్టల్ జోన్ ఇన్చార్జ్ ఐజీ ఎన్.సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా ఉన్న తీరంలో భద్రతకు 21 స్టేషన్లు పనిచేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఫిషింగ్ హార్బర్, మెరైన్ స్టేషన్లు ఏర్పాటుకు సహకరించిన దాతలను హోం మంత్రి రాజప్ప, ఎమ్మెల్యేలు సత్కరించారు. గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, గ్రామ సర్పంచ్ చొప్పల చిట్టిబాబు, ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, ఎంపీటీసీ సభ్యురాలు కొల్లాటి శేషాలక్ష్మి, ఓఎస్డీ (సివిల్) రవిశంకర్‌రెడ్డి, మెరైన్ డీఎస్పీలు రాజారావు, నరసింహరావు, సీఐ ఎం శ్యాంకుమార్, తహసీల్దారు డీజే సుధాకర్‌రాజు, ఎంపీడీఓ జీ వరప్రసాద్‌బాబు, రాజోలు సీఐ క్రిష్టోఫర్, మలికిపురం ఎంపీపీ జి.గంగాభవాని, జెడ్పీటీసీ సభ్యురాలు మంగెన భూదేవి, సర్పంచ్‌లు బందెల పద్మ, భాస్కర్ల గణపతి, నాయకులు వనమాలి మూలాస్వామి, రావూరి మాణిక్యాలరావు, చింతా వీరభద్రేశ్వరరావు, ముప్పర్తి నాని పాల్గొన్నారు. అంతర్వేది దేవస్థానంలో.. గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న అంబేడ్కర్ భవనానికి హోం మంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సూర్యారావు సహకారంతో స్థానిక కస్పా కోఆపరేటివ్ సొసైటీ అధ్వర్యంలో ఈభవనం నిర్మించనున్నారు. తాడి నీలకంఠం, జంపన ప్రసాదరావు పాల్గొన్నారు. -
నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం
-
ఈ వధూవరులను గుర్తించండి!
లండన్: జలకాలాటలలో ఏమి హాయిలే అలా...అంటూ కరీబియన్ సముద్రంలో భుజాల వరకు నీటి మునిగి చెట్టాపట్టాలేసుకొని ముందుకు సాగిపోతున్నారు ఆ వధూవరులు. స్వచ్ఛమైన నీటి అడుగున ‘స్టింగ్రేస్ (పొడవాటి సన్నటి తోకగల చేపలు)’ గుంపులు గుంపులుగా దూసుకొస్తున్నా లెక్కచేయకా, గగన సీమలో పోటీపడి కమ్ముకొస్తున్న మంచు మబ్బులను చూస్తూ తన్మయత్నంలో తేలిపోతున్న వధూవరుల దృశ్యాన్ని జెన్నీ స్టాక్ అనే ఓ మెరైన్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ జంట అనుమతితోనే ముచ్చటైన వాళ్ల ఫొటోలు పలు తీశానని, వాళ్లకు ఈ ఫొటోలు అందజేయాలని ఆశిస్తున్నానని, అయితే వారు ఎక్కడున్నారో, వారి చిరునామా ఏమిటో తనకు తెలియదంటూ ఆమె ఇప్పుడు ప్రముఖ సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’ను ఆశ్రయించారు. వాళ్లను గుర్తించిన వెబ్సైట్ యూజర్లు దయచేసి వారి కాంటాక్ట్‌ను తనకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ‘స్వచ్చమైన కరీబియన్ సముద్రంలో మెరైన్ లైఫ్‌పై ఫొటోలు తీసేందుకు నేను గత మే నెలలో డొమెనికన్ రిపబ్లిక్కు వెళ్లాను. నీటి మునిగి నేను ఫొటోలు తీస్తుండగా, హఠాత్తుగా నా కెమెరా ముందుకు నవ వధూవరులు వచ్చారు. అప్పటికీ పెళ్లి దుస్తుల్లోనే ఉన్న పెళ్లి కూతురును చూసి ముచ్చటేసింది. ముళ్ల చాకు లాంటి తోకలో విషం గల స్టింగ్రేస్ (ఆపద ఎదురైనప్పుడు మాత్రమే ఆ చేపలు మనుషులపై దాడులు చేస్తాయి)ను కూడా లెక్కచేయకుండా వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోవడం మరింత ఆశ్చర్యం వేసింది. అందుకే వారి అనుమతితో వారి ఫొటోలు తీశాను. వారికి నన్ను కాంటాక్టు చేయాల్సిందిగా పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాను. అలల హోరులో వారికి నా మాటలు వినపడకపోవచ్చని ఇప్పుడనిపిస్తోంది. ఆ నవ వధూవరులు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఇంతకాలం నిరీక్షిస్తూ వచ్చాను. కనీసం వారు ఏ దేశస్థులో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ సాయం అర్థిస్తున్నాను. లండన్‌లోని లంకాషైర్‌లో నివసిస్తున్న నేను మెరైన్ ఫొటోగ్రాఫర్‌ను. నా ఫేస్బుక్ పేజీని సులభంగానే గుర్తించవచ్చు’ అంటూ ఆమె సోషల్ వెబ్సైట్ యూజర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
పుంజుకున్న ఎగుమతులు
వృద్ధి 5.26 శాతం 5 నెలల గరిష్ట స్థాయి * ఏప్రిల్‌లో విలువ 25.63 బిలియన్ డాలర్లు * 2013 ఏప్రిల్‌లో ఈ విలువ 24.35 బిలియన్ డాలర్లు * 2014 మార్చితో పోల్చితే ‘విలువ’ మాత్రం నిరాశే! న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయిలో నమోదయ్యింది. ఈ రేటు 5.26 శాతమని శుక్రవారం విడుదలైన గణాంకాలు పేర్కొన్నాయి. అంటే గడచిన ఐదు నెలల కాలంలో ఇంత రేటు (5.26 శాతం)లో ఎగుమతుల వృద్ధి నమోదుకాలేదన్నమాట. విలువ రూపంలో చూస్తే 2013 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువ 24.35 బిలియన్ డాలర్లుకాగా, 2014 ఏప్రిల్‌లో ఈ విలువ 25.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే సీక్వెన్షియల్‌గా ఇదే ఏడాది మార్చితో పోల్చితే మాత్రం ఎగుమతుల విలువ ఏప్రిల్‌లో తగ్గడం నిరాశ కలిగించే విషయం. ఈ విలువ 2014 మార్చిలో 29.57 బిలియన్ డాలర్లు. దిగుమతులు మైనస్‌లోనే... ఇక దిగుమతులు విషయానికి వస్తే, అటు వార్షికంగా చూసుకున్నా, ఇటు నెలవారీగా చూసుకున్నా... అసలు వృద్ధిలేకపోగా క్షీణబాటలోనే (మైనస్) కొనసాగుతున్నాయి. 2013 ఏప్రిల్‌లో దిగుమతుల విలువ 42.02 బిలియన్ డాలర్లయితే ఈ విలువ 2014 ఏప్రిల్‌లో 35.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే వార్షికంగా 14.99 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక స్వీక్వెన్షియల్‌గా మార్చి గణాంకాలను చూస్తే ఈ విలువ 40.08 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల విలువ వార్షికంగా 0.6 శాతం తగ్గి, 13.05 బిలియన్ డాలర్ల నుంచి 12.97 బిలియన్ డాలర్లకు తగ్గింది. చమురు యేతర దిగుమతుల విలువ 21.5 శాతం క్షీణతతో 28.97 బిలియన్ డాలర్ల నుంచి 22.74 బిలియన్ డాలర్లకు దిగింది. వాణిజ్యలోటు ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 10.09 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013 ఏప్రిల్‌లో ఈ విలువ 17.8 బిలియన్ డాలర్లు. స్వీక్వెన్షియల్‌గా 2014 మార్చిలో ఈ విలువ 10.5 బిలియన్ డాలర్లు. బంగారం ఎఫెక్ట్... వాణిజ్యలోటు వార్షిక ప్రాతిపదికన భారీగా దిగిరావడానికి (17.8 బిలియన్ డాలర్ల నుంచి 10.09 బిలియన్ డాలర్లకు) పసిడి దిగుమతుల విలువ భారీగా తగ్గడం ప్రధాన కారణం. 2013 ఏప్రిల్‌లో పసిడి దిగుమతులు విలువ 6.78 బిలియన్ డాలర్లుకాగా, 2014 ఏప్రిల్‌లో ఈ విలువ 74 శాతం పడిపోయి 1.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా ఈ మెటల్ దిగుమతులపై 10 శాతం వరకూ సుంకాలు పెంపుసహా ప్రభుత్వం విధించిన పలు ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ఇక బంగారం, వెండి రెండు మెటల్స్నూ పరిగణనలోకి తీసుకుంటే ఈ దిగుమతుల విలువ 2013 మార్చిలో 7.42 బిలియన్ డాలర్లు కాగా, ఈ పరిమాణం 2014 ఏప్రిల్‌లో 70 శాతానికి పైగా పడి, 2.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మిగిలిన ముఖ్య రంగాలు... ఇంజనీరింగ్, సముద్ర, లెదర్ ఉత్పత్తుల ఎగుమతులు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇంజనీరింగ్ రంగం నుంచి ఎగుమతుల వృద్ధి రేటు 21.25 శాతంకాగా, సముద్ర ఉత్పత్తుల విషయంలో 42.18 శాతంగా, లెదర్ ఉత్పత్తుల్లో 30.42 శాతంగా నమోదయ్యాయి. ముడి ఇనుము ఎగుమతులు కూడా 23.43 శాతం పెరిగి, 15.2 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మాత్రం 8 శాతం పడి, 3.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ రంగంలో దిగుమతులమీద ఉన్న ఆంక్షలు దీనికి కారణమని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఔషధ, రసాయన రంగాల్లో ఎగుమతుల వృద్ధి రేటు 10.4 శాతం, 4.13 శాతంగా నమోదయ్యాయి. విద్యుత్, రెడీమేడ్ దుస్తుల విషయంలో ఈ రేట్లు 4 శాతం, 14.3 శాతం చొప్పున నమోదయ్యాయి. అయితే హస్త కళలు, పండ్లు, కూరగాయలు, జీడిపప్పు, పొగాకు, బియ్యం, టీ, కాఫీ ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. ఇక ఎరువులు, విలువైన రంగురాళ్లు, ఇనుము, ఉక్కు, రవాణా పరికరాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు తగ్గాయి. -
చేపలలో చేపలా...
స్కూబా డైవింగ్ సముద్రపు నీటిలో వేగంగా, చల్లచల్లగా ఈదులాడే సాహసక్రీడ పేరు స్కూబా డైవింగ్. ప్రపంచంలో పేరెన్నికగన్న స్కూబా డైవింగ్ ప్రాంతాలు... ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన డైవింగ్ ప్రదేశాలలో ఒకటి. ఇది మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అతి పెద్ద పగడపు దిబ్బలు కలిగిన ప్రదేశం. నీటిలో ఈదుతూ... సముద్రపు తాబేళ్లు, డాల్ఫిన్లు, వేల రకాల చేపలను చూడొచ్చు. ప్రపంచంలో అత్యంత అందమైన సముద్ర తీరాలలో ఎర్రసముద్రం ప్రఖ్యాతి గాంచింది. ఈజిప్టు పర్యాటక ఆకర్షణలో ప్రధానమైన ఈ సముద్రంలో డైవింగ్ మరిచిపోలేని అనుభూతి. భారత దేశంలో 572 చిన్న చిన్న ద్వీపాలు గల అండమాన్ నికోబార్ దీవుల్లోని హ్యావ్లాక్ దీవిలో స్కూబా డైవింగ్ అంటే జీవితకాలపు ఊహించని ఆనందాన్ని మదిలో నిలుపుకున్నట్టే!