అమెరికాలోని శాన్ డియాగోలోగల మెరైన్ కార్ప్స్ బేస్ క్యాంప్ పెండిల్‌టన్‌లోని బ్యారక్స్‌లో గతంలో తప్పిపోయిన 14 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఒక యూఎస్ మెరైన్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బాధిత బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆ బాలికను ఎవరో అక్రమంగా విక్రయించారని, ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.
శాన్ డియాగో కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఒక బాలిక జూన్ 9 న ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయి, ఇంటికి తిరిగి రాలేదని జూన్ 13 న ఆ బాలిక అమ్మమ్మ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా ఆబాలిక అదృశ్యమైన 20 రోజుల తర్వాత జూన్ 28న మిలటరీ పోలీసులు ఆమెను బ్యారక్స్ లోపల కనుగొన్నారని ఆమె అత్త కాసౌండ్రా పెరెజ్ తెలిపారు. ‘ఆ బాలిక ఆచూకీ మిలటరీ పోలీసులకు బ్యారక్‌లో లభ్యమయ్యింది. లైంగిక కార్యకలాపాల కోసం ఆమెను ఎవరో సైనికునికి విక్రయించారు’ అని పెరెజ్ టిక్‌టాక్ వీడియోలో తెలిపారు.
మెరైన్ బేస్ క్యాంప్‌లో బాలిక ఉందని షెరీఫ్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది. కాగా ఆ బాలిక గతంలోనూ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోయేదని, అయితే త్వరగా ఇంటికి తిరిగి వచ్చేదని ఆమె అమ్మమ్మ మీడియాకు తెలిపారు. నేవల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ కు చెందిన షెరీఫ్ విభాగం, శాన్ డియాగో హ్యూమన్ ట్రాఫికింగ్ టాస్క్ ఫోర్స్ సాయంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. కంబాట్ లాజిస్టిక్స్ బెటాలియన్ 5, 1వ మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్‌లో సభ్యుడైన ఒక మెరైన్‌ను జూన్ 28న ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్ కెప్టెన్ చక్ పామర్ తెలిపారు. కాగా పేరు వెల్లడికాని ఆ మెరైన్‌పై ఇంకా అభియోగాలు మోపలేదు. మెరైన్ కార్ప్స్ చేతికి సంకెళ్లి వేసి పోలీసులు తీసుకెళ్లిన ఫోటో ఇలీవల సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. కాగా తన మేనకోడలిపై జరిగిన అత్యాచారాన్ని సైన్యం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని పెరెజ్ ఆరోపించారు.
ఈ ఘటనకు బేస్ క్యాంప్‌దే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వారే ఆ బాలికను బేస్‌లోకి తీసుకురావడానికి అనుమతించారు. అక్కడ అతను ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉన్నందున అడ్డుకోలేకపోయిందని పెరెజ్ అన్నారు. కాగా అధికారులు ఆ బాలికను ఆమె అమ్మమ్మకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు
అమెరికా ఆర్మీ క్యాంపుల్లో కొందరు నేరగాళ్లు
Published Wed, Jul 12 2023 8:49 AM | Last Updated on Wed, Jul 12 2023 9:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment