
ఒమన్‌లో మెకును తుపాను బీభత్సం సృష్టిస్తున్న దృశ్యం
పణాజి,గోవా : పెను తుపాను ‘మెకును’ గోవా వైపు దూసుకొస్తోంది. దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మస్కట్‌లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సముద్రంలో గురువారం రాత్రి మెకును తుపాను సంభవించింది. ఈ తుపాను గోవా వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. వాతావరణంలో మార్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది.
తీరం వెంబడి సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ద్రిష్టి మెరైన్ రంగంలోకి దిగింది. వీరితో పాటు వీలైనంత ఎక్కువ మంది లైఫ్ గార్డ్స్ కూడా సముద్ర తీరం వెంబడి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను ఎవరిని సముద్ర తీరం వైపు అనుమతించడం లేదని ద్రిష్టి మెరైన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment