ముంబై విక్టరీ పరేడ్‌లో భయానక దృశ్యాలు | Supporters Faint And Many Injured Team India Mumbai Marine Drive | Sakshi
Sakshi News home page

ముంబై విక్టరీ పరేడ్‌లో భయానక దృశ్యాలు.. హత్రాస్‌ ఘటన గుర్తులేదా?

Published Fri, Jul 5 2024 9:20 AM | Last Updated on Fri, Jul 5 2024 11:15 AM

Supporters Faint And Many Injured Team India Mumbai Marine Drive

ఉత్తర ప్రదేశ్‌ హత్రాస్‌లో తొక్కిసలాట మరువకముందే ముంబైలో మరోసారి జనాలు గుమ్మిగూడారు. టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందకు మెరెనాడ్రైవ్‌ జనసంద్రమైంది. ఈ సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకి చేరుకోవడంతో కొందరు స్పృహ తప్పి కిందపడిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టుకు ముంబైలో అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు వద్ద అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు. అక్కడ నుంచి నారిమన్‌ పాయింట్‌కు వచ్చిన టీమ్‌ఇండియాకు భారీ సంఖ్యలో అభిమానులు అభినందనలు తెలిపారు. ఈ టీమిండియా విజయ యాత్ర సాగిన మెరైన్‌డ్రైవ్‌ రోడ్డు జన సంద్రాన్ని తలపించింది. ఎక్కువ సంఖ్యలో అభిమానులు కదలిరావడంతో పలువురు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

 ఒకానొక సమయంలో ఓ యువతి స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు అభిమానులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, గాయపడిన అభిమానులు మాట్లాడుతూ.. ఒక్కసారిగా అక్కడికి భారీగా ఫ్యాన్స్‌ చేరుకున్నారు. పోలీసులు కూడా వారిని నిలువరించలేకపోయారు. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు అభిమానులు గాయపడ్డారని చెప్పుకొచ్చారు.

 

 

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం హత్రాస్‌లో కూడా ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. భోలే బాబా నిర్వహించిన సత్సాంగ్‌ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 121 మంది చనిపోయినట్టు యూపీ ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఇక, ఈ ఘటన తెలిసి కూడా ముంబైలో ఇలా అభిమానులు గుమ్మిగూడటాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement