Shardul Thakur Gets Engaged With His Girlfriend Mittali Parulkar - Sakshi
Sakshi News home page

Shardul Thakur: ప్రేయసి మిథాలితో శార్దూల్‌ ఠాకూర్‌ ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి ఎప్పుడంటే..

Published Mon, Nov 29 2021 12:22 PM | Last Updated on Mon, Nov 29 2021 1:04 PM

Shardul Thakur Gets Engaged With His Girlfriend Mittali Parulkar - Sakshi

PC: Instagram

Shardul Thakur-Mittali Parulkar Engagement: టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిరకాల ప్రేయసి మిథాలీ పారుల్కర్‌ను మనువాడబోతున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య ముంబైలో ఈ జంట ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఈ వేడుక జరిగినట్లు శార్దూల్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శార్దూల్‌ ఠాకూర్‌- మిథాలీ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్‌ ఠాకూర్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2021 సీజన్‌లో చెన్నై చాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్‌... ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2021లో పాల్గొన్నాడు. ఇక ఫాల్ఘర్‌కు చెందిన శార్దూల్‌ ఠాకూర్‌ గత కొంతకాలంగా మిథాలీతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: laxman sivaramakrishnan: నా జీవితకాలమంతా వర్ణ వివక్ష ఎదుర్కొన్నా.. అది కూడా మన దేశంలోనే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement