రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది. అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది ఈ వింత ఘటన. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్ వచ్చింది.
గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.
అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు సాయం అందించాడు. ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్ వేశారని చెప్పారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశామని తెలిపారు.
Pune Municipal Corporation truck fell into a pothole on the road at Samadhan Chowk in Pune. pic.twitter.com/jJbpovSsMY
— Mohammed Zubair (@zoo_bear) September 20, 2024
Comments
Please login to add a commentAdd a comment