tanker
-
ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..
రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది. అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది ఈ వింత ఘటన. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్ వచ్చింది.గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు సాయం అందించాడు. ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్ వేశారని చెప్పారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశామని తెలిపారు.Pune Municipal Corporation truck fell into a pothole on the road at Samadhan Chowk in Pune. pic.twitter.com/jJbpovSsMY— Mohammed Zubair (@zoo_bear) September 20, 2024 -
రేగళ్ల గుంపునకు తాగునీటి ట్యాంకర్
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్‌తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు. -
పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు
నిజాంపేట్: పాత పరిచయం కాస్త..ప్రేమగా మారింది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం..ఒకే సామాజికవర్గం. అయినా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఎందుకో ప్రియుడికి మనసొప్పలేదు. ప్రియురాలు ఒత్తిడి తేవడంతో మట్టుబెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం నెమలిగుట్టతండాకు చెందిన ప్రమీల (22) ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి నిమిత్తం బాచుపల్లి ఏరియాకు వచ్చింది. స్థానికంగా ఓ షోరూమ్‌లో పనికి కుదిరింది. భౌరంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీలో రెడ్డిల్యాబ్‌లో పనిచేసే స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. అదే మండలంలోని సోమరంపేట్ తండాకు చెందిన బాణావత్ తిరుపతి కొండాపూర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రమీలకు తిరుపతితో పాత పరిచయం ఉంది. ఐదారు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి సంబంధాల విషయం తెలుసుకొని.. తిరుపతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా రు. విషయం తెలుసుకున్న ప్రమీల పెళ్లి చేసుకుందామంటూ తిరుపతిపై కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తుండగా, వాయిదా వే స్తూ వస్తున్నాడు. ఇటీవల ప్రమీల తన స్వగ్రామానికి వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి తిరిగివచ్చింది. అయితే ప్రమీల శనివారం రాత్రి 9 గంటల తర్వాత గాయాలతో రూ మ్కు వచ్చిందని ఆమె స్నేహితురాళ్లు చెప్పా రు. అయితే పెళ్లి విషయంలో తిరుపతితో గొడవ జరిగి ఉంటుందని తెలిసింది. మాట్లాడుకుందామని రమ్మంటే.... ప్రమీల ఆదివారం ఉదయం తిరుపతికి ఫోన్ చేసింది. ఎప్పుడూ కలుసుకునే బాచుపల్లి వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు రమ్మని చెప్పింది. ఉదయం పదిన్నర ప్రాంతంలో తిరుపతి అక్కడకు రాగా, ఇద్దరూ గంటన్నరకుపైగా మాట్లాడుకున్నారు. పెళ్లి విషయమై ప్రమీల ఎంత ఒత్తిడి చేసినా తిరుపతి ఒప్పుకోలేదు. నేను వెళుతున్నానంటూ తిరుపతి రోడ్డు దాటేందుకు వెళుతుండగా, ప్రమీల కూడా అతనిని అనుసరించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ రోడ్డు మధ్యలో డివైడర్ మీదనే ఉన్నారు. ఈ క్రమంలోనే గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి బాచుపల్లి వైపు వస్తున్న ఓ ట్యాంకర్‌ను తిరుపతి గమనించాడు. ట్యాంకర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రమీలను తోసేశాడు. దీంతో ట్యాంకర్ ఢీకొని ప్రమీల అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు 108కు కాల్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా,ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఫతేపూర్‌లో చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఆటోని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. (చదవండి: ఆ ఎయిర్ లైన్స్, ఎయిర్‌పోర్ట్‌లకి భారీ షాక్! ప్రయాణికుడి పట్ల అలా వ్యవహరించడంతో..) -
విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్‌ను రష్యా తయారు చేసింది ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. . పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్‌లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
గుజరాత్లో ఘోర దుర్ఘటన.. ట్యాంకర్ నుంచి కెమికల్స్ లీకేజీ
గుజరాత్ సూరత్‌లో ఘోరం జరిగింది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసకుఉంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్ మిల్లో కార్మికులు ఈ పాయిజ్ గ్యాస్‌ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
పాల్వంచ: యాష్ ట్యాంకర్ రూపంలో మృత్యువు ఇద్దరు మహిళలను బలి తీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్కు రాజమండ్రి నుంచి బూడిద కోసం వస్తున్న ట్యాంకర్ అల్లూరి సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ (కేటీపీఎస్) మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ శంకర్ లాల్ మద్యం మత్తులో అతి వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగింది. తొలుత ఇంటి ముందు కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో శీలం కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గార్లపాటి వెంకటనర్సమ్మ (45)ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. మహిళలపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఇంటిని, ఆటోను, స్కూటీని, చెట్టును, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంటి గోడలు కూలిపోయి ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. వేప చెట్టు కొమ్మలు విరిగిపోయి విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఒక్కసారిగా ట్యాంకర్ దూసుకురావ డంతో స్థానికులంతా హాహాకారాలు చేశారు. మృతురాలు కోటేశ్వరమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వెంకట నర్సమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగడంతో ట్యాంకర్ కేబిన్ భాగం దెబ్బతింది. కేబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్ శంకర్ లాల్‌ను స్థానికులు, పోలీసులు బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. -
బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ : 12 మంది సజీవ దహనం
-
ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ట్యాంకర్ బోల్తా
-
ORR పై భారీ ట్యాంకర్ బోల్తా
-
సికింద్రాబాద్ లో ఆక్సిజన్ ట్యాంకర్ బ్రేక్ డౌన్
-
TSRTC Driver: ముషీరాబాద్-1 డిపో.. ఆక్సిజన్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో నగరంలో ఆ పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారం భారత వైమానిక దళానికి చెందిన సీ–17 విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపింది. అక్కడి ప్లాంట్లలో రాష్ట్రానికి కేటాయించిన లిక్విడ్ ఆక్సిజన్ తీసుకుని ఆ ట్యాంకర్లు రోడ్డు మార్గంలో నగరానికి చేరుకున్నాయి. అవన్నీ ప్రైవేట్ ట్యాంకర్లే అయినప్పటికీ వాటిని డ్రైవ్ చేయడానికి మాత్రం టీఎస్ఆర్టీసీకి చెందిన సమర్థులైన డ్రైవర్లను ఎంపిక చేశారు. అలా వాయుసేన విమానంలో ట్యాంకర్‌ను తీసుకువెళ్లి.. రోడ్డు మార్గంలో ప్రాణవాయువును తీసుకువచ్చినన డ్రైవర్లలో ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఎం.బాబయ్య ఒకరు. అనునిత్యం కోఠి–పటాన్చెరు మధ్య ‘218 రూట్’లో బస్సును నడిపే ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇవి... ► లిక్విడ్ ఆక్సిజన్‌ను అత్యవసరంగా నగరానికి తెప్పించాలని ప్రభుత్వం భావించింది. ఆ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో ఒడిశాకు పంపినా... ఆక్సిజన్ నింపిన తర్వాత మాత్రం రోడ్డు మార్గంలో రావాల్సిందే అని ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ► నిండుగా ఉన్న ట్యాంకర్లను విమానంలో తీసుకురావాలని ప్రయత్నిస్తే టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. దీంతో ఆ ట్యాంకర్లను రోడ్డు మార్గంలో తీసుకువచ్చే బాధ్యతల్ని టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు అప్పగించారు. ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ డిపోల్లో పని చేస్తున్న డ్రైవర్ల వివరాలు క్రోడీకరించిన అధికారులు బెస్ట్ డ్రైవర్లను ఎంపిక చేశారు. ► ముషీరాబాద్–1 డిపో నుంచి ముగ్గురు, మిథానీ డిపో నుంచి ఒకరు, హయత్‌నగర్–2 డిపో నుంచి ఇద్దరు, ముషీరాబాద్–2 డిపో నుంచి ఒకరు ఆక్సిజన్ రవాణాకు ఎంపికయ్యారు. ► అలాంటి వారిలో ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఎం.బాబయ్య కూడా ఒకరు. ఈ పది మంది డ్రైవర్లు గత నెల 22న బేగంపేటలోని విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్ అధికారులు వీరికి వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇద్దరు వెనక్కు వెళ్లగా.. బాబయ్య సహా ఎనిమిది మంది ఒడిశా వెళ్లడానికి ఎంపికయ్యారు. ► ప్రతి ట్యాంకర్తోనూ దాని డ్రైవర్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్‌ను పంపారు. ► ట్యాంకర్ డ్రైవింగ్ బాధ్యత మాత్రం ఆర్టీసీ డ్రైవర్‌దే. గత నెల 23న సాయంత్రం 7 గంటలకు సీ–19 విమానంలో బేగంపేట నుంచి బాబయ్య డ్రైవర్‌గా ఉన్న ట్యాంకర్ బయలుదేరింది. దీంతో పాటు మరో రెండు ట్యాంకర్లు కూడా ఈ విమానంలో భువనేశ్వర్ వరకు వెళ్లాయి. ► అదే రోజు రాత్రి 8.10 గంటలకు ఈ విమానం భువనేశ్వర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడ నుంచి బాబయ్య తనకు కేటాయించిన ట్యాంకర్‌ను నడుపుకుంటూ 150 కి.మీ. దూరంలో ఉన్న అంగుల్ చేరుకునే సరికి అర్థరాత్రి ఒంటి గంట అయింది. ► ట్యాంకర్‌ను శుభ్రం చేసి, అందులో ఆక్సిజన్ నింపుకుని, బయలుదేరే సరికి 24వ తేదీ రాత్రి ఒంటి గంట అయింది. లోడ్‌తో ఉన్న ట్యాంకర్లను నడపడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని పాటిస్తూ 1150 కిమీ ప్రయాణించి హైదరాబాద్ చేరుకునే సరికి సోమవారం రాత్రి అయింది. ► బాబయ్య నడిపిన ట్యాంకర్‌లోని లిక్విడ్ ఆక్సిజన్‌ను కింగ్ కోఠి ఆసుపత్రితో పాటు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిల్లోని ట్యాంకుల్లో నింపారు. గత నెల 26 రాత్రి (సోమవారం) రాత్రి 2 గంటలకు బేగంపేట విమానశ్రయంలో ట్యాంకర్లు అప్పగించారు బాబయ్య. బాధ్యతగా భావించా మాది యాదాద్రి జిల్లా రామన్నపేట. ఇంటర్మీడియట్ వరకు చదివా. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే డ్రైవింగ్ చేస్తున్నా. హెవీ వాహనాలు, ట్యాంకర్లు నడిపిన అనుభవం కూడా ఉంది. 2006 నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. కోవిడ్ పేషెంట్లకు సహకరించే అవకాశం దక్కడం ఓ బాధ్యతగా భావించా. అందుకే ఒడిశా వెళ్లి ఆక్సిజన్ తీసుకువచ్చా. ఈ రకంగా నాకు యుద్ధవిమానం ఎక్కే అవకాశం దక్కింది. – ఎం.బాబయ్య, ఆర్టీసీ డ్రైవర్ ( చదవండి: '1జీబీ ఆగ పట్టుకొని పెళ్లి చూడండి.. ఎవరింట్ల వాళ్లు బువ్వు తినుర్రి' ) -
క్షణమొక యుగంలా గడిచింది, లేదంటే 100 ప్రాణాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి యాజమాన్యం ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించుంటే వందకు పైగా రోగుల ప్రాణాలు ఆక్సిజన్ లేక గాల్లో కలిసేవి. వెంటనే అప్రమత్తం కావడంతో మరో జైపూర్ ఘటనను పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఆస్పత్రి యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఆస్పత్రిలో సుమారు 100 మందికి పైగా రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది రోగులకు ఆక్సిజన్ సిలిండర్లతోనే వారి వైద్యం జరుగుతోంది. ఇంతలో ఆక్సిజన్ నిల్వలు రోగులకు సరిపడా లేదని సిబ్బందికి తెలిసింది. వారు ఈ సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలిపారు. కరోనా నేపథ్యంలో బయట మార్కెట్లో ఎక్కడ కూడా అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ఇక జైపూర్ గోల్డెన్ హాస్పిటల్లో విషాదం పునరావృతమవుతుందనే భయాందోళనల మధ్య ఆస్పత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా మరుతోంది. గంటలు తరబడి ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు కోర్టు తలుపు తట్టగా అధికారులు స్పందించి షేరింగ్ ప్రాతిపదికన గ్యాస్ ట్యాంకర్‌ను సిద్ధం చేశారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది. ఆక్సిజన్ తీసుకొచ్చిన ట్యాంకర్ ఆస్పత్రిలోకి వెళ్లే వీలు లేకుండా పోయింది. దారి చిన్నది కావడంతో ఆస్పత్రి ఎల్ఎంఓ (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) ట్యాంక్ ఉన్న ప్రాంతంలోకి ట్యాంకర్ రాలేకపోయింది. ‘మేము ఎలక్ట్రానిక్ సుత్తులతో మా గోడ భాగాన్ని పగలకొట్టడం ప్రారంభించాము. కానీ దీనికి సమయం పట్టేలా ఉందని గ్రహించి.. అధికారులకు విషయం చెప్పడంతో జేసీబీని రప్పించారు. జేసీబీ గోడలను బద్దలు కొట్టడంతో హుటాహుటిన ఆక్సీజన్ ట్యాంకర్‌తో సేవలను పునరుద్ధరించి రోగులకు ఆక్సిజన్‌ను అందించామని ’ ఆస్పత్రి యజమాని చావ్లా తెలిపారు. ఇక ఆక్సీజన్ సరఫరా అయ్యేంత వరకు తమవారి ప్రాణాలు గాల్లో దీపంలా తోచాయని బాధితుల బంధువులు చెప్పుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ( చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం ) -
ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం
హరియాణా: కరోనా విలయంతో దేశమంతా అతలాకుతలమవుతోంది. కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో పలు ఆసుపత్రులలో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు అల్లాడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఆక్సిజన్ తీసుకెళతుఉన్న ట్యాంకర్ తప్పి పోవడం కలకలం రేపింది. హర్యానాలోని పానిపట్ నుండి సిర్సాకు ప్రయాణిస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ తప్పిపోయింది. దీనిపై హతాశులైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పానిపట్ ప్లాంట్ నుండి ద్రవ ఆక్సిజన్‌తో నిండిన తరువాత, ట్రక్ సిర్సాకు బుధవారం బయలుదేరింది. కానీ నిర్దేశిక సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేదు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారి మంజీత్ సింగ్ ధృవీకరించారు. జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా మరో ఘటనలో హర్యానా మంత్రి అనిల్ విజ్ పానిపట్ నుండి ఫరీదాబాద్‌కు వెళుతున్న మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దోపిడీ చేసిందని బుధవారం ఆరోపించిన సంగతి విదితమే. చదవండి : కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి షాకింగ్: గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి -
డీజిల్ ట్యాంకర్ బోల్తా; ఎగబడ్డ జనం
సాక్షి, జనగామా/రఘునాథపల్లి: డీజిల్ లోడ్‌తో వెళుతున్న ఓ ట్యాంకర్ జనగామ జిల్లా నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి జిల్లాలోని యశ్వంతాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ ద్వారా రూ.9.5 లక్షల విలువైన 12 వేల లీటర్ల డీజిల్‌ను తరలిస్తుండగా శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి యశ్వంతాపూర్‌ను దాటి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయాడు. ఈ సమయంలో నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి డివైడర్ మీదుగా ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సర్వీస్ రోడ్డుపై బోల్తాపడింది. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ ఒక్కసారిగా బయటకు చిమ్మడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ చంద్రమౌళిని స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. (చదవండి: 40 మంది చిన్నారులు.. మృత్యు లారీ) కాగా, ట్యాంకర్ నుంచి డీజిల్ వరదలా బయటకు వస్తుండడంతో దానిని పట్టుకునేందుకు క్యాన్లు, బకెట్లతో జనం ఎగబడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బం దితో కలసి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు 9 వేల లీటర్ల డీజిల్ నేలపాలైందని పోలీసులు తెలిపారు. -
‘ఫిల్లింగ్’ అక్రమాలకు ఇక చెల్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటివృథాను, ట్యాంకర్ల అక్రమాలను నిరోధించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. నూతన సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ట్యాంకర్లలో నీటిని నింపే ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పాస్ వాటర్ స్కాడా అనే సంస్థ రూపొందించిన ట్యాంకర్ వాటర్ డిస్పెన్సర్ (ట్యాంకర్ ఏటీఎం) యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జలమం డలి పరిధిలోని వెయ్యి ట్యాంకర్లకు నీటిని ఫిల్లింగ్ చేసేందుకు 56 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో రోజువారీగా సుమారు వెయ్యి ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి. ప్రతీ ట్యాంకర్ ఒక ట్రిప్పునకు ఐదువేల లీటర్ల చొప్పున నిత్యం 5 ట్రిప్పుల మేర నీటిని సరఫరా చేస్తోంది. గృహ, వాణిజ్య వినియోగదారులతోపాటు నీటి సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాలు, కలుషిత జలాల సమస్య ఉన్న ప్రాం తాలకు ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. గృహ అవసరాలకు రూ.500, వాణిజ్య అవసరాలకు రూ.850 చొప్పున జలమండలి వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తోంది. కొందరు ట్యాం కర్ యజమానులు ఫిల్లింగ్ కేంద్రాల్లో ఒక ట్రిప్పు నకు డబ్బులు చెల్లించి రెండు అంతకంటే అదనపు ట్రిప్పుల మేర నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. ట్యాంకర్ వాటర్ ఏటీఎం ద్వారా ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని, తాగునీటి వృథాను అరికట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు. ట్యాంకర్ ఏటీఎం పనిచేస్తుందిలా.. ట్యాంకర్ ఏటీఎం యంత్రం వినియోగం ఏటీఎం తరహాలోనే ఉంటుంది. దీని ఖరీదు సుమారు రూ.2.5 లక్షలు. ట్యాంకర్ యజమానికి జారీ చేసే కార్డును ఈ యంత్రంపై తాకడం ద్వారా ఇది పనిచేస్తుంది. ముందుగా కార్డులో రీచార్జ్ చేసిన మొత్తం నుంచి ట్యాంకర్లో తరలించే నీటికి సం బంధించి ట్రిప్పులవారీగా నిర్ణీత మొత్తం కోత పడుతుంది. ఇక ఫిల్లింగ్ కేంద్రంలో నీటిని నింపుకునేందుకు ప్రతీసారి విధిగా ఈ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. కార్డును తాకిన తరవాత నిర్ణీత పాస్‌వర్డ్‌ను సైతం ఈ యంత్రంలో టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సదరు ట్యాంకర్లో నిర్ణీత మొత్తంలో నీటిని నింపేందుకు ఆస్కారముంటుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడడమే కాకుండా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షకుల అవసరం కూడా ఉండదని జలమండలి అధికారులు చెబుతున్నారు. నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జల వనరుల నుంచి జలమండలి మహానగరానికి తాగునీటిని తరలిస్తోంది. ప్రతీ వెయ్యి లీటర్ల నీటిశుద్ధికి రూ.45 ఖర్చు చేస్తున్నప్పటికీ వినియోగదారులకు రూ.10కే సరఫరా చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నగరంలోని ప్రతీ వ్యక్తీకి నిత్యం 135 లీటర్ల తాగునీటిని(లీటర్ పర్ క్యాపిటా డైలీ) సరఫరా చేస్తున్నాం. ట్యాం కర్ల అక్రమాలతో తాగునీరు వృథా కాకుండా కాపాడటంతోపాటు వినియోగదారులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నాం. నీటి వృథా, చౌర్యాన్ని నిరోధించేందుకు ఈ వాటర్ డిస్పెన్సర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. –ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
కాజా టోల్గేట్ వద్ద సల్ఫర్ ట్యాంకర్ బోల్తా
-
నిద్ర మత్తు.. ప్రాణం తీసింది
కారేపల్లి : ఓ డ్రైవర్ నిద్ర మత్తు.. ప్రమాదానికి కారణమైంది. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బూర శ్రీకాంత్(38), హుజూర్ నగర్‌లోని కోదండరామ్ ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ ట్యాంకర్‌ను నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకెళుతున్నాడు. కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా ఖమ్మం ప్రధాన రహదారి వైపు వస్తున్నాడు. అప్పటికే అర్థరాత్రి కావటంతో ఇల్లెందు వరకు వచ్చి, ట్యాంకర్‌ను రోడ్డు పక్కన ఆపాడు. కునుకు తీస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో, మరో ఫ్లైయాష్ ట్యాంకర్ అదే మార్గంలో వచ్చి, మొదటి ట్యాంకర్ ఉన్నచోట ఆగింది. దాని డ్రైవర్ కిందకు దిగి, నిద్రపోతున్న శ్రీకాంత్‌ను లేపి, త్వరగా వెళదామంటూ తొందరపెట్టాడు. అప్పటికి శ్రీకాంత్‌ను నిద్ర మత్తు పూర్తిగా వదల్లేదు. అతడు ట్యాంకర్‌ను స్టార్ట్ చేశాడు. ఇల్లందు–ఖమ్మం ప్రధాన రహదారి వైపు వస్తుండగా, కారేపల్లి మండలం కొమ్ముగూడెం సమీపంలో ఆ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లి బోలాపడింది. డ్రైవర్ శ్రీకాంత్‌పై ట్యాంకర్ బాడీ (క్యాబిన్) పడిపోయింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని కారేపల్లి ఎస్ఐ కిరణ్‌కుమార్ పరిశీలించారు. ట్యాంకర్ క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకి తీయించారు. -
దొంగలను గుర్తించిన జీపీఎస్
- రెండు రోజుల క్రితం కర్ణాటకలో డీజిల్ ట్యాంకర్ అపహరణ - లారీ డ్రైవర్, క్లీనర్‌ను కట్టేసిన దుండగులు - జీపీఎస్ సహాయంతో విముక్తి కలిగించిన పోలీసులు - పోలీసుల అదుపులో ఒకరు, పరారీలో ఇద్దరు వెల్దుర్తి రూరల్: కేసుల ఛేదనలో పోలీసులకు ఆధునిక సాంకేతిక అభివృద్ధి ఎంతో సహకరిస్తుందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. కర్ణాటకలో అపహరణకు గురైన డీజిల్ ట్యాంకర్‌ను జీపీఎస్ సహాయంతో పోలీసులు గుర్తించారు. దుండగులు వెల్దుర్తి పట్టణ సమీపంలోని రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో దాచిన ట్యాంకర్ ఆచూకీని గురువారం రాత్రి గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని హసన్ జిల్లా కేంద్రంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి ట్యాంకర్లో 20వేల లీటర్ల డీజిల్ నింపుకుని క్లీనర్‌తో పాటు డ్రైవర్ మణి బెంగళూరు వైపు బయలుదేరాడు. టౌన్ దాటగానే ముగ్గురు వ్యక్తులు పోలీసులు దుస్తుల్లో వచ్చి ట్యాంకర్‌ను ఆపి తాము అటు వైపు వెళ్లాలంటూ ఎక్కారు. ట్యాంకర్ హసన్ దాటి ఘాట్ ప్రాంతానికి చేరుకోగానే లారీ ఆపమని చెప్పి డ్రైవర్, క్లీనర్‌పై దాడి చేసి తాళ్లతో కట్టివేసి, ట్యాంకర్ క్యాబిన్‌లోనే సీట్ల కింద దాచారు. అక్కడ దారి మళ్లిన ట్యాంకర్‌ను కంపెనీ వారు జీపీఎస్ సిస్టం ద్వారా గుర్తించారు. కర్నూలు జిల్లా, రామళ్లకోట ప్రాంతంలో ఉన్నట్లు గురువారం సాయంత్రం గుర్తించి అక్కడి పోలీసులకు తెలుపగా, వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఐ, టీం రామళ్లకోట ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రోడ్డుపై ఎక్కడా జాడ కానరాలేదు. చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తి సమీపంలో వేణు ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ముళ్ల పొదల మధ్య ట్యాంకర్‌ను గుర్తించారు. పోలీసులను చూసి ట్యాంకర్లో ఉన్న ముగ్గురు నిందితులు పరారవుతుండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. ట్యాంకర్ క్యాబిన్లో సీట్ల కింద కట్టేసిన డ్రైవర్ మణి, క్లీనర్‌ను బయటకు తీశారు. రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక అపస్మారక స్థితిలో ఉండడం చూసి వారికి సపర్యలు చేశారు. పట్టుబడిన వ్యక్తి అభిషేక్‌ను విచారించగా దుండగులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వాసులుగా గుర్తించినట్లు ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు. నవీన్, హరీష్ పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తప్పిన పెనుముప్పు
ఆర్టీసీ బస్‌ను ఢీ కొట్టిన కెమికల్ ట్యాంకర్ 18 మంది ప్రయాణికులకు గాయాలు క్షతగాత్రులకు తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స ఇద్దరి పరిస్థితి విషమం : కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు ట్యాంకర్ బోల్తా పడడంతో రోడ్డుపై ప్రవహించిన కెమికల్ కెమికల్ తెట్టుపై జారిపడిన వాహనచోదకులు గంటన్నర సేపు ట్రాఫిక్ నిలిపివేత కెమికల్ మండకుండా నీరు, ఫోమ్ వెదజల్లిన ఫైర్ సిబ్బంది అన్నవరం : అన్నవరం శివారులోని మండపం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్‌ను టైల్స్ క్లీనింగ్ కెమికల్ ట్యాంకర్ ఢీ కొన్న ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్‌ను ఢీ కొట్టి ట్యాంకర్ బోల్తా పడ్డంతో కెమికల్ అంతా జాతీయ రహదారిపై ప్రవహించింది. దీంతో రోడ్డంతా ఆ కెమికల్ తెట్టుతో జిగురుగా అయిపోవడంతో వాటి మీద నుంచి మోటార్ సైకిల్ మీద ప్రయాణించిన ఇద్దరు జారిపోయి పడిపోయారు. దానికితోడు కెమికల్ మండే స్వభావం కలిగినది కావడంతో పోలీసులు సుమారు గంటన్నర సేపు జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేశారు. తుని నుం చి ఫైర్ ఇంజిన్‌ను రప్పించి సిబ్బంది సాయంతో నీటి ద్వారా, ఆ పై ఫోమ్ ద్వారా ఆ తెట్టును తొలగించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. అయి తే అప్పటికీ జిగురు తగ్గక వాహనాల ప్రయాణానికి ఇబ్బందిగా ఉండడంతో రహదారిపై ఇసుక చల్లి వాహనాలు నడిపారు. ప్రమాదం ఎలా జరిగిందంటే... తుని నుంచి రాజమండ్రి వెడుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్ (ఏపీ 05 జెడ్ 0037) ఉదయం పది గంటల సమయంలో అన్నవరం గ్రామంలోకి వచ్చేందుకు జాతీయరహదారిని దాటుతుండగా, విశాఖపట్నం వైపు వెళుతున్న కెమికల్ ట్యాంకర్ బలంగా ఢీ కొట్టిం ది. దీంతో బస్ మధ్యభాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్ కూడా 20 మీటర్లు ముందుకు పోయి టెలిఫోన్ స్తంభం అడ్డుకోవడంతో ఆగిపోయింది. స్తంభం అడ్డుకోక పోతే బస్ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడి పోయేది. నిర్లక్ష్యమే కారణమా.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కెమికల్ ట్యాంకర్ వేగాన్ని తక్కువ అంచనా వేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్, బస్‌ను వేగంగా రోడ్డు దాటించేయచ్చని నడపడంతో ఈ ప్రమా దం జరిగిందని చెబుతున్నారు. మరి కొంతమందైతే రోడ్డు క్రాసింగ్ అని కూడా చూడకుండా ట్యాంకర్ డ్రైవర్ చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చి ఢీ కొ ట్టాడని తెలిపారు. తుని ఏరియా అస్పత్రిలో చికిత్స ప్రమాదంలో గాయపడిన 16 మందికి తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చంటిబాబు, బద్దర్రావు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. అన్నవరం ఎస్ఐ పార్థసారధి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేయి అడ్డు పెట్టినా ఆపలేదు అన్నవరం గ్రామంలోకి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా ట్యాంకర్ డ్రైవర్ అత్యంత వేగంగా దూసుకువచ్చి బస్‌ను ఢీ కొట్టాడని బస్ డ్రైవర్ ఏసు చెప్పాడు. అప్పటికీ కెమికల్ ట్యాంకర్‌ను ఆగమని తాను చేతితో సైగ చేసినా ఆపకుండా వచ్చి ఢీ కొట్టాడని తెలిపాడు. బస్ ప్రమాదానికి గురైన సమయంలో బస్‌లో 20 మంది వరకూ ప్రయాణికులు, అన్నవరం డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులకు ఆర్టీసీ పరిహారం తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మందికి ఆర్టీసీ తరుపున పరిహారం అందజేసినట్లు తుని ఆర్టీసీ డిపో మేనేజర్ రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ స్వల్ప గాయాలైనవారికి రూ.500, తీవ్ర గాయాలైనవారికి రూ.వేయి అందజేశామన్నారు. నలుగురు ప్రయాణికులు మాత్రం పరిహారం తీస్కునేందుకు నిరాకరించారని తెలిపారు. నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలవడంతో వారు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయారని తెలిపారు. ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారని, అక్కడ వారికి కూడా పరిహారం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని, డ్రైవర్ నిర్లక్ష్యం మని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తునిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులు కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందిలో 12 మందికి తుని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. వీరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని వారు తెలిపారు. -
యుద్ధనౌకలో పాపాయి..
వాషింగ్టన్: అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా యుద్ధవిమాన వాహక నౌకలో పాప పుట్టింది. అమెరికా నేవీకి చెందిన డ్వైట్ డీ ఐసెంట్ హోవర్ నౌకలో విధులు నిర్వర్తిస్తున్న నావికురాలికి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో నౌకలోని వైద్యవిభాగానికి తరలించగా, అక్కడ అమ్మాయికి జన్మనిచ్చింది. ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పర్షియన్ తీరంలో సైనిక కార్యకలాపాల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. 20 వారాల లోపు గర్భిణులనే నౌకలపై విధులకు అనుమతిస్తారు. అయితే ఈమె తన గర్భం గురించి అధికారులకు చెప్పలేదు. తల్లీబిడ్డలను హెలికాప్టర్లో బహ్రెయిన్‌కు పంపించి వైద్యసేవలు అందిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
బంటుమిల్లి : స్థానిక దుర్గామహల్ వద్ద బంటుమిల్లి–గుడివాడ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని నాగేశ్వరరావుపేట గ్రామానికి చెందిన ముక్కు వీరాస్వామి(70) పుష్కరా స్నానాలకు వెళ్లి వచ్చాడు. బస్ దిగిన అనంతరం బంటుమిల్లి వైపు నడిచి వెళ్తుండగా సమీపంలోని పెట్రోలు బంక్‌లో ఆయిల్ అన్లోడ్ చేసి వస్తున్న ఆయిల్ టాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరాస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ఎం.నవీన్ పంచనామా అనంతరం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్యాంకర్‌ను ఢీకొన్న టిప్పర్
తప్పిన ప్రమాదం సంగం : సంగం చెక్‌పోస్ట్ మలుపులో ముందువెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొని బోల్తా పడి ప్రమాదం తప్పిన సంఘటన సోమవారం జరిగింది. వివరాలు.. సంగం చెక్‌పోస్ట్ సెంటర్లో ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను గ్రావెల్‌తో సిద్దీపురం వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. దీంతో టిప్పర్ బోల్తాపడింది. సిమెంట్ ట్యాంకర్ స్వల్పంగా ధ్వంసమైంది. టిప్పర్ ట్యాంకర్‌ను ఢీకొన్న సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
- ఆరుగురికి తీవ్ర గాయాలు గోపవరం(వైఎస్సార్‌జిల్లా) వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం తీపిగుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తీపిగుంట వద్దకు రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.