
గుజరాత్ సూరత్‌లో ఘోరం జరిగింది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసకుఉంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్ మిల్లో కార్మికులు ఈ పాయిజ్ గ్యాస్‌ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు.
ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment