Chemical tanker
-
ఊపిరాడక ఇద్దరి మృత్యువాత
రేణిగుంట (తిరుపతి జిల్లా): ఇక్కడి గాజులమండ్యం కెమికల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గురువారం ఇద్దరు యువకులు కెమికల్ సింథటిక్ ట్యాంకును శుభ్రంచేస్తూ మృతిచెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ ఆరోహణరావు, ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. మండలంలోని పిల్లపాళెం దళితవాడకు చెందిన క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ కుమారుడు నరేంద్ర (23), గంగయ్య, చిన్నక్క కుమారుడు వెంకటేష్ (22) గాజులమండ్యంలోని సాయిరాధా బయోటెక్ కెమికల్ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలోని కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఉన్న పెద్ద సింథటిక్ ట్యాంకును గురువారం మధ్యాహ్నం శుభ్రంచేసేందుకు తొలుత నరేంద్ర ట్యాంకులోకి ఇనుప నిచ్చెన వేసుకుని దిగాడు. ట్యాంకులోపల ఉన్న కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఘాటైన వాసన వెదజల్లడంతో దాన్ని పీల్చి క్షణాల్లో అపస్మారక స్థితికి చేరుకుని కిందపడిపోయాడు. పైనున్న వెంకటేష్ అతన్ని కాపాడేందుకు ట్యాంకులోకి దిగి అతను కూడా ఆ వాసన పీల్చాడు. దీంతో ఇద్దరూ ట్యాంకులో సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడున్న వారు ట్యాంకును పగలగొట్టి వీరిద్దరినీ బయటకు తీసి తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కర్మాగారానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబీకుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు మృత్యువాత పడిన యువకులిద్దరికీ తల్లిదండ్రులు లేరు. నరేంద్ర తల్లిదండ్రులు క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ పదేళ్ల కిందటే మరణించగా.. అతన్ని చిన్నాన్న వెంకటరమణ చేరదీశాడు. మరో యువకుడు వెంకటేష్ తల్లిదండ్రులు గంగయ్య, చిన్నక్క కూడా కొన్నేళ్ల కిందట మృతిచెందడంతో వెంకటేష్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తూ బతుకుతున్నాడు. -
గుజరాత్లో ఘోర దుర్ఘటన.. ట్యాంకర్ నుంచి కెమికల్స్ లీకేజీ
గుజరాత్ సూరత్‌లో ఘోరం జరిగింది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసకుఉంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్ మిల్లో కార్మికులు ఈ పాయిజ్ గ్యాస్‌ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పేలుడు
-
కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ..
రాజమండ్రి (తూర్పు గోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎగిసిపడ్డ అగ్నికీలలు కెమికల్‌కు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కెమికల్ లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కాటేరు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గోదావరి పై నూతనంగా నిర్మించిన గామన్ వంతెనపై వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.