
అంతర్జాతీయ విమానాశ్రయ వేదికగా రుచుల ఆస్వాదం
‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో నిర్వహణ
ఆహార ప్రియులను అలరిస్తున్న రుచులు
విభిన్న వంటకాలకు నెలవైన నగరంలో గుజరాత్ రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. భౌగోళిక సమ్మేళనానికి ఈ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెఫ్ పూనమ్ చెబుతున్నారు. గుజరాత్ గ్రామీణ
పాంతాల్లోని ప్రత్యేక వంటకాలతో పాటు, విశ్వవ్యాప్తంగా ఇష్టపడే తమ సిగ్నేచర్ డిషెస్ వండి వడ్డిస్తున్నారు. ఎయిర్‌పోర్టు వేదికగా నోవోటెల్‌లో ఏర్పాటైన ఈ ఫెస్టివల్ మార్చ్ 2 వరకూ కొనసాగనుంది. ఇందులో సూర్తి ప్యాటీలు, కుచ్చి దబేలి వంటి వెరైటీలు లైవ్ కౌంటర్లలో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి సిటీ బ్యూరో
నగరంలోని నోవోటెల్ ఎయిర్‌పోర్ట్ వేదికగా కొనసాగుతున్న గుజరాత్ కతియావాడి వంటకాలు నగరవాసుల నోరూరిస్తున్నాయి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చెఫ్ పూనమ్ దేధియ ఆధ్వర్యంలో అక్కడి సంప్రదాయ వంటకాలను ఆహారప్రియులకు వడ్డిస్తున్నారు. ఈ ఫెస్ట్ నగరంలో మరో సాంస్కృతిగా సమ్మేళనంగా కనిపిస్తోంది. ‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో ఏర్పాటైన ఈ పసందైన రుచులు బఫే నుంచి స్నాక్స్ వరకూ అక్కడి పురాతన రుచులను అందిస్తుంది.
కోప్రా పాక్..
ఎండు కొబ్బరి, చక్కెర, నెయ్యి, కొత్తిమీరతో తయారు చేసే వినూత్న రుచికరమైన వెరైటీ. ఇది గుజరాతీ స్పెషల్. ఇందులో విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. 100 గ్రాములకు సుమారు 280 కిలో క్యాలరీల శక్తి వస్తుంది.

క్లాసిక్ హ్యాండ్వో..
ఇది గుజరాత్‌కి చెందిన ప్రత్యేక స్నాక్. ఈ క్లాసిక్ హ్యాండ్వో ఫెర్మెంటెడ్ రైస్, బటర్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కూరగాయల మిశ్రమం, గుజరాత్‌లో మాత్రమే లభించే మసాలాలు కలిపి తయారుచేస్తారు.
వంటకాల్లో వైవిధ్యంవిభిన్న కూరగాయల మిశ్రమంతో, ఘాటైన మసాలాల ఘుమఘుమలతో తక్కువ సెగపై నెమ్మదిగా వండేవంట వరదియు.. మంచి సువాసనతో కాసింత సూప్‌తో గుజరాతీ వెరైటీని నోటికి అందిస్తుంది.
బిజోరా పికిల్..
ఈ అరుదైన వంటకం గుజరాత్‌లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రత్యేక వంటకం. ఈ బిజోరా పికిల్ కేవలం గుజరాత్‌లో మాత్రమే లభిస్తుందని చెఫ్ తెలిపారు. ఇది స్థానిక సాంస్కృతిక వంటకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సంరక్షణ గుణాలున్న రుచికరమైన పికిల్.
లిల్వాని కచోరి..
కరకరలాడించే లడ్డూ లాంటి స్పెషల్ గుజరాతీ కచోరి ఇది. ఇందులో ప్రత్యేక రుచికరమైన పదార్థాలతో పాటు బఠానీల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి వడ్డిస్తారు.
చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment