Novotel Hotel
-
మంత్రి పదవి కావాలంటే.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
-
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడి కాస్త కిందకు కుంగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్ మొరాయించడమే కాకుండా ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు.ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం రేవంత్ ను పంపారు. ఈరోజు(మంగళవారం) నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో భాగంగా రేవంత్ అక్కడకు హాజరైన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీలోని నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్.. పార్టీలో నిరసన గళం వినిపిస్తున్న నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ పేర్లు ప్రస్తావించకుండా రేవంత్ ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.గతద్ది రోజులుగా పార్టీలో పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే వార్ నడుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు పార్టీ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు పదవులు రావేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అధిష్టానానిని తమదైన శైలిలో హెచ్చరికలు పంపుతున్నారు. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. మీ మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ! -
నోవోటెల్లో నోరూరిస్తున్న ఫుడ్ ఫెస్ట్
విభిన్న వంటకాలకు నెలవైన నగరంలో గుజరాత్ రుచులు ఆహార ప్రియుల నోరూరిస్తున్నాయి. భౌగోళిక సమ్మేళనానికి ఈ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెఫ్ పూనమ్ చెబుతున్నారు. గుజరాత్ గ్రామీణ పాంతాల్లోని ప్రత్యేక వంటకాలతో పాటు, విశ్వవ్యాప్తంగా ఇష్టపడే తమ సిగ్నేచర్ డిషెస్ వండి వడ్డిస్తున్నారు. ఎయిర్‌పోర్టు వేదికగా నోవోటెల్లో ఏర్పాటైన ఈ ఫెస్టివల్ మార్చ్ 2 వరకూ కొనసాగనుంది. ఇందులో సూర్తి ప్యాటీలు, కుచ్చి దబేలి వంటి వెరైటీలు లైవ్ కౌంటర్లలో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి సిటీ బ్యూరో నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ వేదికగా కొనసాగుతున్న గుజరాత్ కతియావాడి వంటకాలు నగరవాసుల నోరూరిస్తున్నాయి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రముఖ చెఫ్ పూనమ్ దేధియ ఆధ్వర్యంలో అక్కడి సంప్రదాయ వంటకాలను ఆహారప్రియులకు వడ్డిస్తున్నారు. ఈ ఫెస్ట్ నగరంలో మరో సాంస్కృతిగా సమ్మేళనంగా కనిపిస్తోంది. ‘స్వాద్ కతియావాడ్ కా’ పేరుతో ఏర్పాటైన ఈ పసందైన రుచులు బఫే నుంచి స్నాక్స్ వరకూ అక్కడి పురాతన రుచులను అందిస్తుంది. కోప్రా పాక్.. ఎండు కొబ్బరి, చక్కెర, నెయ్యి, కొత్తిమీరతో తయారు చేసే వినూత్న రుచికరమైన వెరైటీ. ఇది గుజరాతీ స్పెషల్. ఇందులో విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తారు. 100 గ్రాములకు సుమారు 280 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. క్లాసిక్ హ్యాండ్వో.. ఇది గుజరాత్‌కి చెందిన ప్రత్యేక స్నాక్. ఈ క్లాసిక్ హ్యాండ్వో ఫెర్మెంటెడ్ రైస్, బటర్, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కూరగాయల మిశ్రమం, గుజరాత్లో మాత్రమే లభించే మసాలాలు కలిపి తయారుచేస్తారు. వంటకాల్లో వైవిధ్యంవిభిన్న కూరగాయల మిశ్రమంతో, ఘాటైన మసాలాల ఘుమఘుమలతో తక్కువ సెగపై నెమ్మదిగా వండేవంట వరదియు.. మంచి సువాసనతో కాసింత సూప్‌తో గుజరాతీ వెరైటీని నోటికి అందిస్తుంది. బిజోరా పికిల్.. ఈ అరుదైన వంటకం గుజరాత్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు పొందిన ప్రత్యేక వంటకం. ఈ బిజోరా పికిల్ కేవలం గుజరాత్లో మాత్రమే లభిస్తుందని చెఫ్ తెలిపారు. ఇది స్థానిక సాంస్కృతిక వంటకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సంరక్షణ గుణాలున్న రుచికరమైన పికిల్. లిల్వాని కచోరి.. కరకరలాడించే లడ్డూ లాంటి స్పెషల్ గుజరాతీ కచోరి ఇది. ఇందులో ప్రత్యేక రుచికరమైన పదార్థాలతో పాటు బఠానీల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసి వడ్డిస్తారు. చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ? -
కేక్ మిక్సింగ్.. గ్రేప్ స్టాంపింగ్
నగరం విభిన్న సంస్కృతులకు కేంద్రం బింధువు అని ప్రతి ఒక్కరూ చెబుతారు. శతాబ్దాల గత చరిత్ర మొదలు ప్రస్తుత తరం అధునాతన జీవనశైలిని సైతం తనలో ఇముడ్చుకుని భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిగా విశేష ఆదరణ పొందిన కేక్ మిక్సింగ్ ఈవెంట్లను సైతం ఘనంగా నిర్వహిస్తోంది మన భాగ్యనగరం. ఈ నేపథ్యంలో నగరంలోని ఎయిర్పోర్ట్ నోవోటెల్ వేదికగా ఆదివారం కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. క్రిస్మస్ ఈవెంట్లకు రెండు నెలల ముందే మిక్సింగ్ మొదలైంది.. ఆ వివరాలు తెలుసుకుందాం.. క్రిస్మస్కి దాదాపు 2 నెలల ముందు కేక్ మిక్సింగ్ నిర్వహిస్తారు. కేక్ మిక్సింగ్ దాదాపు 25 రకాల డ్రైఫ్రూట్స్, రమ్, బ్రాందీ, వైన్ వంటి లిక్కర్లతో కలిపిన మిశ్రమాన్ని 2 నెలల పాటు సోక్ (పులియబెడతారు–ఫర్మంటేషన్) చేస్తారు. 60 రోజుల తరువాత ఈ మిశ్రమంతో ప్లమ్‌కేక్ తయారు చేస్తారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ కేక్ చాలా స్పెషల్. క్రిస్మస్కు కొద్ది రోజుల ముందు కేక్ మిక్సింగ్ చేసి తయారు చేసే కేక్‌లలో రుచి, నాణ్యత ఉండదని నోవోటెల్ చెఫ్ అమన్న రాజు తెలిపారు. కనీసం 2 నెలలు లిక్కర్లో మాగిన డ్రైఫ్రూట్స్‌కు మంచి ఫ్లేవర్ అద్దుతుంది. గ్రేప్ స్టాంపింగ్ (కాళ్లతో ద్రాక్షలను తొక్కుతూ వైన్ తయారు చేయడం) కూడా ఇక్కడ ప్రత్యేకం. ఇది ఫ్రాన్స్‌కు చెందిన పురాతన పద్దతి, సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. 13 ఏళ్ల నుంచి.. నోవోటెల్ ఆధ్వర్యంలో 2011 నుంచి కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇలా ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి, రెండు వారాల్లో 2 వేల నుంచి 2,500 కేకుల వరకూ చేస్తాం. ఒక కిలో కేక్‌లో ఈ మిశ్రమాన్ని 30 శాతం మాత్రమే వినియోగిస్తాం, మిగతాది క్యారమిల్, ఎగ్, ఫ్లోర్ తదితరాలను వినియోగిస్తాం. వైన్ తయారీ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రేప్ స్టాంపింగ్‌లో విదేశీయులు సైతం పాల్గొని సందడి చేశారు. – సుఖ్బీర్ సింగ్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్వహ్.. భారత్.. నగరం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రతి యేటా పాల్గొంటాను. హైదరాబాద్, భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. రష్యా నుంచి నగరానికి వచ్చే పర్యాటకులు చారి్మనార్, బిర్లా మందిర్‌ను తప్పకుండా సందర్శిస్తారు. నాకు ఇష్టమైన వేడుకల్లో ఈ కేక్ మిక్సింగ్ ముఖ్యమైనది. ఐదేళ్లుగా ఈ వేడుకలకు హాజరవుతున్నా. నా పిల్లలకు కూడా ఇక్కడి సంస్కృతిపై మక్కువ. – ఎలీనా, రష్యా -
మరింత కష్టపడాలి.. బీజేపీ నేతలతో జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులంతా మరింత కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. ఆదివారం నోవాటెల్ హోటల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ఇతర నేతలు తనను కలుసుకున్న సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, మరింత విస్తృతంగా పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని నడ్డా చెప్పారు. పాదయాత్ర, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ నియంతృత్వ, కుటుంబ పాలనను ఎండగట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా హనుమకొండలో బీజేపీ బహిరంగసభను విజయవంతం చేయడంపై పార్టీ నాయకులను అభినందించారు. మరోవైపు హనుమకొండ సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ ఆదివారం ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. మళ్లీ త్వరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి సంస్థాగత అంశాలు, ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారిస్తానని రాష్ట్ర నేతలకు ఆయన తెలిపారు. మల్కాజిగిరిలో పాదయాత్ర–4 బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర–4 వచ్చేనెల 12 నుంచి 10, 15 రోజుల పాటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొనసాగనుంది. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజక వర్గంలో రోజు, రోజున్నర పాదయాత్ర చేసేలా కార్యక్రమా న్ని ఖరారు చేస్తున్నారు. ముగింపు సభను అబ్దుల్లాపూర్ మెట్లో నిర్వహించనున్నారు. ఈ బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా హాజరయ్యే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు తెలిపారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ
-
వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: విజయవాడలోని నోవోటెల్ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి – ప్రదీప్‌కుమార్‌రెడ్డి దంపతుల కుమారుడు సాయినవతేజ్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వధూవరులు సాయినవతేజ్ – మేఘన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
వరుణ్ చేతికి హోటల్ గేట్‌వే!
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరంలోని లగ్జరీ హోటల్ ‘తాజ్ గేట్‌వే’ను వరుణ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ హోటల్‌ను దాదాపు రూ.121.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్ తెలియజేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఆటోమొబైల్స్, వినోదం, ఆతిథ్యం సహా పలు రంగాల్లో ఉన్న వరుణ్ గ్రూప్‌నకు ప్రస్తుతం రెండు హోటల్ ప్రాపర్టీలున్నాయి. విశాఖ బీచ్‌రోడ్, భీమిలిలో ఉన్న ఈ రెండు హోటళ్లను నొవోటెల్ బ్రాండ్లతో ‘అకార్డ్’ గ్రూపు నిర్వహిస్తోంది. తాజాగా గేట్‌వే కూడా తమ ఖాతాలో చేరటంతో తమ హోటళ్లలోని మొత్తం గదుల సంఖ్య 600కు చేరిందని ప్రభుకిషోర్ తెలియజేశారు. తాజ్ బ్రాండ్‌తో టాటా గ్రూపు నిర్వహిస్తున్న హోటల్ గేట్‌వేలో ఇప్పటివరకు టాటాలకు 40, రెడ్డీస్‌కు 30 శాతం వాటాలుండగా మిగతాది పబ్లిక్ షేర్‌హోల్డింగ్. ‘‘గేట్‌వే కొనుగోలు గతనెల 29న ఖరారయింది. దీనికోసం చెన్నై, విశాఖ నుంచి రెండు సంస్థలు పోటీపడినా... మా సామర్థ్యాన్ని, వేగవంతమైన విస్తరణను చూసి మాకే విక్రయించటం సంతోషకరం. వచ్చే నాలుగేళ్లలో ఆతిథ్య రంగంలో మొత్తం 1000 రూమ్స్ మా చేతిలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆయన వివరించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద 196 గదుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న నొవోటెల్‌ను ఈ డిసెంబరులో ప్రారంభించనున్నట్లు కూడా చెప్పారాయన. ఈ సమావేశంలో వరుణ్ గ్రూప్ డెరైక్టర్లు వరుణ్, వర్ష పాల్గొన్నారు. -
ఐఫా స్టార్స్.. లుక్ అదుర్స్
-
ఐఫా స్టార్స్.. లుక్ అదుర్స్
చలనచిత్ర రంగంలో పేరెన్నికగన్న ‘ఐఫా’ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం రాత్రి మాదాపూర్ నోవాటెల్ హోటల్లో నిర్వహించారు. పలు తెలుగు, కన్నడ చిత్రాలకు పురస్కారాలు ప్రదానం చేశారు. వేడుకలో పలువురు సినీస్టార్లు తమ అందచందాలలో ఆకట్టుకున్నారు. ఐఫా స్టార్స్.. ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఘనంగా తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
-
ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్
ఆశీర్వాదం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సినీ నటులు నందమూరి బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్‌కల్యాన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. - సాక్షి, సిటీబ్యూరో [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
ఉత్సాహంగా ఫ్రూట్ మిక్సింగ్
వివిధ రకాల పళ్లను ప్రత్యేక రీతిలో మిక్స్ చేసి నగర యువత సందడి చేసింది. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం ఫ్రూట్ మిక్సింగ్ జరిగింది. క్రిస్మస్ను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేక్ మిక్సింగ్‌లా ఫ్రూట్ మిక్సింగ్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల పళ్లను ఒక పెద్ద పాత్రలో ఉంచి తేనె, వైన్, రమ్, విస్కీ, నిమ్మ జోడించి మిక్సింగ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఆటలలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నోవాటెల్ జీఎం నీల్ పాటర్సన్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ముత్తుకుమార్లు పాల్గొన్నారు. - మాదాపూర్ -
అటు విలాసం.. ఇటు చిద్విలాసం..
ఖరీదైన దుస్తులు-ఉత్పత్తులు జిగేల్మన్న చోటే.. అందగత్తెల చిరునవ్వులు తళుక్కుమన్నాయి. విలాస-చిద్విలాసాల నడుమ మాదాపూర్ నొవోటెల్ హోటల్లో గురువారం హై-లైఫ్ ఎగ్జిబిషన్ సందడిగా ప్రారంభమైంది. లగ్జరీ ఉత్పత్తులకు పేరొందిన ఈ ఎక్స్పో ప్రారంభానికి నటి మధురిమ, మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ ప్లానెట్ అను బస్రీలు అందాల అతిథులుగా హాజరయ్యారు. చెన్నై, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, కొచ్చిన్, పూనె వంటి నగరాల నుంచి వచ్చిన డిజైనర్ ఉత్పత్తులతో పాటు శ్రీలంక తదితర విదేశీ వస్తువులు సైతం ఈ ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుస్తులు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆర్ట్ పీసెస్.. ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి -
ఏప్రిల్ 8 నుంచి 'కామన్వెల్త్' సదస్సు
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలో ఈ నెల 8వ తేదీ నుంచి కామన్వెల్త్ పార్లమెంట్ కమిటీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. స్థానిక నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు ప్రారంభవుతాయి. 8, 9వ తేదీలు విశాఖలోనే ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ ముగింపు సమావేశాలు మాత్రం అరకులో జరగనున్నాయి. ఈ సమావేశాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రారంభిస్తారు. ఈ సమావేశాలకు కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్లు హాజరుకానున్నారు. -
నలుగురి గురించి..
క్రిస్మస్ లైట్స్ ‘నా గురించి కాదు.. మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి..’ ఇది క్రీస్తు వాణి. నగరంలో సందడి చేస్తున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సిటీజనులు. తమ సంతోషానికి సేవాభావాన్ని జోడిస్తూ.. పది మంది ఆనందాల మధ్య పండుగను జరుపుకుంటాం అంటున్నారు. మాదాపూర్ హైటెక్స్ నోవాటెల్ హోటల్లో వెదురు బొంగులతో క్రిస్మస్ ట్రీని తయారు చేశారు. దానికి పూర్తి స్థాయిలో అలంకరణ చేయలేదు. ట్రీని రెడీ చేసి డెకొరేట్ చేయకపోవడం ఏంటని అనుకుంటున్నారా..! ఈ అలంకరణ చేసే భాగ్యాన్ని సందర్శకులకే కల్పిస్తున్నారు. ఇందు కోసం వారు కూపన్ కొనుగోలు చేయాలి. ఆ తర్వాత అలంకరణ సామగ్రి ఐటమ్స్ బాల్స్, స్టార్స్, బెల్ట్.. ఇలా వివిధ వస్తువులతో ట్రీని అలంకరించాలి. ఇలా కూపన్ కొనుగోలు ద్వారా వచ్చిన నిధులను వృద్ధుల కోసం పనిచేస్తున్న నిరీక్షణ ఫౌండేషన్‌కు అందచేస్తామని రూమ్స్ డివిజన్ మేనేజర్ దినేశ్ రాయ్ చెప్పారు. నలుగురికీ చేయూతనిచ్చే ఈ థీమ్‌ను పదిమందీ మెచ్చి పండుగలో పాలుపంచుకుంటున్నారు. -
నోవాటెల్ విశాఖ వరుణ్ బీచ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్: నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ హోటల్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డ్ లభించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2013-14 సంవత్సరానికి 5 స్టార్ డీలక్స్ హోటల్ (రాష్ట్రస్థాయి) కేటగిరిలో ఈ అవార్డ్ లభించిందని నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ హోటల్ ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ను అందుకోవడం ఇది వరుసగా రెండో ఏడాదని పేర్కొంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అవార్డును నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ హోటల్ జనరల్ మేనేజర్ మాధవ్ బెల్లంకొండకు ప్రదానం చేశారని తెలిపింది. గత మూడేళ్లుగా తాము ఎన్నో అవార్డులను గెల్చుకుంటున్నామని మాధవ్ బెల్లంకొండ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక, తొలి 5 స్టార్ హోటల్ తమదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్‌లో పర్యాటక అభివృద్ధికు తాము చేస్తున్న కృషికి ఈ అవార్డు మరో గుర్తింపని వివరించారు. ఈ అవార్డ్ సాధించడంలో తోడ్పడిన తమ సిబ్బందికి, సంబంధితులందరికీ ఆయన కృతజ్జతలు తెలియజేశారు. -
వృత్తిపరంగా వచ్చే వ్యాధుల్లో క్యాన్సర్‌దే అగ్రస్థానం
శంషాబాద్: వృత్తిపరంగా వచ్చే వ్యాధుల్లో కేన్సర్‌ది అగ్రస్థానమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారుడు డాక్టర్ టీకే జోషి తెలిపారు. గ్రీన్‌టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో ‘ వృత్తిపర ఆరోగ్య సమస్యలు, అగ్నిప్రమాదాలు, భద్రత’పై కార్పొరేట్ స్థాయి పరిశ్రమ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీకే జోషీ మాట్లాడుతూ.. వృత్తిపరంగా వచ్చే వ్యాధుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ బాధితులు 34 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధి తర్వాత నడుమునొప్పి అతి ప్రధానమైందని చెప్పారు. ఈ సమస్యతో బాధపడుతున్న శ్రామికులు, ఉద్యోగులు కంపెనీల నుంచి తగిన నష్టపరిహారాన్ని పొందేందుకు కూడా వెసులుబాటు ఉందన్నారు. వృత్తిపరంగా రొమ్ము కేన్సర్ వచ్చిన మహిళకు డెన్మార్క్ దేశంలో మొట్టమొదటి సారిగా నష్టపరిహారం అందించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధులు ఆరోగ్య, అగ్ని ప్రమాదాల భద్రతపై చర్చించారు. పారిశ్రామిక భద్రతకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత కూడా తీవ్రంగా ఉందని జోషీ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ డైరక్టర్ జనరల్, సీఈఓ డాక్టర్ భాస్కర్ ఛటర్జీ, గ్రీన్‌టెక్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కమలేశ్వర్, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.