ఉత్సాహంగా ఫ్రూట్ మిక్సింగ్
వివిధ రకాల పళ్లను ప్రత్యేక రీతిలో మిక్స్ చేసి నగర యువత సందడి చేసింది. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఆదివారం ఫ్రూట్ మిక్సింగ్ జరిగింది. క్రిస్మస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేక్ మిక్సింగ్‌లా ఫ్రూట్ మిక్సింగ్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివిధ రకాల పళ్లను ఒక పెద్ద పాత్రలో ఉంచి తేనె, వైన్, రమ్, విస్కీ, నిమ్మ జోడించి మిక్సింగ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఆటలలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నోవాటెల్ జీఎం నీల్ పాటర్‌సన్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ ముత్తుకుమార్‌లు పాల్గొన్నారు. - మాదాపూర్