యుద్ధాలకు ఇకనైనా ముగింపు పలకాలి
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా
పోప్ ఫ్రాన్సిస్ పిలుపు
వాటికన్ సిటీ: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచమంతటా ఘర్షణలు ఆగిపోవాలని, శాంతి సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. బుధవారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు తరలివచి్చన వేలాది మందిని ఉద్దేశించి పోప్ బాసిలికా చర్చి బాల్కనీ నుంచి ప్రసంగించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఆశీస్సులు అందజేశారు.
అమాయకుల ఉసురు తీస్తున్న యుద్ధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయుధాలు నిప్పులు కక్కుతున్న చోట ఇకనైనా కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించాలని ఇరుపక్షాలకు హితవు పలికారు. జరిగిన నష్టం చాలని అన్నారు. సుదీర్ఘ శాంతిని నెలకొల్పే దిశగా చర్చలకు రెండు దేశాలూ చొరవ తీసుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ముగించి, సంప్రదింపులకు తలుపులు తెరవాల్సిన సమయం వచి్చందన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల పోప్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ ప్రాంతంలో ఆయుధాల గర్జనలు ఆగిపోవాలని, నిశ్శబ్దం తిరిగి రావాలని పేర్కొన్నారు. గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి క్షుద్బాధ తీర్చాలని, మానవతా సాయం విరివిగా అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గాజాలో కాల్పుల విరమణకు సిద్ధం కావాలని హమాస్, ఇజ్రాయెల్‌కు పోప్ సూచించారు. బందీలను విడుదల చేయాలని, తద్వారా శాంతికి బాటలు వేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. లెబనాన్, మయన్మార్, సిరియా, ఆఫ్రికా తదితర దేశాల్లో సంఘర్షణల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రారి్థస్తున్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలపైనా పోప్ మాట్లాడారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో వ్యాధుల బారినపడి పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చికిత్స అందించాలని, సాంత్వన కలిగించాలని మానవతావాదులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment