peace talks
-
వాళ్లు సంక్షోభాన్ని పోగొట్టగలరు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన ‘సైనికచర్య’ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని భారత్, బ్రెజిల్, చైనా పోగొట్టగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. వ్లాడివోస్తోక్ నగరంలో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ మాట్లాడారు. ‘‘ భారత్, బ్రెజిల్, చైనాలతో నిరంతరం టచ్‌లోనే ఉన్నా. సంక్షోభం సమసిపోయేలా చేసేందుకు ఈ మూడు దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సుముఖంగా ఉంటే నేనూ అందుకు సిద్ధమే’’ అని అన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు భారత్ సాయపడగలదని రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ‘‘ చర్చలకు నాయకత్వంవహించే సత్తా మోదీకి ఉంది. ఆయన అయితేనే అటు పుతిన్‌తో ఇటు జెలెన్స్కీ, అమెరికాతో స్వేచ్ఛగా మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాల్లో కీలక భూమిక పోషించేందుకు భారత్‌కు ఇది సువర్ణావకాశం’’ అని దిమిత్రి అన్నారు. #RussianPresident #Putin Says | 📢Have never refused from peace talks with Ukraine. Says, Istanbul agreement should be the basis📢Also adds, China, Brazil, India could be the mediators in peace talks📢"Biden recommended to support Harris, we will do the same".… pic.twitter.com/RUwWsH9Ihb— CNBC-TV18 (@CNBCTV18Live) September 5, 2024 -
అసోంలో ఇక శాంతి పవనాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. ఏమిటీ ఉల్ఫా? ‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్‌తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్‌ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్‌ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. -
అస్సాంలో కీలక పరిణామం.. ఉల్ఫాతో కేంద్రం శాంతి ఒప్పందం
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA), కేంద్రంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో శాంతి కోసం యూఎల్ఎఫ్ఏ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, యూఎల్ఎఫ్ఏ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా జరుగుతున్న (తిరుగుబాటు చర్యలకు) హింసాకాండకు ముగింపు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ వలసలు, తెగలకు భూమి హక్కులు, అస్సాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి సమస్యలు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ‘కాగా వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్తాన్) నుంచి వచ్చిన వలసదారులకు వ్యతిరేకంగా, ప్రత్యేక అస్సాం డిమాండ్‌తో 1979లో ఏర్పడింది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. దీంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం 1990లో నిషేధిత సంస్థగా ప్రకటించింది. అస్సాంలో ఉల్ఫా అత్యంత పురాతన తిరుగుబాటు దళంగా కొనసాగుతుంది. చదవండి: గుజరాత్‌ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్‌లో మాత్రం.. అయితే ఫిబ్రవరి 2011లో అరబిందా రాజ్‌ఖోవా నేతృత్వంలోని వర్గం హింసను విడిచిపెట్టి, ప్రభుత్వంతో బేషరతు చర్చలకు అంగీకరించడంతో ఉల్ఫా రెండు గ్రూపులుగా విడిపోయింది. అరబింద సారథ్యంలోని ఉల్ఫా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2011 సెప్టెంబర్ 3న తొలిసారి శాంతి చర్చలు జరిపింది. అయితే పరేశ్ బారుహ్ నేతృత్వం వహిస్తున్న ఉల్ఫా (స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరేశ్.. చైనా-మయన్మార్ సరిద్దులో తలదాచుకున్నట్లు సమాచారం. ఈరోజు అస్సాంకు చారిత్రాత్మకమైన రోజని హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు హింసను ఎదుర్కొన్నాయని, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కృషి చేశారని తెలిపారు. ఉల్ఫా హింసాకాండ కారణంగా అస్సాం చాలా కాలంగా నష్టపోయిందన్నారు. 1979 నుంచి ఈ హింసలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దశల వారీగా ఉల్ఫా డిమాండ్లను తీరుస్తామని అమిత్ షా తెలిపారు. -
కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం
ఇంఫాల్: మణిపూర్ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement. It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1 — Amit Shah (@AmitShah) November 29, 2023 శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్ఎల్ఎఫ్ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది. యూఎన్ఎల్ఎఫ్ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు. ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు. ‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్‌కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు. -
అది స్నేహం, సహకారం, శాంతి యాత్ర: చైనా
బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
ఎలాన్ మస్క్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్!
కీవ్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రింత ఓ ప్రతిపాదన చేశారు. మాస్కో ఆక్రమిత ఉక్రేనియన్ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, క్రిమియన్ ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించటం, ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇవ్వడం వంటి శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అదికాస్త వివాదానికి దారి తీసింది. తాజాగా మస్క్ ప్రతిపాదనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. తమ దేశం వచ్చి అక్కడి పరిస్థితులను గమనించాక మాట్లాడాలని స్పష్టం చేశారు. ద న్యూయార్క్ టైమ్స్ బుధవారం నిర్వహించిన డీల్‌బుక్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న జెలెన్స్కీ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు వచ్చి చూడాలని స్పష్టం చేశారు. ‘ఆయనను కొందరు ప్రభావితం చేసి ఉండొచ్చు. లేదా ఆయనే స్వతహాగా ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నా. రష్యా చేసిన మారణకాండను అర్థం చేసుకోవాలనుకుంటే.. ఉక్రెయిన్ వచ్చి సొంతంగా పరిస్థితులను పరిశీలించాలి. ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే విషయాన్ని సూచించాలి. ఈ యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఎవరు ముంగించాలి?’ అని పేర్కొన్నారు జెలెన్స్కీ. ఇదీ చదవండి: Russia Ukraine War: రష్యా సైనికుల భార్యలే ‘రేప్ చేయమ’ని ప్రోత్సహిస్తున్నారు: జెలెన్స్కీ భార్య -
బీజేపీ గెలిస్తే చర్చలకు అవకాశం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌తో శాంతి చర్చలకు, కశ్మీర్ సమస్య పరిష్కారానికి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో ఎక్కువ అవకాశాలున్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. బుధవారం కొందరు జర్నలిస్టులతో ఇమ్రాన్ మాట్లాడారు. ‘బీజేపీ మళ్లీ గెలిస్తే, కశ్మీర్ వివాదంపై ఒక పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలు గెలిస్తే హిందుత్వ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఈ వివాదం పరిష్కారానికి వెనుకంజవేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జైషే మొహమ్మద్ సహా దేశంలోని అన్ని ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘జైషే మొహమ్మద్ తదితర సంస్థలకు చెందిన ఉగ్రవాదులను నిరాయుధులను చేశాం. ఈ సంస్థల యాజమాన్యంలో ఉన్న పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది’ అని వివరించారు. ఉగ్ర సంస్థల విషయంలో అంతర్జాతీయ సమాజం వైఖరికి భిన్నంగా పాక్ నడుస్తోందన్న వాదనను ఇమ్రాన్ కొట్టిపారేశారు. బీజేపీకి ఓటు.. పాక్‌కు వేసినట్లే ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ, ఇమ్రాన్‌తో కుమ్మక్కయ్యారని స్పష్టమవుతోందని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. ‘పాక్ అధికారికంగా మోదీతో జట్టుకట్టింది. మోదీకి ఓటేస్తే పాకిస్తాన్‌కు ఓటేసినట్లే’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘మోదీ జీ అప్పట్లో నవాజ్ షరీఫ్‌తో సన్నిహితంగా ఉన్నారు. తాజాగా ఇమ్రాన్‌ఖాన్ దగ్గరి స్నేహితుడయ్యారు’ అని వ్యాఖ్యానించారు. భారత ప్రధానిగా ఎవరుండాలని పాక్ కోరుకుంటోందో ఇమ్రాన్ వ్యాఖ్యలతో అర్థమైందని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశం పాక్ ఒక్కటే. పాకిస్తాన్‌ను ప్రతిపక్షాలతో లింకు పెడుతూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు, ప్రధానిగా మోదీ ఉండాలని పాక్ అంటోంది. ఆహ్వానించకున్నా పాక్ వెళ్లిన ఏకైక ప్రధాని, సైనిక స్థావరంలోకి పాక్ ఐఎస్ఐను ఆహ్వానించిన ఏకైక భారత ప్రధాని మోదీయే’ అని ఆయన ఎద్దేవాచేశారు. -
‘అతన్ని అప్పగించి మీ మంచితనం చాటుకొండి’
న్యూఢిల్లీ : మేం ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్ మాత్రం ముష్కరుల తరఫున మా దేశంపై దాడి చేసింది. ఈ ఒక్క విషయం ద్వారా పాక్ వక్రబుద్ధి ప్రపంచానికి కూడా తెలిసిందంటూ భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుష్మాస్వరాజ్ ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ బాలాకోట్ మెరుపు దాడులు జరిపింది. కానీ పాక్ సైన్యం మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి ప్రయత్నించింది. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోంది. తీవ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే మేం పాక్‌తో చర్చలు జరుపుతాం. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవు’ అంటూ సుష్మాస్వరాజ్ పాక్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాక ‘పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారు. నిజంగా ఆయనకు అంత ఉదారతే ఉంటే జైషే అధినేత మసూద్‌ను భారత్‌కు అప్పగించాల’ని సుష్మా డిమాండ్ చేశారు. అప్పుడే ఇమ్రాన్ ఖాన్ ఔదార్యం ఏపాటిదో ప్రపంచానికి తెలుస్తుందని సుష్మా ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఆమె స్పష్టం చేశారు. #WATCH EAM Sushma Swaraj in Delhi: We are ready to engage with Pakistan in atmosphere free from terror. Some people say Imran Khan is a statesman, if he is so generous then he should hand over JeM chief Masood Azhar to India. Let's see how generous he is. (13.03) pic.twitter.com/kgnDfv8gOY — ANI (@ANI) March 14, 2019 -
థాయ్ గుహ నుంచి అందరూ క్షేమంగా..
కొరియాలో శాంతి గీతాలాపన, సౌదీ అరేబియాలో స్టీరింగ్ చేతపట్టి మహిళల స్వేచ్ఛాగానం, హాలీవుడ్ సినిమాను తలపించేలా థాయ్ గుహలో ఆపరేషన్, పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ కొత్త ఇన్నింగ్స్, తమకు తిరుగే లేదని నిరూపించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అంగరంగవైభవంగా ప్రిన్స్ హ్యారీ వివాహం, వీల్ చైర్ నుంచే విశ్వరహస్యాలపై ప్రయోగాలు చేసిన స్టీఫెన్ హాకింగ్ అస్తమయం, ఇండోనేసియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ లాంటి మర్చిపోలేని ఘటనలను మిగిల్చింది 2018. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన కొన్ని ఘటనలను మరోసారి గుర్తుచేసుకుందాం.. ట్రంప్, కిమ్ శిఖరాగ్ర సదస్సు నా టేబుల్ మీద అణుబాంబుని పేల్చే మీట ఉందని ఒకరంటే నా టేబుల్‌పై అంతకంటే పెద్ద అణుబాంబు బటన్ ఉందంటూ మరొకరు మాటల తూటాలు పేలుస్తూ ప్రపంచ దేశాల గుండెల్లో అణుబాంబుల్ని పేల్చారు. చివరికి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్‌జాంగ్ ఉన్ జూన్‌లో సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయని నేతలిద్దరూ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కొరియాలో శాంతిస్థాపన దిశగా అడుగులు పడతాయన్న ఆశలు చిగురించాయి. విశ్వ శోధకుడు హాకింగ్ అస్తమయం అరుదైన వ్యాధితో బాధపడుతూ వీల్‌చైర్‌కే పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో విశ్వరహస్యాల్ని నిరంతం శోధించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మార్చి 14న కన్నుమూశారు. ఏ క్షణంలోనైనా మృత్యుదేవత దరిచేరవచ్చని తెలిసినా స్టీఫెన్ విశ్వానికి సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన హాకింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి తరతరాలకి పదిలం. మనిషి భూమిని వదిలి కొత్త గ్రహాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ తాను అనంతలోకాలకు తరలిపోయారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు ప్రదర్శించిన ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. కేవలం ఒక్క సీటుతో మొదలు పెట్టి 22 ఏళ్ల కృషితో తాను కన్న కలల్ని సాకారం చేసుకున్నారు ఇమ్రాన్. పాక సైన్యం చెప్పుచేతల్లో ఉంటారన్న ఆరోపణలు ఉన్న ఇమ్రాన్ ప్రధాని పీఠంపై కూర్చోగానే కశ్మీర్ విషయంలో భారత్ అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామంటూ ప్రకటించి శాంతి మంత్రం ఆలాపించారు. నాలుగోసారీ.. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానం 2018లోనూ అప్రతిహతంగా కొనసాగింది. ఈ ఏడాది మేలో ఆయన వరసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. గత పద్దెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన మరో ఆరేళ్ల పాటు రష్యా పీఠంపై కొనసాగుతారు. జిన్‌పింగ్.. శాశ్వత అధ్యక్షుడు ఒక వ్యక్తి చైనా దేశ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనల్ని చైనా పార్లమెంటు తిరగరాసింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ శాశ్వతంగా దేశాధ్యక్షుడిగా కొనసాగడం కోసమే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. దానికి చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయడంతో జిన్‌పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా మారారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు జిన్ పింగ్. క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్ ఫేస్బుక్ డేటా లీకేజీ వ్యవహారంతో ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొన్నారు. సెనేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక జుకర్‌బర్గ్ సారీ చెప్పారు. ఫేస్బుక్ నుంచి సమాచారం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ బుష్ కన్నుమూత వృద్దాప్యం కారణంగా 94ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నవంబర్ 30న కన్నుమూశారు. అమెరికాలో కీలక పరిణామాల సమయంలో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. కువైట్ యుద్ధం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలోనూ, ప్రచ్ఛన్న యుద్ధం చివరి రోజుల్లో బుష్ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. సౌదీలో డ్రైవింగ్ చేసిన మహిళలు సౌదీ అరేబియాలో మహిళలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. స్టీరింగ్ చేతపట్టి ఆత్మవిశ్వాసంతో రయ్ రయ్‌మంటూ కార్లు నడిపే అవకాశాన్ని 2018 ఏడాది వారికి బహుమతిగా ఇచ్చింది. తరతరాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం జూన్ 24న ఎత్తివేసింది. దీంతో అర్ధరాత్రి అని కూడా చూడకుండా చాలా మంది సౌదీ మహిళలు రోడ్లపైకి వచ్చి కార్లలో షికారు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. థాయ్ గుహలో చిన్నారుల రెస్క్యూ అందరూ క్షేమంగా ఉన్నారు.. ఈ ఒక్క మాట ఈ ఏడాది కోట్లాది మందిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. 12 మంది ఫుట్‌బాల్ యువ క్రీడాకారులు, వారి కోచ్ 18 రోజులు థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన ఘటన నరాలు తెగేలా ఉత్కంఠకు కారణమైంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి, వరద నీరు గుహ ద్వారాన్ని ముంచేసింది. గుహలోపల నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమన్న చిన్నారుల క్షేమసమాచారాల కోసం ప్రపంచం యావత్తూ కోట్ల కళ్లతో ఎదురు చూసింది. గుహ నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రపంచంలోని అసాధారణ నేవీ బృందాలు, థాయ్ నేవీ సీల్స్ చేసిన సాహసానికి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేశాయి. జర్నలిస్టు ఖషోగ్గి హత్య సౌదీలో ప్రముఖ జర్నలిస్టు, వాషింగ్టన్ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్ ఖషోగ్గి దారుణ హత్య ఈ ఏడాది సంచలనం సృష్టించింది. అక్టోబర్‌లో వ్యక్తిగత పనుల నిమిత్తం టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లాక ఆయన అదృశ్యమయ్యారు. సౌదీ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి రాయబార కార్యాలయంలోనే యాసిడ్‌లో కరిగించారని వార్తలు వచ్చాయి. ఖషోగ్గి అదృశ్యం, హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. ఒక్కటైన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ ప్రపంచమంతా ఆ పెళ్లి కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ ఈ ఏడాది మే 19న ఒక్కటయ్యారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజవంశానికి హాలీవుడ్ గ్లామర్ జతకూరడంతో ఈ పెళ్లిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వీరిద్దరి వివాహానికి అంతర్జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యత కల్పించింది. శ్రీలంక సంక్షోభం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఈ ఏడాది సెగలు పొగలు కక్కింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాత్రికి రాత్రే ప్రధాని కుర్చీ నుంచి రణిల్ విక్రమసింఘేను దింపేసి మహిందా రాజపక్సను కూర్చోబెట్టారు. కానీ రాజపక్స రెండు సార్లు విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. కానీ పార్లమెంటును రద్దు చేయడం చెల్లదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. రాజపక్స రాజీనామా చేయడం, తిరిగి విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగాయి. అమెరికా షట్‌డౌన్ అమెరికాలో ఈ ఏడాది మూడుసార్లు షట్‌డౌన్ జరిగింది. ట్రంప్ వలస విధానాలతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవునా గోడ నిర్మాణం కోసం 500 కోట్ల డాలర్లు వెచ్చించాలంటూ ట్రంప్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించకపోవడం తాజాగా డిసెంబర్లో పాలన స్తంభించింది. జనవరి, జూన్ నెలల్లోనూ కొన్నాళ్లు షట్‌డౌన్ జరిగింది. ఒకే ఏడాదిలో మూడు సార్లు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడమనేది గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇండోనేసియాపై విరుచుకుపడిన సునామీ 2018 వెళ్లిపోతూ వెళ్లిపోతూ తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇండోనేసియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలై పర్వతంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలింది. దీంతో భారీ అలల మొదలై సునామీగా మారి జావా, సుమత్రా తీర ప్రాంతంలో ఊళ్లను ముంచెత్తింది. ఈ ప్రకృతి విలయంలో దాదాపుగా 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బ్రెగ్జిట్.. థెరిసాకి సవాల్ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన ఒప్పందం(బ్రెగ్జిట్ డీల్)పై సంక్షోభం నెలకొంది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఒకే చేసిన ముసాయిదా ఒప్పందంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొంది. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆ ఒప్పందం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆమోదం పొందడం కష్టమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బ్రెగ్జిట్ ఒప్పందానికి మార్పులు చేర్పులు చేసి పార్లమెంటుకు సమర్పించే యోచనలో థెరిసా ఉన్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సిరియాపై అమెరికా వార్ గత ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాపై అమెరికా నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆధీనంలోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. అసద్ గద్దె దిగితేనే సిరియాలో శాంతిస్థాపనకు ఆస్కారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నారులు మరణించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. జీరో టాలరెన్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన జోరో టాలరెన్స్ వలస విధానం వివాదాస్పదంగా మారింది. సరిహద్దుల్లో శరణార్థుల పడిగాపులు, తల్లీ బిడ్డల్ని వేరు చేసిన దృశ్యాలు మనసుల్ని పిండేశాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చారని 2000 మంది పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి హోమ్స్‌కి తరలించారు. చివరికి ట్రంప్ సర్కార్‌పై ఒత్తిడి పెరగడంతో తల్లీ బిడ్డల్ని వేరు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. -
బీజేపీ ముమ్మాటికీ ముస్లిం వ్యతిరేకి : ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమర్శలు గుప్పించారు. శాంతినే కోరుకుంటామని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదని అన్నారు. శాంతి చర్చలకు ఆహ్వానించినా స్పందించడం లేదని చెప్పారు. ‘బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ముస్లిం వ్యతిరేకి, పాకిస్తాన్ వ్యతిరేకి’ అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తిరిగి శాంతి చర్చల విషయమై భారత్‌ను తిరిగి సంప్రదిస్తామని అన్నారు. అమెరికాకు చెందిన ఓ వార్త చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయ్ దాడులకు సంబంధించిన కేసుపై కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. నరేంద్రమోదీతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు ఇమ్రాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. సెప్టెంబర్ మాసంలో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య శాంతి చర్చలు జరగాల్సి ఉండగా ఊహించని పరిణామాల నేపథ్యంలో రద్దయ్యాయి. చర్చలకు ముందురోజు జమ్మూ, కశ్మీర్లో ఓ భారత జవాన్‌ను ఉగ్రవాదులు హతమార్చడంతో ఆ చర్చలు రద్దయ్యాయి. ఓ పక్క చర్చలంటూ.. మరోపక్క తీవ్రవాదంతో రగులుతున్న పాకిస్తాన్‌తో చర్చలు జరిపేదిలేదంటూ భారత్ స్పష్టం చేసింది. -
శాంతి చర్చలకు గండి
సంఘర్షించుకుంటున్న రెండు దేశాల మధ్య చర్చ జరగాలంటే, శాంతి నెలకొనాలంటే ఆ వైరి పక్షాలు రెండూ పరస్పరం గౌరవించుకోవాలి. సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఒకపక్క చర్చలకు సిద్ధపడుతున్నట్టు కనబడుతూనే అవతలి పక్షాన్ని కించపరచడానికి లేదా దానిపై తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఏ ఒక్కరు ఉబలాట పడినా మొదటికే మోసం వస్తుంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సదవగాహన లోపించబట్టే...అమెరికా ఆధిపత్య ధోరణì ప్రదర్శించడం వల్లే వచ్చే నెల 12న ఆ రెండు దేశాల మధ్యా జరగాల్సిన చర్చలు కాస్తా రద్దయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు జరగడం సరికాదని భావిస్తున్నానని, భవిష్యత్తులో అవి జరిగే అవకాశం తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య ఏప్రిల్ నెలాఖరున శిఖరాగ్ర చర్చలు జరిగినప్పుడు ప్రపంచమంతా స్వాగతించింది. ఆ తర్వాత తాను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జూన్ 12న సింగపూర్‌లో సమావేశం కాబోతున్నట్టు ఉన్నట్టుండి ట్రంప్ ట్వీటర్ ద్వారా ప్రక టించినప్పుడు సైతం ఇది నిజమా, కలా అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే చర్చలకు అమెరికా వెళ్లేందుకు కిమ్ అంగీకరించరు. ఉత్తర కొరియా వచ్చేందుకు ట్రంప్ సిద్ధపడరు. రెండు దేశాల ప్రజా నీకంలోనూ అవతలివారిపై ఆ స్థాయిలో విద్వేషభావాలున్నాయి. పరస్పరం ఉండే అపనమ్మకాలు, భయాల సంగతలా ఉంచి... ఆ విద్వేషభావాలను కాదని నిర్ణయం తీసుకోవడం ఇద్దరికీ కష్టమే. ఇక కిమ్ పశ్చిమ దేశాల్లో చర్చలకు ఇష్టపడరు. వేరే దేశాల్లో ట్రంప్‌కు తగిన భద్రత కల్పించడం కష్టమని అమెరికా అభిప్రాయం. అందుకే చివరకు సింగపూర్‌లో చర్చలకు అంగీకారం కుదిరింది. అంతర్జాతీయ దౌత్యంలో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులూ ఉండరు. పరిస్థితులు, ప్రయోజనాలు ఎలాంటి అసాధ్యన్నయినా సుసాధ్యం చేస్తాయి. అందువల్లే ట్రంప్‌ను చర్చలకు ఆహ్వానిస్తూ కిమ్ ప్రకటించడం, దానికి ఆమోదం తెలుపుతూ రెండు నెలల్లో సమావేశమవుదామని ట్రంప్ జవాబివ్వడం చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ట్రంప్ సమావేశ స్థలిని, సమయాన్ని కూడా నిర్ణయించడంతో మరింత సంతోషపడ్డారు. ఈలోగా ‘ఆలూ లేదు, చూలూ లేదు...’ అన్నట్టు కొందరు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే, మరికొందరు ట్రంప్ దానికి అన్నివిధాలా అర్హుడంటూ వాదించారు. కానీ గాఢమైన శత్రుత్వం ఉన్న దేశాలు సమావేశమవుతామని ప్రకటించినంత మాత్రాన సరిపోదు. ఆ సమావేశానికి అవసరమైన ప్రాతిపదికలను సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఇరు దేశాల అధికారులూ సంప్రదింపులు ప్రారంభించాలి. చర్చనీయాంశాలను ఖరారు చేసుకోవాలి. కానీ ఇవేమీ జరగలేదు. కిమ్ ఎంతో నిజాయితీతో ఈ శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నారని మొదట్లో ప్రశంసించిన ట్రంప్ ఆ తర్వాత తన సహచరుల ద్వారా వేరే సంకేతాలు పంపారు. అణ్వాయుధాలన్నిటినీ ఏకపక్షంగా స్వాధీనం చేయడానికి కిమ్ సర్కారు అంగీకరించిందంటూ వారం క్రితం అమెరికా చెప్పడం ఉత్తర కొరియాకు ఆగ్రహం తెప్పించింది. ఇది నిజం కాదని ఆ దేశం ఖండించింది. కనీసం ఆ దశలోనైనా ఇరు దేశాలూ మాట్లాడుకుని అపోహలు తలెత్తకుండా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఈలోగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చేసిన ప్రకటన పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు ‘లిబియా నమూనా’ అత్యుత్తమమైనదని బోల్టన్ ప్రకటన సారాంశం. ‘లిబియాకు, ఆ దేశాధినేత గడాఫీకి పట్టిన గతిని చూసిన తర్వాతే మేం అణ్వాయుధాలు సమకూర్చుకోవాలని నిర్ణయిం చుకున్నాం. అటువంటప్పుడు ఆ నమూనా మాకెలా పనికొస్తుంద’ని ఉత్తర కొరియా ప్రశ్నించింది. అప్పటికైనా అమెరికా తెలివి తెచ్చుకుని ఉంటే వేరుగా ఉండేది. కానీ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సైతం అలాగే మాట్లాడారు. దాంతో ‘మైక్ పెన్స్ అజ్ఞాని, మూర్ఖుడు’ అంటూ ఉత్తర కొరియా ప్రత్యుత్తరమిచ్చింది. ఇప్పుడు చర్చలు రద్దు కావడానికి ట్రంప్ ఆ ప్రకటననే కారణంగా చూపు తున్నారు. చిత్తశుద్ధితో చర్చలకు సిద్ధపడిన దేశానికి లిబియాను గుర్తు చేయడం అజ్ఞానం కాక పోవచ్చుగానీ మూర్ఖత్వం. లిబియాలో అమెరికా, పశ్చిమ దేశాలు ఏమాత్రం నిజాయితీగా వ్యవ హరించలేదు. అణ్వస్త్ర కార్యక్రమాన్ని నిలిపేస్తే అన్నివిధాలా అండదండలు అందిస్తామని గడాఫీకి ఆ దేశాలు హామీ ఇచ్చాయి. వారిని నమ్మి 2003లో గడాఫీ ఆ కార్యక్రమాన్ని నిలిపేశారు. 2011లో పశ్చిమ దేశాల అండతో అక్కడ తిరుగుబాటు రాజుకుంది. అంతర్యుద్ధంలో నాటో దళాల అండతో తిరుగుబాటుదార్లు గడాఫీని హతమార్చారు. ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ అది సాధారణ స్థితికి చేరలేదు. అక్కడ అరాచకం తాండవిస్తోంది. నిత్యం కారు బాంబు పేలుళ్లతో, పరస్పర దాడులతో అది అట్టుడుకుతోంది. నిత్యం పదులకొద్దీమంది మరణిస్తున్నారు. లిబియాలో ఏం నిర్వాకం వెలగబెట్టారని అమెరికా ఈ సమయంలో ఉత్తర కొరియాకు దాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది? వర్తమాన లిబియా ఎలా ఉందో ప్రపంచమంతా గమనిస్తున్నా దాన్నొక ‘నమూనా’గా చెప్పడం అమెరికా అహంకార ధోరణికి నిదర్శనం. ఇది బెదిరించడం తప్ప మరేమీ కాదు. నిజానికి గడాఫీకి ఏం గతి పట్టిందో చూశాకే ఉత్తర కొరియా అణ్వస్త్రాల బాట పట్టింది. ఆ పరిస్థితులు రానివ్వబోమని ఉత్తర కొరియాకు గట్టి హామీ ఇచ్చి ప్రశాంతత చేకూర్చడానికి బదులు ఇష్టానుసారం మాట్లాడటం సబబేనా? ఒక అణ్వస్త్ర దేశంతో ఎలా వ్యవహరించాలో ట్రంప్‌కు ముందున్న ఒబామాకు కూడా అర్ధం కాలేదు. కనీసం ఆయన కయ్యానికి కాలుదువ్వలేదు. ట్రంప్ ఆమాత్రం తెలివైనా ప్రద ర్శించలేకపోతున్నారు.తన దగ్గర అణ్వస్త్రాలు పెట్టుకుని అణునిరాయుధీకరణ విషయంలో అందరికీ ఉపన్యాసాలివ్వడమే తప్పనుకుంటే, బెదిరించి దారికి తెచ్చుకుందామని భావించడం మరింత ఘోరం. బెదిరింపులు, హెచ్చరికలు సత్ఫలితాలనీయవు. ఇప్పటికైనా పరిణతితో ఆలో చించి తిరిగి సాధారణ పరిస్థితి ఏర్పడేలా చూడటం, శాంతి చర్చలకు అవసరమైన వాతావరణం ఏర్పర్చడం అమెరికా బాధ్యత. ఏదో ఒక సాకుతో చర్చల నుంచి వెనక్కు తగ్గితే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
నేను కాదు.. ట్రంప్ అర్హుడు
సియోల్/వాషింగ్టన్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను శాంతి చర్చలకు ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ శాంతి బహుమతి అక్కర్లేదనీ, శాంతి చాలని వ్యాఖ్యానించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పే దిశగా ఉభయకొరియాల అధ్యక్షులు కిమ్, మూన్‌ల మధ్య శుక్రవారం చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ద.కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జుంగ్ భార్య మూన్‌కు అభినందనలు తెలుపుతూ లేఖరాశారు. ఇరుదేశాల మధ్య శాంతిస్థాపనకు చేసిన కృషికి ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించే నోబెల్ బహుమతిని మూన్ అందుకునే అవకాశముందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నోబెల్ శాంతి బహుమతికి తనకన్నా ట్రంపే అర్హుడని మూన్ సమాధానమిచ్చారు. టైమ్ జోన్ మార్చుకోనున్న ఉ.కొరియా ద.కొరియాకు సమానంగా తమ టైమ్‌జోన్‌ను 30 నిమిషాలు ముందుకు జరపనున్నట్లు ఉ.కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఉభయకొరియాల మధ్య ఇటీవల స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2015లో ఉ.కొరియా తమ టైమ్‌జోన్‌ను అరగంట వెనక్కు జరిపింది. -
ట్రంప్‌తో మీటింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు
వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసేసుకున్నాడు. అణు పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి.. అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించాడు. ఈ విషయాన్ని అటు అమెరికా.. ఇటు ఉత్తర కొరియా అధికారులు ధృవీకరించారు. ‘ఉత్తర కొరియా-అమెరికా అధికారులు ఈ విషయమై గత కొంత కాలంగా రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఆదివారం ప్యోంగ్యాంగ్ అధికారులు నేరుగా సంకేతాలను పంపారు. త్వరలో తటస్థ ప్రదేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. అయితే అందుకు సానుకూల వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని అమెరికా భావిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రపంచ దేశాలు శుభవార్తను వింటాయ్’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూతలు కూడా జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఇక మరోవైపు దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల వాషింగ్టన్ వెళ్లిన ఓ దౌత్య బృందం కిమ్-ట్రంప్ చర్చల సాధ్యాసాధ్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ, ఇప్పుడు గోప్యంగా రహస్య చర్చలు జరపటం ఆసక్తికరంగా మారింది. -
‘ఉత్తర కొరియాతో చర్చలు సక్సెస్’
సియోల్ : కొత్త చరిత్ర లిఖించేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సిద్ధమైపోయాడు. దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి పొరుగు దేశం దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు సియోల్ అధికార వర్గం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తొలి దశలో కిమ్‌తో చర్చించేందుకు ఇద్దరు ప్రతినిధులను పంపగా.. వారితో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు సియోల్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పొరుగు దేశంతో మైత్రికి చెయ్యి చాస్తున్నట్లు కిమ్ జోంగ్ ఉన్ పేరిట ప్యాంగ్ యాంగ్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇక విడతల వారి చర్చలు అక్కర్లేదని.. త్వరలో మూన్ జాయ్ ఇన్.. కిమ్‌తో భేటీ అవుతారని ప్రకటించింది. కొరియన్ వార్ తర్వాత ఈ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ కొరియా వైపు నిలిచిన అమెరికా.. ఉత్తర కొరియాకు బద్ధ శత్రువుగా మారిపోయింది. ఆ మధ్య ఇరు దేశాల చర్చల ప్రస్తావన రాగా.. కిమ్‌ను అంత తేలికగా నమ్మకూడదంటూ దక్షిణ కొరియాకు సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు అమెరికాకు మింగుడుపడని వ్యవహారమనే చెప్పాలి. -
కిమ్ తరపున ప్రత్యేక దూతలు
ప్యాంగ్యాంగ్ : దక్షిణ కొరియాలో జరగబోయే వింటర్ ఒలంపిక్స్ ఈసారి హాట్ హాట్‌గా సాగనున్నాయి. దశాబ్దాల తర్వాత ఉత్తర కొరియా ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. పొరుగు దేశంతో శాంతి చర్చలకు తెరలేపిన నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరితోపాటు ఛీర్‌లీడర్స్‌ను కూడా పంపేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఆర్మీ ఆఫ్ బ్యూటీ పేరుతో 18-20 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిలను(300 మంది) అధికారులు ఎంపిక చేశారు. ఈ బృందానికి కిమ్ సతీమణి రి సోల్-జూ ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘‘ఉత్తర కొరియా అంటే ప్రపంచం దృష్టిలో కరుడుగట్టిన దేశంగా అభిప్రాయం ఉంది. కానీ, ఇక్కడ అందగత్తెలకు లోటు లేదు. అది నిరూపించేందుకే ఈ ప్రయత్నం’’ అని రి సోల్ ఓ ప్రకటనలో తెలిపారు. 2005 ఇన్చియాన్ ఏషియన్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె ఛీర్ గాళ్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, 2002 బుసన్ ఏషియన్ గేమ్స్ లో ఉత్తర కొరియా తరపున ఛీర్ లీడర్స్ సందడి చేశారు. కొరియన్ వార్ తర్వాత 1953 నుంచి ఇరు దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ఈ నెల 9న ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగ్గా.. వింటర్ ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొరియా దేశాల మధ్య మైత్రి నెలకొనేందుకు వింటర్ ఒలంపిక్స్ 'మంచి అవకాశం'గా ఉపయోగపడుతుందని ఇరు దేశాల ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. -
పాక్‌తో చర్చలకు ఫేస్బుక్లో ఉద్యమం
భారత విదేశాంగ దౌత్య విధానాన్ని ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మార్చగలదా? పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై టెర్రరిస్టుల దాడి కారణంగా సందిగ్ధంలో పడిన భారత-పాక్ చర్చల ప్రక్రియను పునరుద్ధరించగలదా? దాయాదుల లాంటి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులను కోరుకుంటున్నామని, అందుకు చర్చలే పరిష్కారమని ఆశిస్తున్నామంటూ సరిహద్దులకు ఇరువైపులున్న ఫేస్బుక్ యూజర్లు పెద్ద ఉద్యమాన్నే చేపట్టారు. 'ప్రొఫైల్ ఫర్ పీస్' అనే నినాదంతో వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. శాంతిసూక్తులు రాసిన ప్లకార్డులను పట్టుకొని దిగిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ముంబై నివాసి రామ్ సుబ్రమణియం ముందుగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 'ఎవరో కొద్ది మంది హింసావాదుల చర్యకు మమ్మల్ని బలిచేయొద్దు. ఆ చర్య కారణంగా మా భవిష్యత్తును నిర్దేశించవద్దు. మేము శాంతిని కోరుకుంటున్నాం. టెర్రరిస్టులను చంపండి, చర్చలను కాదు' అన్న వ్యాఖ్యలతో ఆయన తన ఫొటోను పఠాన్‌కోట్ ఆపరేషన్ ముగిసిన వెంటనే పోస్ట్ చేశారు. అలా మొదలైన ఈ ఉద్యమం వేగంగా ఫేస్బుక్లో విస్తరించింది. పాకిస్తాన్ నుంచి కూడా యూజర్లు ఈ ఉద్యమానికి భారీ సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు. 'ఓ భారత్, పాకిస్తాన్ నేతల్లారా! యుద్ధం అంటే శాంతిమృగ్యం అని అర్థం కాదు. న్యాయం జరక్కపోవడం. మెదళ్లు పుచ్చిపోయిన కొంత మంది చర్యలకు లొంగవద్దు. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది మీరే. నాలాగా ఈ భూమ్మీద ఎంతోమంది శాంతిని కోరుకుంటున్నారు' ... అని న్యూయార్క్‌కు చెందిన ఓ హక్కుల సంస్థలో పనిచేస్తున్న రఫీక్ కట్వారియా తన ఫేస్బుక్ ప్రొఫైల్ ఫొటోను పోస్ట్ చేశారు. 'విద్వేషానిది ఎప్పుడూ విజయం కాకూడదు. ఇప్పుడు మీరు సుస్థిర శాంతి కోసం తీసుకునే చర్యలకు మా భవిష్యత్ తరాలు మీకు రుణపడి ఉంటాయి' అని ఢిల్లీ నివాసి, ఓ టెక్నాలజీ సంస్థ యజమాని సమీర్ గుప్తా తన ఫ్రొఫైల్లో వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య శాంతిని కోరుకుంటూ పాడిన పాట వీడియోను కూడా పోస్ట్ చేశారు. 'టెర్రరిజాన్ని చంపండి చర్చలను కాదు' అంటూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా పాకిస్తాన్ జర్నలిస్ట్ బీనా సర్వార్ పిలుపునిచ్చారు. ఇలా ఫేస్బుక్ యూజర్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. ముందస్తు నిర్ణయం ప్రకారం భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల మధ్య ఈ నెల 15న చర్చలు జరగాల్సి ఉంది. పఠాన్‌కోట్ పరిణామం నేపథ్యంలో చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది. పాక్ సరిగా స్పందిస్తే తప్ప ఆ దేశంతో చర్చలు ఉండబోవని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మరోవైపు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. చర్చల సారాంశం మాత్రం వెలుగులోకి రాలేదు.