ఉక్రెయిన్ విషయంలో భారత్, చైనా, బ్రెజిల్‌లనుద్దేశిస్తూ పుతిన్ వ్యాఖ్య
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన ‘సైనికచర్య’ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని భారత్, బ్రెజిల్, చైనా పోగొట్టగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. వ్లాడివోస్తోక్ నగరంలో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో పుతిన్ మాట్లాడారు. ‘‘ భారత్, బ్రెజిల్, చైనాలతో నిరంతరం టచ్‌లోనే ఉన్నా. సంక్షోభం సమసిపోయేలా చేసేందుకు ఈ మూడు దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి.
చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సుముఖంగా ఉంటే నేనూ అందుకు సిద్ధమే’’ అని అన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు భారత్ సాయపడగలదని రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ‘‘ చర్చలకు నాయకత్వంవహించే సత్తా మోదీకి ఉంది. ఆయన అయితేనే అటు పుతిన్‌తో ఇటు జెలెన్‌స్కీ, అమెరికాతో స్వేచ్ఛగా మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాల్లో కీలక భూమిక పోషించేందుకు భారత్‌కు ఇది సువర్ణావకాశం’’ అని దిమిత్రి అన్నారు.
#RussianPresident #Putin Says | 📢Have never refused from peace talks with Ukraine. Says, Istanbul agreement should be the basis
📢Also adds, China, Brazil, India could be the mediators in peace talks
📢"Biden recommended to support Harris, we will do the same".… pic.twitter.com/RUwWsH9Ihb— CNBC-TV18 (@CNBCTV18Live) September 5, 2024
Comments
Please login to add a commentAdd a comment