న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది.
శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు.
ఏమిటీ ఉల్ఫా?
‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్‌తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్‌ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్‌ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment