Separatist
-
S Jaishankar: ఆత్మపరిశీలన చేసుకోండి
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు. -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్‌గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
అసోంలో ఇక శాంతి పవనాలు
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాలతో అట్టుడికిపోతున్న అసోంలో శాంతి సుస్థిరతలు నెలకొనే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శాంతి ఒప్పందంపై వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) సంతకం చేసింది. ఇకపై హింసకు దూరంగా ఉంటామని, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకుంటామని ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్మ శర్మ సమక్షంలో ఉల్ఫా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అసోం ప్రజలకు ఇదొక మరుపురాని గొప్ప రోజు అని అమిత్ షా చెప్పారు. హింసాకాండ వల్ల అసోం ప్రజలు ఎంతగానో నష్టపోయారని, 1979 నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. హింసను విడనాడేందుకు ఉల్ఫా అంగీకరించిందని తెలిపారు. శాంతి ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఒప్పందంలోని ప్రతి అంశాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. శాంతి ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం హిమంతబిశ్మ వర్మ అభివరి్ణంచారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ ఒప్పందం కార్యరూపం దాలి్చందని హర్షం వ్యక్తం చేశారు. ఏమిటీ ఉల్ఫా? ‘సార్వభౌమత్వ అస్సాం’ అనే డిమాండ్‌తో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా ఏర్పాటయ్యింది. డిమాండ్‌ను నెరవేర్చుకొనేందుకు ఉల్ఫా హింసాకాండనే నమ్ముకుంది. 1990లో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్ఫాలోని అరబిందా రాజ్‌ఖోవా వర్గం 2011 సెపె్టంబర్ 3 నుంచి శాంతి చర్చలు కొనసాగిస్తోంది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఉల్ఫాలో పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేదు. పరేశ్ బారువా ప్రస్తుతం చైనా–మయన్మార్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసిస్తున్నట్లు సమాచారం. -
ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(ఎంఏ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(మసరత్ ఆలం)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సాయపడుతూ దేశ వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ‘‘ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచే ఎలాంటి సంస్థలు, శక్తులనైనా కేంద్రం ఊరికే వదిలిపెట్టదు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద ఈ సంస్థపై చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్లో భారత వ్యతిరేక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, జనాన్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత అతివాద హురియత్ కాన్ఫెరెన్స్‌కు మసరత్ చైర్మన్‌గా ఉన్నారు. 2010లో కశ్మీర్ అల్లర్లకు బాధ్యుల్లో భట్ కూడా ఒకరు. దీంతో అదే ఏడాది భట్‌ను పోలీసులు అరెస్ట్‌చేయగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భట్‌ను విడిపించారు. బీజేపీ ఒత్తిడితో అరెస్ట్‌చేసి జైలులో పడేశారు. -
ఆధారాలు అందజేస్తే పరిశీలిస్తాం
న్యూఢిల్లీ: అమెరికాలోని సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత ప్రమేయముందన్న అంశంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ అంశంపై మోదీ మాట్లాడారు. ‘‘ పన్నూ హత్య కుట్రలో భారత్ ప్రమేయముందని ఎవరైనా బలమైన ఆధారాలు మా ప్రభుత్వానికి సమరి్పస్తే తప్పకుండా పరిశీలిస్తాం. మా భారతీయ పౌరుడు ఏదైనా మంచిపనో, చెడు పనో చేసి ఉంటే మాకు చెప్పండి. బలమైన ఆధారాలు అందజేయండి. మేం తప్పక పరిశీలిస్తాం. చట్టబద్ధపాలనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంబంధంలేని విషయాలతో అమెరికా–భారత్ దౌత్య సంబంధాలను కలపొద్దు. గత కొద్ది సంవత్సరాలుగా ఇరుదేశాల మైత్రి బంధం మరింత బలపడుతోంది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వమున్న పన్నూను హత్యచేసేందుకు భారతీయ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే భారతీయుడు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ పోలీసుల కస్టడీలో ఉన్న గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా ఒత్తిడిపెంచిన నేపథ్యంలో దీనిపై మోదీ మాట్లాడారు. ‘‘ అనవసర ఆరోపణల విషయం మాదాకా వచి్చంది. ఇప్పటికే ఈ ఆరోపణల్లో నిజానిజాల నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేశాం’’ అని మోదీ వెల్లడించారు. ‘‘ భావ ప్రకటనా స్వేచ్ఛ మాటున కొందరు విదేశాల్లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇంకోవైపు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు సమున్నత స్థితికి చేరుకుంటున్నాయి. ఇలాంటి వేర్వేరు ఘటనలకు మధ్య సంబంధం అంటగట్టడం సరికాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. -
కాశ్మీర్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
-
శ్రీనగర్‌లో మరోసారి రెచ్చిపోయిన వేర్పాటువాదులు
-
షబీర్ షాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరించారన్న ఆరోపణలతో షబీర్ షాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు హాజరుకావాలని పేర్కొంది. 2005లో హవాలా ద్వారా ఉగ్రవాదులకు డబ్బు తరలించిన కేసులో షా హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు శనివారం ఢిల్లీ చేరుకున్న వేంటనే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించిన విషయం తెలిసిందే. -
ప్రతీకార దాడి.. 11మంది మృతి
బమాకో: మాలిలో కొంతమంది ప్రత్యేక వాదులు చేసిన దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పెద్ద సంచలనం సృష్టించడమేకాకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత వారంలో జరిగిన కాల్పుల ఘటనకు ప్రతిగా తాజా ఘటన తలెత్తినట్లు తెలుస్తోంది. అజావద్ మూమెంట్ అనే ఒక తిరుగుబాటు సంస్థకు చెందిన మౌసా అగ్ అట్టాహర్ అనే వ్యక్తి మాట్లాడుతూ సెంట్రల్ మాలీకి సమీపంలోని టెనెన్కో అనే పట్టణంపై దాడి చేసినట్లు తెలిపాడు. ప్రభుత్వం గతవారం తమపై బలగాలతో చేయించిన దాడులుగా ప్రతీకారంగానే తాము దాడులకు పాల్పడినట్లు చెప్పాడు. తమ సత్తా ఏంటో చూపించాలని, తాము కూడా దాడులు చేయగలమని, పాలనను స్తంభింపచేయగలమని అటు పాలక వర్గాలకు, పార్టీలకు నిరూపించాలనే ఈ చర్యకు దిగామని వివరించాడు. కాగా, చనిపోయిన వారంతా కూడా తిరుగుబాటుదేరులేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వేర్పాటువాది నుంచి మంత్రిగా!
జమ్మూ: హురియత్ నేత అబ్దుల్ గనీ లోన్ తనయుడైన సజ్జద్ గనీ లోన్‌కు కరడుగట్టిన వేర్పాటువాద నేతగా పేరుంది. ఈయన ఆదివారం పీడీపీ-బీజేపీ సర్కారులో మంత్రిగా ప్రమాణం చేశారు. 2002 శ్రీనగర్‌లో మిలిటెంట్ల చేతిలో తన తండ్రి హత్యకు గురికావడం సజ్జద్ జీవితాన్ని మలుపుతిప్పింది. అదే ఏడాది హురియత్ కాన్ఫరెన్స్‌లో చీలిక రావడంతో వేర్పాటువాదులు రెండుగా చీలిపోయారు. అనంతరం 2004లో తన సోదరుడు బిలాల్ గనీ లోన్‌తో కలసి తన తండ్రి ఏర్పాటు చేసిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌ను పునరుద్ధరించారు. 2008లో అమర్నాథ్ భూఆందోళనల్లో 60 మంది మరణించడం ఆయనలో మార్పు తెచ్చింది. వేర్పాటువాదులు తమ పంథాను సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేసిన సజ్జద్.. హన్ద్వారా స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. -
వై.ఎస్.రాజశేఖరరెడ్డి వేర్పాటువాది కాదు: కేవీపీ రామచంద్రరావు
రాష్ట్ర విభ జనకు బీజం వేసింది దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డేనంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలను సోమవారం రాజ్యసభలో అదే పార్టీకి చెందిన సీనియర్ నేత డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావు తిప్పికొట్టారు. తెలంగాణ అంశంపై రాజ్యసభలో దాదాపు మూడు గంటలకు పైగా, పూర్తిస్థాయిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారనే విమర్శను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. చర్చలో పాల్గొన్న వివిధ పక్షాలకు చెందిన సభ్యుల వాదనలు అర్ధసత్యాలు, వక్రీకరణలతో కూడుకొని ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలుగు దేశం సభ్యులు చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవే కాక అభ్యంతరకరమైనవని అంటూ కేవీపీ ఖండించారు. తెలంగాణ అంశానికి సంబంధించి తాను వెల్లడించబోయే వివరాలు తప్పని ఏ కమిటీ అయినా రుజువు చేస్తే.. సభ విధించే ఎలాంటి శిక్షకైనా తాను బద్ధుడనై ఉంటానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇంతకుముందు ఎన్నడూ, ఎక్కడా ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. 2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో తెలంగాణపై రెండవ ఎస్సార్సీని నియమించాలని మాత్రమే పేర్కొన్నదని, 2004 ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రణాళిలో కూడా రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చామని, ఎన్నికల పొత్తు సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా ఎస్సార్సీ ప్రస్తావనే ఉందని స్పష్టంచేశారు. 2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెలంగాణ డిమాండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా సంబంధిత భాగస్వాములందరి అనుమానాలను, ఎదురయ్యే సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారాలు కనుగొనాల్సి ఉందంటూ అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీని నియమించారని ఆయన వివరించారు. ఆ తీర్మానం ఎప్పుడు జరిగిందో చెప్పండి..: రోశయ్య కమిటీ నియామకాన్ని ప్రకటించిన ప్రభుత్వ ఉత్తర్వును, ఆ తర్వాత విడుదలైన మరో జీవోలో పేర్కొన్న రోశయ్య కమిటీ పరిశీలనాంశాలను కేవీపీ సభలో చదివి వినిపించారు. వైఎస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారనడం అర్ధ సత్యమని, ఇదంతా వక్రీకరణేనని అన్నారు. తెలంగాణపై రాష్ట్ర శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిందన్న కేంద్ర హోం మంత్రి ప్రకటనను కూడా తీవ్రంగా ఖండించిన కేవీపీ, ఆ తీర్మానం ఎప్పుడు జరిగిందో, అప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలేమిటని కూడా ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించి దానిపై సమగ్ర చర్చను అనుమతించాలని కోరారు. దేశంలో మొత్తం చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఎన్నున్నాయని ప్రశ్నించిన ఆయన వాటన్నింటి పరిశీలనకు రెండో ఎస్సార్సీ వేస్తారా అని అడిగారు. దేశ చరిత్రలో రాజధాని నగరంతో కూడిన ప్రాంతం ఎప్పుడైనా వేరు పడిందా? అసలు చరిత్రలో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం అస్థిత్వంలో ఉండేదా అన్న విషయాలను కూడా వెల్లడించాలని ఆయన చిదంబరాన్ని డిమాండ్ చేశారు.