న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరించారన్న ఆరోపణలతో షబీర్ షాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు హాజరుకావాలని పేర్కొంది. 2005లో హవాలా ద్వారా ఉగ్రవాదులకు డబ్బు తరలించిన కేసులో షా హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు శనివారం ఢిల్లీ చేరుకున్న వేంటనే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించిన విషయం తెలిసిందే.