terror financing
-
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసి కోట్ లఖ్‌పత్ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
చైనా అండతో తప్పించుకోజూస్తున్న పాక్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోమారు పేచీకి దిగింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా కఠినమైన చర్యలు చేపట్టాలంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకుండానే వితండవాదం చేస్తోంది. ఎఫ్ఏటీఎప్ లక్ష్యాల్ని చేరుకోవడానికి 15 నెలలుగా మిన్నకుండిపోయిన పాక్ మరో నాలుగు నెలల కాలంలో అద్భుతాలు చేస్తామంటూ గొప్పలు చెప్తోంది. బ్లాక్ లిస్టులో చేరుకుండా చైనా అండతో తప్పించుకోవాలని చూస్తోంది. తను నిర్దేశించిన లక్ష్యాల్ని పాక్ చేరుకోలేదని ఎఫ్ఏటీఎఫ్ ఇటీవల స్పష్టం చేసింది.15 నెలల కాలంలో 27 లక్ష్యాల్ని తాము నిర్దేశించగా.. పాక్ ఆ దిశగా సరైన పనితీరును కనబర్చలేదని వెల్లడించింది. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చడం ఖాయమని పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది. ఇక 2018, జూన్ నెలలో పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. 2020 ఫిబ్రవరి వరకు ఉగ్ర నిర్మూలనకు ఉద్దేశించిన లక్ష్యాల్ని చేరుకోని పక్షంలో గ్రే నుంచి బ్లాక్‌లిస్టులో పెడతామంటూ అప్పుడే తేల్చి చెప్పింది. బ్లాక్ లిస్టులో పెడితే.. ఎఫ్ఏటీఎఫ్లో 39 సభ్య దేశాలున్నాయి. విశ్వవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలను నిర్మూలించడం.. ఉగ్రవాదులకు మనీలాండరింగ్ మార్గాల ద్వారా నిధులు అందకుండా చేయడం వంటి అంశాల ప్రాతిపదికన ఎఫ్ఏటీఎఫ్ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చింది. పలు లక్ష్యాల్ని నిర్దేశించింది. పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చితే.. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు ఇవ్వడానికి విదేశీ సంస్థలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ రుణాలు ముందుకురావు. అసలే అంతంతం మాత్రంగా ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ చర్య శరాఘాతం అవుతుంది. (చదవండి : మోదీ-జిన్‌పింగ్ భేటీ: కశ్మీర్‌పై కీలక ప్రకటన) ఇక పాక్‌ను బ్లాక్ లిస్టులో చేర్చితేనే ఫలితం ఉంటుందని, ఉగ్రచర్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని భారత్, అమెరికా భావిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఇదివరకే బ్లాక్‌లిస్టులో చేర్చే అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చైనా అండదండలతో పాక్ తప్పించుకుంది. ఎఫ్ఏటీఎఫ్ ప్రెసిడెంట్‌గా చైనా వ్యక్తి ఉండటమే దీనికి కారణం. మరోవైపు ఎఫ్‌టీఏఎప్‌లో పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చడానికి భారత్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని తమిళనాడులో ఇటీవల జరిపిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టుగా పలు విశ్లేషణలు చెప్తున్నాయి. మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి హమాద్ అజార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశం ఉగ్ర నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటోందని, ఎఫ్ఏటీఫ్ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు. ఎఫ్ఏటీఎఫ్ 27 లక్ష్యాల్లో 20 సాధించామని అన్నారు. -
పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: టెర్రర్ ఫైనాన్సింగ్‌పై పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏఎటిఎఫ్) మరోసారి తీవ్ర ఒత్తిడిని పెంచింది. కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయడంలో పాక్ విఫలమైందని, అక్టోబర్ నాటికి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే అంశంపై తన వైఖరి మార్చుకోవాలని శుక్రవారం హెచ్చరించింది. ఈ విషయంలో తన నిబద్ధతను పాటించకపోతే గట్టి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడింది. ఇది బ్లాక్‌లిస్ట్‌కు కూడా దారితీయవచ్చని హెచ్చరించింది. ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో ముగిసిన ప్లీనరీ సమావేశాల అనంతరం ఎఫ్‌ఏఎటిఎఫ్ ఈ ప్రకటనను విడుదల చేసింది. పాకిస్తాన్ తన కార్యాచరణ ప్రణాళికను జనవరి వరకు విధించిన గడువులోపు పూర్తి చేయడంలో విఫలమవ్వడమే కాక, మే 2019 నాటికి కూడా విఫలమైందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇకనైనా తమ వ్యూహాత్మక లోపాలను సరిదిద్దుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని, 2019 అక్టోబర్ నాటికి దీన్ని వేగంగా పూర్తి చేయాలని వార్నింగ్ ఇచ్చింది. లేదంటే ఆ తరువాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటామని తెగేసి చెప్పింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను నిషేధిత జాబితాలో (బ్లాక్‌లిస్ట్) చేర్చాలని ఎఫ్ఏటీఎఫ్ పై భారత్ ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ అక్టోబర్ వరకు ఇదే జాబితాలో కొనసాగనుంది. ఉగ్రవాదులకు అందే నిధులపైన ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెట్టి, అందుకనుగుణంగా చర్యలు చేపడుతుంది. ఏ దేశమైనా నిధులు సమకూర్చుతున్నట్లు తేలితే బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది. -
ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. -
షబీర్ షాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరించారన్న ఆరోపణలతో షబీర్ షాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు హాజరుకావాలని పేర్కొంది. 2005లో హవాలా ద్వారా ఉగ్రవాదులకు డబ్బు తరలించిన కేసులో షా హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు శనివారం ఢిల్లీ చేరుకున్న వేంటనే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించిన విషయం తెలిసిందే.