summoned
-
భారత్‌పై కెనడా మంత్రి ప్రేలాపనలు
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వ పెద్దల ప్రేలాపనలు ఆగడం లేదు. ఒకవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నప్పటికీ మరోవైపు వారు మరింత ఆజ్యం పోస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులపై దాడులకు, కుట్రలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమంటూ కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మోరిసన్ చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదురుతోంది. మోరిసన్ మంగళవారం కెనడా జాతీయ భద్రతా కమిటీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ అమిత్ షా ప్రస్తావన తీసుకొచ్చారు. కెనడాలో ఉన్న సిక్కు వేర్పాటువాదులకు, ఖలిస్తానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించాలని, సిక్కులను భయాందోళనకు గురి చేయాలని, వారికి సంబంధించిన సమాచారం సేకరించాలంటూ భారత నిఘా అధికారులను అమిత్ షా ఆదేశించారని చెప్పారు. అయితే, అమిత్ షా ఈ ఆదేశాలిచి్చనట్లు కెనడాకు ఎలా తెలిసిందో మోరిసన్ వెల్లడించలేదు. 2023 జూన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్–కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే చాలావరకు క్షీణించాయి. అయినా కూడా కెనడా మంత్రి మోరిసన్ నోరుపారేసుకోవడం గమనార్హం. కెనడా హైకమిషన్ ప్రతినిధికి నిరసన కెనడా మంత్రి డేవిన్ మోరిసన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అర్థంపర్థం లేని, ఆధారాల్లేని ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ మండిపడ్డారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన భారత్, కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అసంబద్ధమైన ఆరోపణలతో పరిస్థితిని దిగజార్చవద్దని సూచించారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసే కుతంత్రాలు మానుకోవాలని కెనడాకు స్పష్టంచేశారు. కెనడా మంత్రులు, అధికారులు భారత్ గురించి అంతర్జాతీయ మీడియాకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు ఇస్తున్నారని రణ«దీర్ జైస్వా ల్ ఆరోపించారు. కెనడా మంత్రి మోరిస్ తాజా ఆరోపణల పట్ల భారత్‌లోని కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. కెనడాలో భారత కాన్సులర్ సిబ్బందికి వేధింపులు కెనడాలోని భారత కాన్సులర్ సిబ్బందిని కెనడా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని రణ«దీర్ జైస్వాల్ ఆరోపించారు. వారిపై ఆడియో, వీడియో నిఘా పెట్టిందని చెప్పారు. సిబ్బంది మధ్య సమాచార మారి్పడిని అడ్డుకుంటోందని వెల్లడించారు. తరచుగా వేధించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. దౌత్యపరమైన నిబంధనలు, ఒప్పందాలను కెనడా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై తమ నిరసనను కెనడా ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. -
నకిలీ టికెట్ల వ్యవహారం.. బుక్‌మైషో సీఈవోకు సమన్లు
బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ షో నలికీ టికెట్లతో బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సహ వ్యవస్థాపకుడైన ఆశిష్ హేమ్రజనీ ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈయనతోపాటు కంపెనీ టెక్నికల్ హెడ్‌కు కూడా సమన్లు పంపినట్లు ఒక అధికారి తెలిపారు.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 19 నుండి 21 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే కచేరీకి సంబంధించి బుక్‌మైషో టిక్కెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ సీఈవో, టెక్నికల్ హెడ్లకు సమన్లు పంపిన అధికారులు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయాల్సి ఉందని కోరారు.కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి బుక్‌మైషోపై ఫిర్యాదు చేసిన న్యాయవాది అమిత్ వ్యాస్.. రూ.2,500 ఉన్న టెకెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అమిత్ వ్యాస్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అధికారులు.. టికెట్ల దందాలో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. -
హైడ్రా కమిషనర్ విచారణకు రావాలి: హైకోర్టు
సాక్షి,హైదరాబాద్:కూల్చివేతలపై హైడ్రాను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొడతారా? అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని సంగారెడ్డి అమీన్పూర్ వాసి వేసిన పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్27) హైకోర్టు విచారించింది.తన ఆస్పత్రిని కూల్చి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.దీనిపై సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఫిజికల్‌గా లేదా వర్చువల్‌గా సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని కోరింది.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.అయితే ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ -
Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జనవరి 11న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో జరిగిన అవకతవకలపై ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ 2022లో అధికారికంగా అభియోగాలు మోపింది. సంబంధం లేని పార్టీలు, JKCA ఆఫీస్ బేరర్లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం, అలాగే JKCA బ్యాంక్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణలు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. అబ్దుల్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన 2018 ఛార్జిషీట్లో దాఖలు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు దాఖలు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మోసం కేసులో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. మరోసారి జాక్వెలిన్‌కు సమన్లు
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల వసూళ్ల కేసుతోపాటు మనీ లాండరింగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసు శాఖ ఆర్థికనేరాల విభాగం అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రముఖ వ్యక్తులను మోసగించి, రూ.200 కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకదశలో సుఖేశ్‌ను పెళ్లి చేసుకోవాలని జాక్వెలిన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
నగ్న ఫొటోషూట్ కేసు: విచారణలో రణ్వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఎంతటి వివాదం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ ఇటీవల నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు స్టేషన్లో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్ ఇటీవల ఈ కేసులో ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేసి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ విచారణలో రణ్వీర్ అమాయకత్వాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్లో విచారణకు హాజరైన రణ్వీర్ను పోలీసులు 2 గంటలకుపైగా విచారించినట్లు సమాచారం. తన నగ్న ఫొటోషూట్‌పై వివాదం నెలకొన్నప్పటికీ రణవీర్ సింగ్ ఇంత వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. పోలీసుల ముందు కూడా అదే విధానాన్ని కొనసాగించాడట రణ్వీర్. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదంటూ బుకాయిచ్చాడట అతడు. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఇక పోలీసులు ఏం అడిగిన ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్ అతడి న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్లోడ్ కానీ, పబ్లిష్ చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో రణ్‌వీర్‌పై ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి పిలిపిస్తామని విచారణాధికారి వెల్లడించారు. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్‌కు బిగుస్తున్న ఉచ్చు..
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమెకు డిల్లీ పాటియాల హౌజ్ కోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కోర్టులో హాజరు కావాలని జాక్వెలిన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆమెకు సమాన్లు ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల జాక్వెలిన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ. ఈ ఛార్జ్‌షీట్‌ను ఈడీ కోర్టులో సమర్పించగా దాని ఆధారంగా తాజాగా కోర్టు జాక్వెలిన్‌కు సమాన్లు జారీ చేసింది. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ కాగా రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని జాక్వెలిన్ ఈడీని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? -
చిక్కుల్లో రణ్వీర్ సింగ్.. విచారణకు హాజరు కావాలని ఆదేశం
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చిక్కల్లో పడ్డారు. ఆయన న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ముంబై పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ రణ్‌వీర్‌కు సమన్లు అందజేశారు. కాగా ఇటీవలె ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మహిళల మనోభావాలను ఆయన దెబ్బతీశారంటూ శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు విచారణలో ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్‌కి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు అందజేశారు. -
చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు
Karate Kalyani Summoned By Officials Over Child Adoption: సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రాంక్ పేరుతో ఆసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌పై కరాటే కళ్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం కొసమెరుపు. ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిందా?.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనేది తెలియల్సి ఉంది. చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్ మెడల్! మరోవైపు కరాటే కల్యాణి ఓ చిన్నారి దత్తత వ్యవహరం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆమెకు గతంలో నోటిసులు ఇచ్చినట్లు తాజాగా అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే ఆమె ఆ నోటీసులకు స్పందించలేదని, తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నేడు సోమవారం(మే 16) ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రేపటి వరకు ఆమె ఈ నోటీసులపై స్పందించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది? పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయని, దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ చట్టానికి విరుద్ధంగా వెళితే మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు. కాగా కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా రీసెంట్గా శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి కూడా ఉన్న విషయం తెలిసిందే. -
జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు కోర్టు నోటీసులు
బాలీవుడ్ ‘భాయిజాన్’, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన పేరు సినిమాలో కంటే కూడా హీరోయిన్స్‌తో సల్మాన్ ఎఫైర్స్ అంటూ ఎక్కువగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికే కృష్ణ జింకను చంపిన కేసులో సల్మాన్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు దీనితో పాటు ఓ జర్నలిస్ట్‌పై దాడి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2019లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సల్మాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌కు అంధేరి కోర్టు సమన్లు జారీ చేసింది. సదరు జర్నలిస్ట్ అశోక్ పాండే.. సల్మాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆర్ఆర్ ఖాన్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కాగా 2019లో ముంబై రోడ్డులో సైక్లింగ్ చేస్తుండగా సల్మాన్ తన ఫోన్ లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే సమయంలో మీడియా ఆయనను ఫొటోలు తీస్తున్నారని, ఈ క్రమంలో సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్ తన దగ్గరికి వచ్చి ఫోన్ లాగేసుకుని బెదరించినట్లు అశోక్ పాండే ఆరోపించాడు. -
దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు
దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది. ఆయన తనయులు దాసరి అరుణ్, దాసరి ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్ కోర్టు బుధవారం నోటీసులు పంపింది. వ్యాపార లావేదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సోమ శేఖర్‌రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్‌లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక తిరిగి డబ్బులు చెల్లించడంలో వారు జప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్ రావు సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ రెండు వారాల్లో డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. చదవండి: Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అప్డేట్.. పవన్ లుక్ అదుర్స్ -
అభిషేక్ బెనర్జీకి షాకిచ్చిన ఈడీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ, అభిషేక్ బెనర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోల్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభిషేక్, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 6 న అభిషేక్, సెప్టెంబర్ 1 న రుజీరా ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్ దంపతులను ఆదేశించింది. అలాగే బెనర్జీల తరఫు న్యాయవాది సంజయ్ బసు సెప్టెంబర్ 3 , వీరితోపాటు ఇదే కేసులో బెంగాల్ పోలీసు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శ్యామ్ సింగ్, జ్ఞవంత్ సింగ్‌లు సెప్టెంబర్ 8 ,9 తేదీల్లోహాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోట్లరూపాయల అవినీతి సంబంధించి సీబీఐ (నవంబర్, 2020) దాఖలు చేసిన కేసు అధారంగా ఈ సమన్లు జారీ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని కూడా వచ్చే నెలలో హాజరుకావాలని సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన అభిషేక్ దర్యాప్తు సంస్థల ద్వారా బీజీపీ సర్కారు తమపై వేధింపులకు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పరిణామమని మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. అలాగే అక్రమమైనింగ్ వ్యవహారంలో అభిషేక్ ప్రధాన లబ్ధిదారుని గతంలో ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మాజీ సీఎం భార్యకు ఈడీ సమన్లు
శ్రీనగర్: మనీలాండరింగ్ కేసులో జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తల్లి గుల్షన్ నజీర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కేసు విచారణ కోసం ఆగస్టు 18న శ్రీనగర్ ఈడీ ఆఫీసుకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఫ్తీ ముహమ్మద్ సయీద్ భార్య గుల్షన్ నజీర్. 70సంవత్సరాలు పైబడిన వృద్దురాలికి నోటీసులు పంపడంపై ముఫ్తీ, ఆమె పార్టీ పీడీపీలు తీవ్ర విమర్శలు చేశాయి. కాశ్మీర్లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఏదైనా కార్యక్రమం చేపట్టగానే ఎవరికోఒకరికి సమన్లు జారీ అవుతాయని పీడీపీ దుయ్యబట్టింది. గురువారం కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసి రెండేళ్లయిన సందర్బంగా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఇందుకే ముఫ్తీ తల్లికి సమన్లు వచ్చాయని విమర్శించిన పీడీపీ, ఈ కేసు వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ వివరాలుంటే తాము లీగల్‌గా సిద్దమవుతామని తెలిపింది. -
రాజ్‌కుంద్రా కేసు: నటికి సమన్లు
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త , శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అశ్లీ చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా, వియాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుంద్రాకు పోర్న్ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. రేపు (జూలై 27, ఉదయం 11 గంటలకు) తమ ముందు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చింది. ఈ కేసుకు సంబంధించి షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు సమాచారం కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని అంచనా. కాగా రాజ్ కుంద్రా వ్యవహారంపై సోషల్ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్, జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించిన తరువాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్‌కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై ఎటాక్ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగు తున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
కమెడియన్‌కు రూ. 5.5 కోట్ల కుచ్చుటోపి!
ముంబై: ప్రముఖ కమెడి కింగ్ కపిల్ శర్మకు ముంబై క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం సమన్లు ఇచ్చింది. ఇటీవల ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ రిజిస్టర్డ్ కార్ల కేసులో ఆయన స్టెట్మెంట్ కోసం ఏపీఐ సచిన్ వాజ్ ఆయనను పలిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ ఈరోజు మధ్యాహ్నం ముంబ్రై క్రైం బ్రాంచ్ కార్యాలయంలో హజరయ్యారు. ఆనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వానిటీ వ్యాన్ కారు తయారి కోసం ఇటీవల కార్ల డిజైనర్ దిలీప్ చాబ్రియాకు 5.5 కోట్ల రూపాయలను చెల్లించాను. అయితే అతడు డబ్బులు తీసుకుని నా పని చేయకుండ తప్పించుకుని తిరుగుతున్నాడు. (చదవండి: ఆ సమయంలో చనిపోవాలనుకున్న: హీరో రాజా) దీంతో నేను ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు గతేడాది ఫిర్యాదు చేశాను. చాబ్రియాపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు పేపర్లో చదివాను. దీంతోనే ముంబై కమిషనర్‌ను కలవాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే నా వాంగ్ములం తీసుకునేందుకు పోలీసులు పిలిచారు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా డిసెంబర్ 9న చాబ్రియాను అరెస్టు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, 465, 467, 468, 471, 120(బీ) చట్టం కింద కేసు నమోదు చేశారు. -
మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహరంలో సంబంధాలు ఉన్నట్లు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి అర్జున్‌కు మంగళవారం సమన్లు అందజేసి తదుపరి విచారణకు ఇవాళ(డిసెంబర్ 16) ఎన్సీబీ కార్యాలయంలో హజరుకావల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు అర్జున్ హాజరకాలేదు. డిసెంబర్ 21వ తేదీ వరకు ఆయనకు గడువుకాలని ఎన్సీబీని కోరాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో అర్జున్‌కు గత నవంబర్ 9న ఎన్సీబీ సమన్లు అందజేసి ఆయన ఇంటిపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటలపాటు ఆయన ఇంటిలో తనిఖీ చేసిన ఎన్సీబీ అధికారులు కొన్నీ డాక్యుమెంట్స్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని 13న విచారించింది. ఆ తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ గ్యాబ్రియోల్ డెమెట్రియేడ్స్‌కు కూడా సమన్లు అందజేసి విచారించారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి సమన్లు) అయితే ఈ ఏడాది జూన్ 14న హీరో సుశాంత్ సింగ్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వారిని పోలీసులు ఆరెస్టు చేశారు. విచారణలో రియా హీరోయిన్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను వెల్లడించడంతో ఎన్సీబీ వారికి కూడా సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్టెయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌లకు ఇటీవల బెయిల్ లభించగా సుశాంత్ ఇంటీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్‌తో మరో ఇద్దరూ జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) -
సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు..?
మంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో భాగంగా సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనుంది. ఈ వారంలోనే ఎన్సీబీ వీరికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (నన్ను మీడియా వేధిస్తోంది: రకుల్ ప్రీత్) ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్సీబీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం త్వరలో సమన్లు జారీచేయనున్నట్లు సమాచారం. (సుశాంత్‌కు అరుదైన నివాళి...) -
జెట్ ఎయిర్వేస్: మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : అప్పుల ఊబిలో కూరుకు పోయి కార్యకలాపాలను నిలిపివేసిన ప్రయివేటు రంగవిమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థపాకుడు నరేష్ గోయల్ మీద తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేష్ గోయల్‌ను ప్రశ్నించబోతోందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు నరేష్ గోయల్ దుబాయ్‌లోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతోపాటు, ఇందుకు దుబాయ్ కంపెనీకి కమిషన్ ముట్టినట్టుగా అసెస్మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నరేష్ గోయల్‌ను ఆదేశించింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను అధికారి చెప్పారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్మెంట్ వింగ్ విచారణ అనంతరం, మరింత వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. కాగా 2018 సెప్టెంబర్‌లో జెట్ ముంబై కార్యాలయాంలో దాడులు, కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై దర్యాప్తు ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్‌ఎయిర్‌వేస్ అవకతవకల ఆరోపణలను ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
రాయబారిని వెనక్కి పిలిచిన పాక్
-
రాయబారిని వెనక్కి పిలిచిన పాక్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తమ రాయబారి సొహైల్ మహ్మద్‌ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్‌ను పిలిపించినట్టు పాక్ పేర్కొంది. భారత్‌లో తమ హైకమిషనర్ సొహైల్ అహ్మద్‌ను చర్చల నిమిత్తం పాకిస్తాన్ పిలిపించామని, ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైసల్ ట్వీట్ చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఉదంతంపై పాక్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసిన భారత్ ఆత్మాహుతి దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై పాకిస్తాన్ తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ భూభాగం నుంచి ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులను కట్టడి చేయాలని కోరింది. దాడి జరిగిన మరుసటి రోజు పాక్‌లో భారత రాయబారిని సంప్రదింపుల కోసం ఢిల్లీకి పిలిపించారు. -
IRCTC కుంభకోణంలో లాలూకు షాక్
-
హిమాచల్ సీఎంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు పంపింది. ఈనెల 20న విచారణ నిమిత్తం తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఏప్రిల్ 13న హాజరు కావాలని సమన్లు పంపినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఇప్పటికే అతని భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లను మనీ లాండరింగ్ కేసులో విచారించింది. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు చెందిన ఫాంహౌస్‌ను ఈడీ జప్తు చేసింది. దీని విలువ రూ.27.29 కోట్లు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు కేంద్రం సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటోందని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తనను వేధిస్తోందని ఫాంహౌస్‌ను సీజ్ చేసిన తర్వాత వీరభద్రసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ఉత్తరాఖండ్ సీఎంకు సమన్లు
-
ఉత్తరాఖండ్ సీఎంకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు సీబీఐ మళ్లీ సమన్లు జారీ చేసింది. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. స్టింగ్ ఆపరేషన్ వీడియోపై విచారణలో భాగంగా తాజాగా సీఎంకు సీబీఐ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 26న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటపడటంతో గతేడాది ఏప్రిల్ 29న సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 24న రావత్‌ను దాదాపు 5గంటలపాటు సీబీఐ ప్రశ్నించింది. అంతకుముందు బల పరీక్షలో రావత్ విజయం సాధించిన అనంతరం మే 15న రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. సీబీఐ విచారణను వెనక్కు తీసుకుని, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ దీనికి సీబీఐ విముఖత వ్యక్తం చేసింది. -
ఓటుకు నోటు కేసు: ఉత్తరాఖండ్ సీఎంకు సమన్లు
ఉత్తరాఖండ్-లో సంచలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (ఓటుకు నోటు) రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. గత ఏడాది దుమారం రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై విచారణలో భాగంగా సీబీఐ ఈ చర్య తీసుకుంది. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో సీఎంకు వ్యతిరేకంగా బయటపడిన స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 26 (సోమవారం)న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడంతోపాటు బీజేపీ లోని కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు వ్యతిరేకంగా దుమారం చెలరేగింది. 23మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వారితో మాట్లాడుతుండగా రికార్డయిన ఆడియో టేపు, వీడియో (సీడీ) వివాదాన్ని రాజేసింది. సీఎం హరీష్ రావత్ డబ్బులిస్తానని తమను మభ్యపెట్టేందుకు యత్నించారని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించడం సంచలనానికి దారి తీసింది. దీనిపై సీబీఐ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆప్ ఆరోగ్య మంత్రికి ఐటీ చిక్కులు
న్యూఢిల్లీ : ఇప్పటికే పలు కుంభకోణాల్లో ఇరుక్కొని ఆప్ మంత్రులు ఆపసోపాలు పడుతుండగా.. తాజాగా మరో ఆప్ మంత్రికి సస్పెన్షన్ చిక్కు ఎదురుకాబోతుంది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న సత్యేంద్ర జైన్‌కు ఐటీ శాఖ సమన్లు జారీచేసింది. కోల్‌కత్తాకు చెదిన సంస్థల పన్ను ఎగవేత కేసుల్లో సత్యేంద్ర జైన్‌కు సంబంధం ఉందనే ఆరోపణలపై ఆయనను అక్టోబర్ 4న తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా ఐటీ శాఖ ఆదేశించింది. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు, గత నాలుగేళ్ల కాలంలో జరిపిన ఆదాయపు పన్ను రిటర్న్స్ వివరాలతో తమ ముందు హజరుకావాలని పేర్కొంది. పన్ను ఎగవేత, అక్రమ ఆర్థిక ఉపశమనాల కేసు ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే కోల్‌కత్తాలోని ఓ మూడు సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడి జరిపింది. ఆ రైడ్స్‌లో జైన్‌కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆ కంపెనీలతో జైన్‌కు సంబంధం ఉన్నట్టు తెలుస్తుండటంతో, నిజంగా వాటితో జైన్‌కు సంబంధం ఉందా లేదా అనేది తేల్చడంపై ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఈ విచారణ నిమిత్తం ఐటీ శాఖ జైన్‌కు సమన్లు జారీచేసింది. అయితే దీనిపై స్పందించిన జైన్, తనను కేవలం సాక్షిగా మాత్రమే రావాలని ఐటీ శాఖ సమన్లను జారీచేసిందని, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అక్టోబర్ 4న ఐటీ శాఖ ముందు హాజరుకాబోతున్నట్టు తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టానని, కానీ 2013 నుంచి ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సత్యేంద్ర జైన్‌ను వెనక్కేసుకొచ్చారు. సత్యేంద్ర ఎలాంటి తప్పులెరుగరని చెప్పారు. ఒకవేళ సత్యేంద్ర తప్పుచేసినట్టు తేలితే, మంత్రి పదవినుంచి బయటికి పంపించడానికి కూడా వెనక్కాడని మరోవైపు హెచ్చరికలు కూడా చేశారు. -
సల్మాన్ ఖాన్ కు సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ రేప్ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. సల్మాన్ కు తాజాగా జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. జులై 8 న హాజరై సమాధానం చెప్పాల్సిందిగా కమిషన్ తేల్చి చెప్పింది. ఇంతకు ముందు సల్మాన్ ను పబ్లిక్ గా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ కమిషన్ కోరింది. అయితే క్షమాపణ చెప్పే అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేయడంతో్ తాజాగా ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. సుల్తాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ ఛానల్లో సల్మాన్ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు నా పరిస్థితి రేప్ కు గురైన మహిళగా ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు!
న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు స్థానిక కోర్టు సమన్లు పంపింది. పది నెల్లక్రితం పోలీసులను ఉద్దేశించి ఆయన వాడిన అభ్యంతరకర పదాలపై ఇద్దరు పోలీసులు కోర్టుకు ఫిర్యాదు చేయడంతో విచారించిన కోర్టు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. గతంలో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పోలీసులను ''తుల్లా'' గా పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో టెలివిజన్ ఇంటర్వ్యూ ప్రసారం అనంతరం పోలీసులను ఉద్దేశించి కేజ్రీవాల్ వాడిన పదంపై నగరంలోని రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వడంతోపాటు, కోర్టులో పరువునష్టం దావా కూడ వేశారు. ఈ కేసు నగరంలోని అనేకమంది సీనియర్ పోలీసు అధికారులను కూడ ఆకర్షించింది. ఇద్దరు ఢిల్లీ కానిస్టేబుళ్ళ ఫిర్యాదు మేరకు గత జూలై 14న కేజ్రీవాల్ స్వయంగా కోర్టు హాజరు కావాల్సి వచ్చింది. సీఎం కేజ్రీవాల్ వాడిన పదం ఒక్క పోలీసులను మాత్రమే కాదని, ఢిల్లీ పౌరుల పరువుకు కూడ భంగం కలిగించడమేనంటూ కానిస్టేబుళ్ళు కపూర్ సింగ్ ఛికారా, హర్వీందర్ సింగ్ లు తమ ఫిర్యాదులో తెలిపారు. ఇప్పటికే కేజ్రీవాల్, ఆప్ సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. గత డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కోవార్డ్, సైకోపాత్ అంటూ ట్వీట్ చేసి వివిధ వర్గాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడ ఎదుర్కొన్నారు. -
మాల్యాకు ఈడీ సమన్లు...
♦ ఐడీబీఐ కేసులో 18న విచారణకు హాజరు కావాలని ఆదేశం ♦ కేఎఫ్ఏ మాజీ సీఎఫ్‌వో విచారణ ముంబై: ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎగవేసిన కేసుకు సంబంధించి ఆ సంస్థ ప్రమోటరు విజయ్ మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న హాజరు కావాలంటూ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే తన వ్యక్తిగత ఆర్థిక వివరాల పత్రాలు సమర్పించాలని సమన్లలో సూచించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఎఫ్ఏ) మాజీ సీఎఫ్‌వో ఎ. రఘునాథన్‌ను ఈడీ ప్రశ్నించింది. వివిధ ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ఆయన్ను ప్రశ్నించడం కీలకమైనదని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకుకు దాదాపు రూ. 900 కోట్లు ఎగవేసిన అంశంలో మనీలాండరింగ్ కోణానికి సంబంధించి బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్‌తో పాటు కింగ్‌ఫిషర్ సంస్థ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేఎఫ్ఏ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి మాల్యా వ్యవహార శైలే కారణమని, ఆయన ఆదేశాల ప్రకారమే తాను నడుచుకున్నానని గత నెలలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐవో)కి ఇచ్చిన స్టేట్మెంట్లో రఘునాథన్ తెలిపారు. సేవా పన్ను కేసుపై విచారణ వాయిదా.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని చీఫ్ విజయ్ మాల్యా నుంచి రూ. 32 కోట్లు రికవరీ చేసుకోవడానికి సేవా పన్ను విభాగం వేసిన రెండు పిటీషన్లపై విచారణను బాంబే హైకోర్టు మార్చి 28కి వాయిదా వేసింది. 2010-11లో కేఎఫ్ఏ ప్రయాణికుల నుంచి వసూలు చేసినా.. ఖజానాకు జమ చేయని సర్వీస్ ట్యాక్స్ రికవరీ కేసులో మాల్యాకు మేజిస్ట్రేట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సేవా పన్ను విభాగం పిటీషన్ వేసింది. ఏప్రిల్ 6న తదుపరి విచారణ కోసం మాల్యా సహా ఇతర డెరైక్టర్లు ట్రయల్ కోర్టు ముందు, హైకోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశించాలంటూ కోరింది. డీఆర్టీ ఆదేశాలను పరిశీలిస్తాం: డియాజియో మాల్యాకి ఇచ్చే 75 మిలియన్ డాలర్లను నిలిపివేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాలను సమీక్షించనున్నట్లు బ్రిటన్ లిక్కర్ సంస్థ డియాజియో తెలిపింది. డీఆర్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియలో ఉన్నట్లు తమకు తెలిసిందని, పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చాక తాము సమీక్షిస్తామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, తాము ఇప్పటికే 40 మిలియన్ డాలర్లు మాల్యాకు చెల్లించేసినట్లు వివరించారు. బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్ల ఎగవేతకు సంబంధించి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, మాల్యాపై సీబీఐ మొదలుకుని ఈడీ దాకా పలు దర్యాప్తు సంస్థలు కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడంతో వివాదం తీవ్ర రూపు దాలుస్తోంది. -
షబీర్ షాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరించారన్న ఆరోపణలతో షబీర్ షాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు హాజరుకావాలని పేర్కొంది. 2005లో హవాలా ద్వారా ఉగ్రవాదులకు డబ్బు తరలించిన కేసులో షా హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు శనివారం ఢిల్లీ చేరుకున్న వేంటనే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించిన విషయం తెలిసిందే. -
బొగ్గు స్కాంలో దాసరికి కోర్టు సమన్లు
-
బొగ్గు స్కాంలో దాసరి, జిందాల్, మధుకోడాకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా సహా 14 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిని ఈ నెల 22వ తేదీన కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి భారత్ పరాశర్ ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపునకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ... కేంద్ర మాజీ మంత్రి దాసరితో పాటు 15 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా పేర్కొంటూ ఏప్రిల్ 29న చార్జిషీటు దాఖలు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420, 409 కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఆప్ నేతకు సమన్లు
న్యూఢిల్లీ: సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మహిళా కార్యకర్తను వేధించారనే ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేతకు సమన్లు జారీ చేసింది. పార్టీ నేత కుమార్ విశ్వాస్ పార్టీ మహిళా కార్యకర్తను వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరవ్వాలని ఆప్ నేతను కోరామని కమిషన్ ప్రతినిధి సోమవారం తెలిపారు. గతం సంవత్సర కాలంలో అమేధీలో పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నమహిళను లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వేధించినట్టుగా తమకు ఫిర్యాదు అందిందని ఆమె చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఆప్ కొట్టి పారేసింది. ఇంతవరకు తమకెలాంటి సమన్లు అందలేదని ఆప్ తెలిపింది. కాగా అవినీతి రహిత సమాజమే లక్ష్యమనే నినాదంతో ఢిల్లీ గద్దెనెక్కిన ఆప్ ప్రభుత్వాన్ని వరుస వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే పార్టీలో చీలిక అలజడి సృష్టించింది. ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ప్రకంపనలురేపింది. న్యాయశాఖ మంత్రి విద్యార్హతలపై రగడ ఇంకా చల్లారనేలేదు. ఇపుడు మహిళను వేధించిన కేసు. దీంతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. -
మన్మోహన్‌కు సమన్లు ఇవ్వండి
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు అమెరికా కోర్టు ఆదేశం వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌కు జూన్ 18లోగా సమన్లు అందివ్వాలని సిక్కుల మత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)ను అమెరికా కోర్టు ఆదేశించింది. జూన్ 18లోగా ఆయనకు సమన్లు అందించనట్లయితే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మన్మోహన్పై పెట్టిన కేసును కొట్టివేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మన్మోహన్‌కు సమన్లు అందించినట్టుగా ఆధారాలను జూన్ 18లోగా తమకు సమర్పించాలని అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ ఈ బోస్బెర్గ్ ఈ నెల 18న ఎస్ఎఫ్జేకు ఆదేశాలు జారీ చేశారు. 1990ల్లో పంజాబ్‌లో సిక్కులపై దాడులు, హత్యాకాండకు మన్మోహన్ సహకరించారంటూ ఎస్ఎఫ్జే వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను మన్మోహన్‌కు అందివ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.