
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.
అయితే ఆర్‌జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.
చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ