కోల్‌కతా వైద్యురాలి కేసు : సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం | CBI investigates crime spot of RG Kar Medical College | Sakshi
Sakshi News home page

కోల్‌కతా వైద్యురాలి కేసు : సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం

Published Mon, Sep 2 2024 8:01 AM | Last Updated on Mon, Sep 2 2024 10:00 AM

CBI investigates crime spot of RG Kar Medical College

కోల్‌కతా :  ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆగస్ట్‌ 9న ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.

కేసు విచారణలో భాగంగా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి ఎమర్జెన్సీ బిల్డింగ్‌,బాయ్స్ హాస్టల్‌, ప్రిన్సిపల్‌ ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇదే కేసు నిమిత్తం ఆగస్ట్‌ 29న సీబీఐ అధికారులు ఆర్‌జీకార్‌ ఆస్పత్రి శవాగారాన్ని పరిశీలించారు.

మాజీ ప్రిన్సిపల్‌కు రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు 
మరోవైపు వైద్యురాలి కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆర్‌జీకార్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌కు రెండు సార్లు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

చదవండి : మమత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఆ రాత్రి ఏం జరిగింది?
కోల్‌కతా అభయపై జరిగిన దారుణంపై దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. అభయ ఘటన జరగక ముందు రాత్రి అంటే ఆగస్ట్‌ 8న అభయ, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను వీక్షించారు.  అయితే, తెల్లవారు జామున (ఆగస్ట్‌9) 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. 

ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్ ఆగస్టు 9న తెల్లవారు జామున ఉదయం 3.50 గంటల సమయంలో ఆర్‌జీకార్‌ ఆసుపత్రికి చేరుకున్నాడు. తొలుత ఆపరేషన్‌ థియేటర్‌ డోర్‌ను పగలగొట్టిన నిందితుడు.. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్‌ హాల్‌లో గాఢ నిద్రలో ఉండగా, రాయ్‌ అభయంపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. 

ఉదయం 9.30 గంటలకు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. దీంతో అభయ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దారుణం జరిగిన ప్రదేశంలో బ్లూటూత్‌ లభ్యమైంది. ఆ బ్లూటూత్‌ను అనుమానితుల మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారి ఫోన్లకు హెడ్‌ఫోన్‌  కనెక్ట్‌ చేయడానికి ప్రయత్నించగా అది సంజయ్‌ ఫోన్‌కు కనెక్ట్‌ అయ్యింది. దీంతో సంజయ్‌ రాయ్‌ అసలు నిందితుడిగా పోలీసులు తొలుత గుర్తించారు.

అనంతరం విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన అనంతరం నిందితుడు సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి తన దుస్తులపై ఉన్న రక్తపు మరకల్ని సంజయ్ శుభ్రం చేసుకున్నాడు. అయితే అతడి షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడు సంజయ్‌ రాయ్‌ని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సంజయ్‌ రాయ్‌తో పాటు ఆర్‌జీకార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement