
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో అత్యంత భయానకంగా జరిగిన ట్రైనీ మహిళా డాక్టర్ హత్యకేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది.
దర్యాప్తు కోసం సీబీఐ పోలీసులు బుధవారం(ఆగస్టు14) ఉదయాన్నే కలకత్తా చేరుకున్నారు. ఇప్పటివరకు కేసు దర్యాప్తు చేసిన కలకత్తా పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు తీరుపై పశ్చిమబెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారమే కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.
దీంతో మరుసటిరోజే సీబీఐ రంగంలోకి దిగింది. ఇటీవల కలకత్తాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. అన్ని రాష్ట్రాల్లోజూనియర్‌డాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రవైద్యశాఖ మంత్రి జేపీనడ్డా హామీతో తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.