కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్‌లోని హౌరా, సోనార్‌పూర్, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.
హత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది.
సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ఆర్జీకర్‌మెడికల్ కాలేజీ అక్రమాల సీబీఐ కేసులో సందీప్‌ఘోష్ అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. 8 రోజుల పాటు ఘోష్‌ను విచారించేందుకు కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది.
మరోవైపు మహిళా డాక్టర్ హత్యాచారం కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు.
ఇదీ చదవండి.. బలవంతంగా దహనం చేశారు
Comments
Please login to add a commentAdd a comment