కలకత్తా : కలకత్తా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం,హత్య ఘటనపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వచ్చామని, ఆస్పత్రిలో తమ కుమార్తె డెడ్ బాడీని చూసేందుకు మూడు గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బాధితురాలి తల్లిదండ్రులు కుమార్తె మరణంపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ఆగస్ట్ 9న ఆస్పత్రి అధికారులు నాకు ఫోన్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వెంటనే రావాలి అని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన వెంటనే తమ కుమార్తె ముఖాన్ని చూపించమని హాస్పిటల్ అధికారులను వేడుకున్నాం. కానీ చూపించలేదు. మూడు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అని ఆరోపిస్తున్నారు.
మూడు గంటల తర్వాత తండ్రిని లోపలికి వెళ్లి ఆమె మృతదేహాన్ని చూడటానికి అనుమతించారు. ఒక ఫొటో తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు.ఆమె శరీరంపై దుస్తులు లేవు. ఆమె కాళ్ళు 90 డిగ్రీల కోణంలో మెలి తిరిగి ఉన్నాయి. ‘కటి వలయంలో రెండు కాక్సల్ ఎముకలు(హిప్ ఎముకలు)ఉంటాయి. అవి విరిగితేనే కాళ్లు అలా ఉంటాయి’ అని బంధువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌జికార్ ఆస్పత్రికి సీబీఐ అధికారులు
మరోవైపు జూనియర్ డాక్టర్‌పై అత్యంత పాశవికంగా దాడి జరుగుతుందటే ఆస్పత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు న్యాయ స్థానాన్ని కోరారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించింది. బుధవారం ఉదయం 10గంటల్లోపు కేసుకు సంబంధించిన అన్నీ ఆధారాల్ని సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ప్రధానన్యాయ మూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ ధర్మాసనం పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం ఆర్‌జీకార్ ఆస్పత్రికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment