కోల్‌కతా : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ దుర్ఘటనలో ఆర్‌జీ కార్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో సందీష్ ఘోష్ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడం లేదని సమాచారం.
గత మూడు రోజులుగా ఆర్‌జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంపై సందీప్ ఘోష్‌ను అర్ధరాత్రి వరకు విచారించిన సీబీఐ ఈ రోజు ఆయనకు సమన్లు పంపింది. విచారణలో ఘోష్‌కు సీబీఐ పలు ప్రశ్నలు సంధించిందని, ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
👉ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారని అంత తొందరగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
👉మీరు డాక్టర్ కదా.. నేరం జరిగిన స్థలాన్ని, అందులో ఆధారాల్ని సురక్షితంగా ఉంచాలని మీరు అనుకోలేదా?
👉ఎవరి సలహా మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అందులో వాస్తవాలు ఎందుకు లేవు?
👉నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు బాగా తెలుసు. అయినప్పటికీ, విచారణ పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాన్ని ఎందుకు భద్రంగా ఉంచలేదు?
👉కొన్ని గంటల తర్వాత డాక్టర్ కుటుంబానికి ఎందుకు సమాచారం అందించారు?
👉మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించడంలో ఎందుకు జాప్యం జరిగింది?
👉ఆసుపత్రిలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి?
ఘటన జరిగిన వెంటనే ఎందుకు రాజీనామా చేశారు? దాని వెనుక కారణం ఏమిటి? సీబీఐ అధికారులు ప్రశ్నించగా..ఈ ప్రశ్నలకు మాజీ ప్రిన్సిపాల్ సందీష్ ఘోష్ సమాధానం చెప్పలేదని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment