![Supreme Court takes suo motu cognizance of Kolkata case, hearing on Tuesday](/styles/webp/s3/article_images/2024/08/18/supreme%20court.jpg.webp?itok=-8auU5rZ)
కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జీకార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో కీలక పరిణామ చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ కేసును అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
మంగళవారం ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించనుంది. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చనేది తీవ్ర ఉత్కంఠతను రేపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment