suo motu case
-
కోల్‌కతా డాక్టర్ హత్యోదంతం : సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో కీలక పరిణామ చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ కేసును అత్యున్నత న్యాయ స్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించనుంది. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చనేది తీవ్ర ఉత్కంఠతను రేపిస్తున్నాయి. -
'పుష్ప' విలన్‌పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?
ఫహాద్ ఫాజిల్ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ 'పుష్ప' విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా చివర్లో 'పార్టీ లేదా పుష్ప' అని హంగామా చేసే ఇతడు స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి హిట్ కొడుతున్నాడు. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా బుక్ చేసింది.ఇంతకీ ఏమైంది?మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం 'పింకేలీ' షూటింగ్‌ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతో పాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?)ఓవైపు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నప్పుడే మరోవైపు షూటింగ్ కూడా చేశారని, దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పలువురు పేషెంట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం మాత్రం ఆరోపణల్ని కొట్టేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని చెప్పుకొచ్చింది.అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.. నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు పెట్టింది. దీంతో ఇతడు త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్) -
వీధి కుక్కల దాడి కేసు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మూడురోజుల కిందట వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం యావత్ ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటనపై ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఈ ఉదంతంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గురువారం ఈ ఉదంతంపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఘటనపై పోలీస్ విచారణ సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
తెలివి ప్రదర్శిస్తున్నారా?.. మోర్బీ విషాదంపై కోర్టు సీరియస్
అహ్మదాబాద్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై మంగళవారం సుమోటోగా విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్‌ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మోర్బీ మున్సిపాలిటీ.. అజంతా బ్రాండ్ వాల్ క్లాక్‌లు తయారు చేసే ఒరేవా గ్రూప్‌నకు 15 ఏళ్లపాటు వేలాడే వంతెన కాంట్రాక్ట్‌ను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ‘‘పబ్లిక్ బ్రిడ్జి మరమ్మతు పనులకు టెండర్ ఎందుకు వేయలేదని, అసలెందుకు టెండర్లను ఆహ్వానించలేదు? అని ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, గుజరాత్ చీఫ్ సెక్రెటరీని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ విభాగమైన మున్సిపాలిటీ(మోర్బీ మున్సిపాలిటీ).. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్ మున్సిపాలిటీస్ చట్టానికి లోబడి ఇదంతా జరిగిందా?’’ అని గుజరాత్ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. గుజరాత్ హైకోర్టు మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆరు ప్రభుత్వ విభాగాల నుంచి వివరణ కోరింది ధర్మాసనం. అయితే.. మోర్బీ మున్సిపాలిటీ తరపు ప్రతినిధులెవరూ ఈ విచారణకు హాజరు కాలేదు. ఇక నోటీసులు అందుకున్నప్పటికీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బెంచ్. తెలివి ప్రదర్శిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంతెన పునఃప్రారంభానికి ముందు దాని ఫిట్‌నెస్‌ని ధృవీకరించడానికి ఏదైనా షరతు ఒప్పందంలో భాగమేనా?, అసలు ధృవీకరించడానికి బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే దానిపై సమాధానాలతో తిరిగి రావాలని అధికారులను గట్టిగా మందలించింది. అసలు అంత ముఖ్యమైన పనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం.. కేవలం ఒకటిన్నర పేజీలతో ఎలా పూర్తి చేశారు? అని సీజే, సీఎస్‌ను నిలదీశారు. కాంట్రాక్ట్ పత్రాల ఫైల్స్‌ను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు! -
హత్రాస్ ఘటనలో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై అత్యాచారం, ఆపై అర్థరాత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల హక్కులు పోలీసులు, స్థానిక అధికారులు హరించినట్లు తమ దృష్టికి వచ్చిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రజాగ్రహం ఉదృతమవుతున్న నేపథ్యంలో ఘటనపై వారికున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. హత్రాస్ అత్యాచార ఘటన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీనియర్లు న్యాయమూర్తులు జస్టిస్ రాజన్‌రాయ్, జస్ప్రిత్ సింగ్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. (అత్యాచారం జరగలేదు) దీనిలో భాగంగానే ఈ నెల 12లోపు తమముందు హాజరుకావాలని స్థానిక పోలీసు అధికారులతో పాటు బాలిక అంత్యక్రియలు నిర్వహించిన ప్రతిఒక్కరికీ గురువారం రాత్రి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న ఉన్నాతాధికారులకు కూడా నోటీసులు పంపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘19 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య. ఆపై యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా అర్థరాత్రి సమయంలో పోలీసులే అంతిమ సంస్కారాలు నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ సమయంలో బాలికతోపాటు కుటుంబ సభ్యులకున్న ప్రాథమిక హక్కులను హరించినట్లు మా దృష్టికి వచ్చాయి. ఈ ఘటనలో గుర్తుతెలియని బలమైన వ్యక్తుల ప్రయేయం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజనిజాలను వెల్లడిస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది. (హత్రస్ నిరసనలు: అది ఫేక్ ఫోటో!) అంతేకాకుండా మృతులకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారం వారి హక్కు అని పేర్కొన్న న్యాయస్థానం.. పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రాంజీ సింగ్ ముజీబ్ భాయి వర్సెస్ యూపీ ప్రభుత్వం, ప్రదీప్ గాంధీ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులను ప్రస్తావించింది. ఈ హక్కులు ఉల్లంఘన జరిగినట్లు తమ విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించడంతో వివాదం మరింత చెలరేగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని, అత్యాచారం కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉందని వెల్లడించారు. ఆయన ప్రకటనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేసు నుంచి దోషులను తప్పించడానికి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించడం గమనార్హం. వారంకూడా గడవకముందే రిపోర్టును మార్చడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. -
ఎమ్మార్వోపై దాడి: సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్చార్సీ
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఇసుక క్వారీలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక.. అక్కడి అక్రమాలను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి ఆమెను ఇసుకలో ఈడ్చేసిన విషయాన్ని మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. జూలై 13 లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఎమ్మెల్యే దాడి విషయంలో ఎలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు, ఏ చర్యలు తీసుకున్నారనే అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఘటనలో సాక్షి విలేకరి నవీన్‌పై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీన్ని హెచ్చార్సీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా పరిగణించారు. రేపటినుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. దీన్ని కూడా హెచ్చార్సీ గమనించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్, కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది.