ఫహాద్ ఫాజిల్ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ 'పుష్ప' విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా చివర్లో 'పార్టీ లేదా పుష్ప' అని హంగామా చేసే ఇతడు స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి హిట్ కొడుతున్నాడు. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా బుక్ చేసింది.
ఇంతకీ ఏమైంది?
మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం 'పింకేలీ' షూటింగ్‌ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎమర‍్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతో పాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
(ఇదీ చదవండి: ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?)
ఓవైపు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నప్పుడే మరోవైపు షూటింగ్ కూడా చేశారని, దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పలువురు పేషెంట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం మాత్రం ఆరోపణల్ని కొట్టేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని చెప్పుకొచ్చింది.
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.. నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు పెట్టింది. దీంతో ఇతడు త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏమవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment