Fahadh Faasil
-
‘పుష్ప-2’విలన్‌కి ఆ సమస్య.. భార్య ఏం చేసిందో తెలుసా?
మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) పుష్ప-2తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళయాళంలో హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ..ఈ చిత్రంతోనే ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా చెరగని ముద్ర వేశాడు. అందుకు తన భార్యే కారణం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఫహాద్. ఆయన ఇటీవలే ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్(ADHD (Attention Deficit Hyperactivity Disorder))) సమస్య బారినపడ్డాడు. ఇలా భార్యభర్తల్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారినడితే ఒక్కసారిగా సంసారంలో గందగోళం ఏర్పడుతుంది. అయితే ఆ పరిస్థితి ఎదురవ్వకుండా తన భార్య తీసుకున్న అనుహ్యమైన నిర్ణయం తమ దాంపత్యం మరింత బలపడేలా చేసిందంటూ భార్య నజ్రియా నజీమ్(Nazriya)పై ప్రశంసల జల్లు కురిపించాడు. మరీ అర్థాంగికి అసలైన అర్థ ఇచ్చేలా ఫహద్ భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దామా..నజ్రియా ప్రపోజ్ చేయడంతోనే..2014లో రూపొందిన మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్’ షూటింగ్లో కలుసుకున్న వీరు.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని నెలల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. అదే ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.అయితే ఈ ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది నజ్రియానే. బెంగళూరు డేస్ చిత్రం షూటింగ్‌లోనే ఓ రోజు నజ్రియానే ఫహద్ దగ్గరికి వచ్చి.. ‘నన్ను పెళ్లి చేసుకో.. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా..’ అని ప్రపోజ్ చేసింది. అది కొత్తగా అనిపించి వెంటనే అందుకు సమత్తం తెలిపాడు ఫహాద్. అలా ఈ ఇద్దరి ప్రేమ పెళ్లిపీటలెక్కింది. అయితే ఫహద్ మాత్రం తన భార్యే ముందు ప్రపోజ్ చేసిందంటూ తెగ సంబరపడిపోతాడు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారాన్ని చూసి విధి పరీక్ష పెట్టాలనుకుందో ఏమో..!. ‘ఫహద్‌కు గతేడాది ఏడీహెచ్‌డీ ఉందని నిర్ధారణ అయింది. ఓపికనే ఆయుధంగా..అయితే నజ్రియా గాబరాపడిపోలేదు. తన భర్త ఈ సమస్యలను అధిగమించేలా తగిన ప్రోత్సహాన్ని అందించింది తమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకుంది. ఈ మానసిక సమస్య తనలో ఎప్పటి నుంచో ఉండొచ్చు. కానీ ఇప్పుడిలా బయటపడింది. అది తమ జీవితం భాగమైపోతుందే తప్ప కొత్తగా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని ధీమగా చెబుతోంది నజ్రియా. "దానికి మా సంతోషాన్ని ఆవిరి చేసే అవకాశం ఇవ్వను. మరింతం అన్యోనంగా ఉండి..ఆ మానసిక పరిస్థితిని తరిమికొట్టేలా తన భర్తకు సహకరించి, ఓపిగ్గా వ్వవహరిస్తానంటోంది". నజ్రియా. అర్థాంగి అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా నిలిచింది నజ్రియా. ప్రతి బంధకంలా ఎదురయ్యే పరిస్థితులను ఆకళింపు చేసుకుని తగిన విధంగా కొద్దిపాటి మార్పులు చేసుకుంటే బంధాలు విచ్ఛిన్నం కావని చేసి చూపించింది నజ్రియా. ఏడీహెచ్‌డీ అంటే..అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడే వ్యక్తికి శ్రద్ధ చూపడం, ఉద్రేకపూరిత ప్రవర్తనలను నియంత్రించడం, వారి ఆలోచనలను ట్రాక్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది ఆందోళన , డిప్రెషన్ లేదా ఇతర మానసిక అనారోగ్య లక్షణాల మాదిరిగానే ఉంటాయి .లక్షణాలు..అనూహ్య మానసిక కల్లోలం కలిగి ఉంటారుపనిలో నిర్లక్ష్యంఅవతలి వ్యక్తి మాట్లాడితే వినాలనిపించకపోవడంసూచనలను అనుసరించకపోవడం లేదా పనులను పూర్తి చేయకపోవడంకార్యకలాపాలను నిర్వహించ లేకపోవడంపనిలో నిరంతర మానసిక శ్రమను నివారించండిఅసహనంనిద్రలేమి వంటి సమస్యలుఅతిగా మాట్లాడటంనివారణ: కేవలం మానసిక నిపుణుల కౌన్సిలింగ్, ఇంట్లో వాళ్ల సహకారంతో దీన్నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: లక్షల వేతనాన్ని వద్దునుకుని సివిల్స్‌కి ప్రిపేరయ్యింది..కట్‌చేస్తే..!) -
Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్ రిలీజ్
పుష్ప 2 .. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దెబ్బలు పడ్తయ్రో.., పీలింగ్స్.., పుష్ప పుష్ప పాటలు విడుదల చేయగా నాలుగు రోజుల క్రితం 'దమ్ముంటే పట్టుకోరా..' సాంగ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.అయితే అదేరోజు పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. పోలీసులను ఉద్దేశించే ఈ పాట విడుదల చేశారని పలువురూ భావించారు. ఈ క్రమంలో ఆ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ పాట అలాగే ఉంది. ఇప్పుడేకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మొదట షెకావత్‌కు సారీ చెప్పిన పుష్పరాజ్.. తర్వాత మాత్రం తనకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ పోలీస్ ముందే తొడ కొట్టాడు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.పుష్ప 2 విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా డిసెంబర్ 4న పుష్ప ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: గేమ్ ఛేంజర్.. ఒక్క రోజు షూటింగ్ ఖర్చు అన్ని లక్షలా? -
పుష్ప 3 కి డేట్స్ ఇవ్వనంటున్న షెకావత్..!
-
బాలీవుడ్ ఎంట్రీ
ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హిందీలో ‘జబ్ వియ్ మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే’ వంటి సినిమాలను తీసిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటించనున్నారు. కాగా ఈ సినిమాకు ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’అనే టైటిల్‌ను మేకర్స్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్.అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుందని, వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఇంతియాజ్ అలీ సన్నాహాలు చేస్తున్నారట. మలయాళ నటుడిగా ఫాహద్ ఫాజిల్ హిందీ ప్రేక్షకులకు తెలుసు. అయితే ‘పుష్ప’ ఫ్రాంచైజీ సినిమాతో ఫాహద్ క్రేజ్ బాగా పెరిగింది. మరి.. ఆయన హిందీలో చేయబోయే తొలి సినిమా ఎలా ఉండ బోతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా 'కిష్కింద కాండం' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)'పుష్ప 2'లో భన్వర్ సింగ్ షెకావత్‌గా త్వరలో రాబోతున్న ఫహాద్ ఫాజిల్.. రీసెంట్గా మలయాళంలో 'బౌగెన్‌విల్లా' అనే సినిమా చేశారు. కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మాదిరి హిట్ అయిన ఈ చిత్రాన్ని డిసెంబరు 13 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు.'బౌగెన్‌విల్లా' విషయానికొస్తే డాక్టర్ రాయిస్ థామస్ (కుంచకో బోబన్), రీతు (జ్యోతిర్మయి) భార్యాభర్తలు. వీళ్లిద్దరూ ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో రీతు గతం మర్చిపోతుంది. అంతకు కొన్నిరోజుల క్రితం రీతు.. ఓ అమ్మాయిని ఫాలో అవుతుంది. ఆమె మినిస్టర్ కూతురు. కొన్నాళ్లకు మిస్ అవుతుంది. దీంతో ఆమె కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ కోషి (ఫహాద్ ఫాజిల్) రీతు దగ్గరకు వస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)Every petal tells a story, every twist leaves you guessing. #Bougainvillea blooms this 13th December only on #SonyLIV.#Bougainvillea #BougainvilleaOnSonyLIV #SonyLIV #AmalNeerad #KunchackoBoban #Jyothirmayi #FahadFaasil #Srindaa #VeenaNandakumar #Sharafudheen pic.twitter.com/NdXQkBMWiZ— Sony LIV (@SonyLIV) November 30, 2024 -
మళ్ళీ రీమేక్ వైపు చూస్తోన్న రవితేజ..
-
సూపర్ స్టార్ రజనీ ‘వెట్టయన్’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
బన్వర్ సింగ్ షేకావత్ బర్త్ డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం 'పుష్ప-2 : ది రూల్'. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. పార్ట్-1లో తనదైన నటనతో మెప్పించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇవాళ ఫాహద్ ఫాజిల్ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. బన్వర్ సింగ్ షేకావత్.. ఐపీఎస్.. బిగ్స్క్రీన్పై మరోసారి అభిమానులను అలరించనున్నారంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. పుష్పలో ఐపీఎస్ పాత్రలో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. పార్ట్-2లోనూ ఆయన రోల్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.Team #Pushpa2TheRule wishes the stellar actor #FahadhFaasil a very Happy Birthday ❤🔥Bhanwar Singh Shekhawat IPS will be back with a bang on the big screens 💥💥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP… pic.twitter.com/L5iBu5WwUj— Pushpa (@PushpaMovie) August 8, 2024 -
పుష్పకి డేట్స్ ఇవ్వని ఫహాద్ ఫాజిల్...
-
ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్‌లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్‌లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్‌లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
రజినీకాంత్ కు నో చెప్పిన ఫాహద్
-
స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్‌లో పుష్ప విలన్.. ఓకే చెప్పేస్తారా?
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఫాహద్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలోనూ కనిపించనున్నారు. పుష్ప-2తో పాటు రజినీకాంత్ వెట్టాయన్ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఫాసిల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కూలీ మేకర్స్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టాయన్లో రజినీకాంత్, ఫాహద్ ఫాజిల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఫాహద్ ఫాజిల్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ 'వెట్టాయన్', అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్‌తో పాటు తమిళంలో మారీసన్, మలయాళంలో 'ఒడుమ్ కుతిర చదుమ్ కుతిరా', 'బౌగెన్‌విల్లా' 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాల్లో నటిస్తున్నారు. మరీ ఈ చిత్రాన్ని అంగీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. కాగా.. లోకేష్ కనగరాజ్ 'కూలీ' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. -
'పుష్ప' విలన్‌పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?
ఫహాద్ ఫాజిల్ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ 'పుష్ప' విలన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా చివర్లో 'పార్టీ లేదా పుష్ప' అని హంగామా చేసే ఇతడు స్వతహాగా మలయాళ నటుడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీసి హిట్ కొడుతున్నాడు. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఇతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా బుక్ చేసింది.ఇంతకీ ఏమైంది?మలయాళంలో నిర్మాతగా ఫహాద్ పలు సినిమాలు చేస్తున్నారు. అలా ప్రస్తుతం 'పింకేలీ' షూటింగ్‌ని అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో చిత్రీకరించారు. గురువారం రాత్రంతా షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతో పాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి సీరియస్ అయ్యారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: ఇన్ స్టా అకౌంట్ డిలీట్ చేసిన హీరో విశ్వక్ సేన్.. అదే కారణమా?)ఓవైపు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నప్పుడే మరోవైపు షూటింగ్ కూడా చేశారని, దీని వల్ల రోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పలువురు పేషెంట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మాతల సంఘం మాత్రం ఆరోపణల్ని కొట్టేసింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని చెప్పుకొచ్చింది.అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం.. నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు పెట్టింది. దీంతో ఇతడు త్వరలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్) -
'పుష్ప' విలన్ మామూలోడు కాదు.. రెమ్యునరేషన్ వింత కండీషన్స్!
హీరో మరీ కమర్షియల్ అయిపోయారు. ఎంతలా అంటే హిట్ పడటమే లేటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా తామేం తక్కువ అని కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలా అంత ఫేమ్ లేని హీరోలే కోట్లు తీసుకుంటుండగా, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు మాత్రం తన రెమ్యునరేషన్‌తో షాకిస్తున్నాడు.(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సినిమాల చూస్తే కచ్చితంగా అతడికి ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే మంచి మూవీస్ చేయడమే కాదు చాలా వేగంగా వాటిని పూర్తి చేస్తాడు. ప్రతి మూడు నాలుగు నెలలకు పహాద్ మూవీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే 'పుష్ప 2'లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారు. దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఎందుకంటే రోజుకి రూ.12 లక్షల్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేసిన ఫహాద్.. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందట. షూట్ క్యాన్సిల్స్ చేయకుండా కచ్చితంగా ముందు జాగ్రత్తగా ఉంటారని బహుశా ఫహాద్.. 'పుష్ప' నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా మనోడి ఇంత ప్లానింగ్‌తో ఉన్నాడు కాబట్టే వరస మూవీస్ చేస్తూ హిట్ కొడుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!) -
'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్‌పై చర్చ!
ఫహద్ ఫాజిల్.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్‌గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఓటీటీలో ఆవేశంబాక్సాఫీస్ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.ఫైట్ సీన్లో వార్నింగ్ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్ సీన్లో రంగ(ఫహద్ ఫాజిల్) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్కు వార్నింగ్ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్ హ్యాండ్ అంబాన్ (సాజిన్ గోపు) అతడిని వారిస్తాడు. హిందీ అక్కర్లేదా?అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్ చూశారా? -
ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ నటుడు, పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆవేశం. గతనెల 11న మలయాళంలో రిలీజైన చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో హిట్ అయిన తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం.. త్వరలోనే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.భారీ ధరకు ఓటీటీ డీల్సూపర్ హిట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లను చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మలయాళ చిత్రంగా ఆవేశం రికార్డు దక్కించుకుంది. కాగా.. ఈ సినిమాను రూ.30 కోట్లతో తెరకెక్కించారు. college, gangsters, mayhem, and a whole lot of unexpected! 🤪#AaveshamOnPrime, watch nowhttps://t.co/6L4qK9PLeR pic.twitter.com/rAIbvGXE9S— prime video IN (@PrimeVideoIN) May 8, 2024 -
కట్టప్పతో స్టార్ హీరో.. ఈ మధ్యే రూ.150 కోట్ల హిట్ మూవీతో..!
నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బోలెడన్ని సినిమాలు చేశాడు. మొదట్లో విలన్‌గా, తర్వాత హీరోగా.. అనంతరం సహాయక నటుడిగా మెప్పించాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో క్లిక్కయ్యాడు. ఈ మధ్య ఇతడు సింగపూర్ సెలూన్ మూవీలో మెరిశాడు. ఫోటో వైరల్తాజాగా ఈ నటుడు యుక్తవయసులో ఉన్నప్పటి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో సత్యరాజ్ ఓ బుడ్డోడితోపాటు కెమెరావైపు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ బుడ్డోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. ఇతడి తండ్రి కూడా నటుడే! ఆయనతో కలిసి సత్యరాజ్ రెండు సినిమాలు కూడా చేశాడు. ఇంతకీ ఈ చిన్నోడెవరో గుర్తుపట్టారా? తెలుగులో విపరీతమైన పాపులారిటీఅతడే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఇతడు ఈ మధ్యే ఆవేశం అనే సినిమాతో మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. 1980లో అతడు సత్యరాజ్‌తో దిగిన ఫోటోను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముబి ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. Sathyaraj and Fahadh Faasil in the 1980s. pic.twitter.com/H9DidxzScV— MUBI India (@mubiindia) May 7, 2024చదవండి: నాన్నతో కోపంలో అన్నా.. అదే నిజమైంది: బన్నీ -
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
ఇండియన్ సినిమాలో 'పుష్ప: ది రైజ్' చెరిగిపోని ముద్ర వేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2021లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. పుష్పలో SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు ముందే మలయాళ ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ యాక్టర్‌గా ఉన్నారు. పుష్పతో ఫహాద్ ఫాజిల్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో చేరుకుంది. అయితే ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమి లేదని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గానే చెప్పేశాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా నటుడిగా మారారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది.'పుష్ప సినిమా నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఇదే విషయం సుకుమార్ సార్‌కు కూడా చెప్పాను. ఇందులో నేను దాచడం లేదు. అబద్దం చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. అయితే, మలయాళం భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాలో సంతోషాన్ని నింపింది. నేను ఏ ప్రాంతాన్ని, ఎవరినీ అగౌరపరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు.' అని ఆయన అన్నారు. ఏదేమైనా పాన్ ఇండియా రేంజ్లో తనను పుష్ప చేర్చలేదని ఫహాద్‌ఫాజిల్ పేర్కొన్నాడు. -
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్‌లు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‌గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10అమెజాన్ ప్రైమ్ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09 హాట్‌స్టార్ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08జీ 58 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10జియో సినిమామర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10సోనీ లివ్అన్ దేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లేద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10సన్ నెక్స్ట్ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10ఆపిల్ ప్లస్ టీవీడార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?) -
ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ 'పుష్ప' విలన్‌గానే తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌తో హిట్స్ కొట్టే ఇతడు.. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దీన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు నేరుగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఇంతకీ ఆ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)మలయాళంలో ఫహాద్ ఫాజిల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఈ మధ్య 'ఆవేశం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చాడు. ఇందులో గ్యాంగస్టర్ రంగా అనే పాత్రలో అదరగొట్టేశాడు. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారేమో అని కొందరు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు.ఫహాద్ 'ఆవేశం' సినిమా థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజ్ కాగా.. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. మే 9 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతుందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని సమాచారం. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఇదే) -
ఆ మ్యూజిక్ డైరెక్టర్‌పై సమంత ప్రశంసలు
ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఈ తరం హీరోయిన్లకు బాగా తెలుసు. ఇందుకు నటి సమంత అతీతం కాదు. ఈమె నటించిన చివరి చిత్రం ఖుషీ విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఆ తరువాత మరో చిత్రంలో నటించలేదు. అలాగని తెరమరుగు కాలేదు. తన గ్లామరస్ ఫొటోలతో, ఫిట్నెస్ ఫొటోలతోనో, ఇతరుల గురించి కామెంట్స్ చేయడంతోనో తరచూ వార్తల్లో ఉంటారు. మరో పక్క ఈమె నటించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో హల్చల్ చేస్తుంటాయి. ఒక పక్క మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూనే ప్రేక్షకులకు దూరం కాకుండా జాగ్రత్త వహిస్తున్న జాన సమంత. కాగా ఈమె నటించిన ది ఫ్యామిలీ స్టోరీ– 2 వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. కాగా సమంత ఓ మలయాళ సంగీత దర్శకుడిని మేధావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇటీవల విజయాలతో కళ కళలాడుతోంది. తక్కువ బడ్జెట్‌తో చిత్రాలు చేసి భారీ లాభాలను చవి సూస్తున్నారు. అలా ఇటీవల బ్రహ్మయుగం,ప్రేమలు, మంజుమల్ బాయ్స్, ది గోట్ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ కోవలోకి ఆవేశం చిత్రం చేరింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహత్ ఫాజిల్ తాజాగా కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం ఆవేశం. ఈనెల 11న విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్టు వసూలు చేసిందని సమాచారం. కాగా ఈ చిత్రానికి నటి సమంత తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందులో ముఖ్యంగా ఆ చిత్ర సంగీత దర్వకుడు సుషిన్ శ్యామ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. -
'పుష్ప' విలన్ క్రేజీ మూవీ.. 'ఆవేశం'తో హిట్ కొట్టాడు
సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్ గా నిలిచింది మాత్రం 'టిల్లు స్క్వేర్'నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరసపెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజైతే చూసి ఆదరించడంతో పాట కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. 'ఆవేశం' అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. తాజాగా మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'ఆవేశం' కథ విషయానికొస్తే.. బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరుమోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫహాద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రంపై ఆల్రెడీ తెలుగు నిర్మాతల దృష్టి పడిందట. 'పుష్ప'తో ఫహాద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి త్వరలో 'ఆవేశం' రిలీజ్ పక్కా ఉంటుందట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
వడివేలుతో ఫహద్ ఫాసిల్ దోస్తీ.. ఎందుకో తెలుసా
ప్రముఖ హాస్య నటుడు వడివేలు, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఇంతకుముందు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన 'మామన్నన్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆ చిత్రంలో వడివేలు పాజిటివ్ పాత్రలో, ఫాహత్ ఫాజిల్ నెగిటివ పాత్రలోనూ నటించి మెప్పించారు. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మించనుండడం విశేషం. ఈయన ఇంతకుముందు తమిళం, తెలుగు తదితర భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా వడివేలు, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్లో తన 98వ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి వి.కృష్ణమూర్తి కథ, దర్శకత్వం బా ధ్యతలను వి.కృష్ణమూర్తి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేశారు. కాగా ఇది రోడ్డు పైన నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, కలై సెల్వన్ శివాజీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ సంస్థలో ఆర్బీ చౌదరి ఇంతకుముందు విజయ్ హీరోగా జిల్లా వంటి పలు చిత్రాలను నిర్మించారు. కాగా ఈయన తన 100వ చిత్రాన్ని నటుడు విజయ్ కథానాయకుడిగా నిర్మించనున్నట్లు చాలా కాలం క్రితమే వెల్లడించడం గమనార్హం. -
థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పుడెప్పుడో జూన్ చివర్లో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా పక్కనబెట్టేశారు. ఆగస్టులో ఓటీటీలో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఎందుకో ఇదీ వాయిదా పడింది. దాదాపు నాలుగు నెలల తర్వాత అంటే ఇప్పుడు తాజాగా ఓటీటీలో ఈ సినిమాని తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్.. పలు భాషల్లో చిన్న సినిమాలు కూడా తీస్తోంది. అలా 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ హీరోగా 'ధూమమ్' అనే సినిమా తీసింది. దీన్ని దక్షిణాదిలో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో తెలుగు రిలీజ్ వాయిదా వేశారు. అదే టైంలో కన్నడ, మలయాళ భాషల్లో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు వెర్షన్ విడుదలని పూర్తిగా పక్కనబెట్టేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) ఇన్నాళ్లకు ఓటీటీలోకి జూన్ 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాని రెండు వారాల్లోనే అంటే ఆగస్టు 4నే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో గానీ ఓటీటీ స్ట్రీమింగ్ కూడా వాయిదా వేశారు. అలా ఈ మూవీ గురించి అందరూ మర్చిపోయారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఆపిల్ టీవీ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'ధూమమ్' చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. 'ధూమమ్' కథేంటి? ఓ సిగరెట్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసే అవినాష్ (ఫహాద్ ఫాజిల్).. ఓ అపరిచిత వ్యక్తి కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అవినాష్‌ని అతడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. తన మాట వినకపోతే అతడి భార్య దియా (అపర్ణ బాలమురళి) శరీరంలో ఫిక్స్ చేసిన మైక్రో బాంబ్‌ని పేల్చేస్తానని బెదిరిస్తాడు. ఇంతకీ ఆ అపరిచతుడు ఎవరు? ఎందుకు బెదిరిస్తున్నాడు? చివరకు ఏమైందనేది 'ధూమమ్' స్టోరీ. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) -
కొత్త లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతైనా తగ్గేదేలే!
ప్రముఖ మలయాళ నటుడు 'ఫహద్ ఫాసిల్' పేరు తెలియకపోయినా.. 'పార్టీ లేదా పుష్పా' అనే డైలాగ్ వింటే మాత్రం వెంటనే ఆయనెవరో గుర్తొచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిన నటుడు ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు. దీని ధర ఎంత? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు 'ల్యాండ్ రోవర్' (Land Rover) కంపెనీకి చెందిన 'డిఫెండర్' అని తెలుస్తోంది. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు అర్జున్ కపూర్, ప్రకాష్‌రాజ్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సునీల్ శెట్టి వంటి చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. గోండ్వానా స్టోన్ పెయింట్ స్కీమ్ కలిగిన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో డిఫెండర్ 130, డిఫెండర్ 110 & డిఫెండర్ 90 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫహద్ ఫాసిల్ డిఫెండర్ 90 కొనుగోలు చేసినట్లు చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా మూడు డోర్లు కలిగిన వేరియంట్. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 వేరియంట్ 5.0 లీటర్ వి8 ఇంజన్ కలిగి 296 హార్స్ పవర్ & 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతమైన ఈ కారు వాహన వినియోగదారులకు ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫహద్ ఫాసిల్ లంబోర్ఘిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. -
నటుడిగా పనికిరాడన్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!
ఓ నటుడు. తండ్రి డైరెక్టర్ కావడంతో ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. 19 ఏళ్లకే హీరోగా తొలి సినిమా. బ్యాడ్ లక్. మూవీ ఫ్లాప్ అయింది. దీనికి తోడు అదనంగా అవమానాలు, యాక్టింగ్ రాదని ఘోరమైన విమర్శలు. దెబ్బకు భయపడిపోయాడు. వల్ల కాదు బాబోయ్ అని దేశం వదిలేసిపోయాడు. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ. సినిమా హిట్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అతడే ఫహాద్ ఫాజిల్. మంగళవారం అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ. హీరోలా ఉండడు సినిమా హీరో అంటే ఫిట్‌గా ఉండాలి, అందంగా కనిపించాలి, అమ్మాయిలని ఆకట్టుకోవాలి.. ఇలాంటి కొలమానాలు బోలెడు. వాటన్నింటికీ ఫహాద్ ఫాజిల్ చాలా దూరం. చూడటానికి బక్కగా ఉంటాడు. బట్టతలతోనే కనిపిస్తాడు. ఓ సాదాసీదా మనిషిలా ఉంటాడు. ఇవన్నీ కాదు ఎవరికోసమే తన వ్యక్తిత్వాన్ని అస్సలు మార్చుకోడు. అందుకే ప్రేక్షకులు ఇతడిని అభిమానిస్తున్నారు, సినిమాల్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) పనికిరాడన్నారు తండ్రి ఫాజిల్ దర్శకత్వంలో 19 ఏళ్లకే 'కైయెతుమ్ దూరత్' సినిమాతో ఫహాద్ హీరో అయిపోయాడు. కానీ ఇది ఫెయిలవడంతో ఫహాద్‌ని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. నటుడిగా అస్సలు పనికిరాడని అవమానించారు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. పై చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడు. ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. తనపై విమర్శలకు నటనతోనే సమాధానమిచ్చాడు. హీరోయిన్‌తో పెళ్లి రీఎంట్రీలో నటుడిగా ఫహాద్ ఫాజిల్ సక్సెస్‌లు అందుకున్నాడు. 'బెంగళూరు డేస్'లో తనకు భార్యగా నటించిన నజ్రియా నజీమ్‌ని చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. లవ్ లెటర్లో ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నజ్రియా.. కొన్నాళ్లు చుట్టూ తిప్పించుకుని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకే అంటే 2014 ఆగస్టు 21న వీళ్ల పెళ్లి జరిగిపోయింది. (ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?) ఓటీటీల్లోకి ధైర్యంగా లాక్డౌన్ టైంలో దాదాపు అందరూ హీరోలు షూటింగ్స్ చేయడానికే భయపడితే.. ఫహాద్ ఫాజిల్ మాత్రం వరసపెట్టి మూవీస్ చేశాడు. వాటిని ఓటీటీల్లో ధైర్యంగా రిలీజ్ చేశాడు. అలా చాలామందికి ఉపాధి కల్పించాడు. అదే టైంలో తెలుగు డబ్బింగ్ కూడా ఉండేసరికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. 'పుష్ప'లో షెఖావత్, 'విక్రమ్'లో అమర్‌గా సూపర్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు. కళ్లు చాలు సాధారణంగా హీరోలంటే ఫైట్స్ చేయాలి, గడ్డం పెంచాలని అందరూ అంటుంటారు. ఫహాద్ ఫాజిల్ మాత్రం జస్ట్ కళ్లతోనే అద్భుతమైన యాక్టింగ్ చేసేస్తుంటాడు. అతడి సినిమాలు చూసే ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. అలానే హీరో అనే కాకుండా విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ లాంటి రోల్స్ చేయడానికి అస్సలు మొహమాటపడడు. ఇకపోతే ఫహాద్ ఫాజిల్ మరెన్నో మంచి సినిమాలు చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) -
ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈసారి తలైవా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి అలా వదిలేస్తే.. రజినీ తర్వాత మూవీ కోసం భారీ సెటప్ సిద్ధమవుతోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్లానింగ్ అదీ చూస్తుంటే పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్టార్స్ ఎవరెవరు? రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఒకే మూసలో సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. 'జైలర్' మీద పెద్దగా అంచనాల్లేవు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. అయితే ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) నిజమైతే మాత్రం! ప్రస్తుతానికి రూమర్ అయినప్పటికీ.. దాదాపు ఇదే నిజం కావొచ్చని తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలో ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరో రెండు వారాల్లో ప్రకటన రానుందని సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీ పోలీస్ గా కనిపిస్తారట. అందులో భాగంగా తాజాగా హెయిర్ కట్ చేయించుకుని లుక్ మార్చేశారు. నానికి లక్కీ ఛాన్స్? ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమైతే మాత్రం తెలుగు హీరో నాని లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఎందుకంటే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే నాని.. పాన్ ఇండియా ఆశలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. మరి ఈ న్యూస్‌పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్ బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనుందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ను ఫహాద్ అభిమానులతో పంచుకున్నారు. (ఇది చదవండి: 'మన జీవితంలో అప్పుడే మధురమైన క్షణాలు'.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!) ఫహాద్ మాట్లాడుతూ..' పుష్ప-2 లో నా పాత్ర పార్ట్-1 కంటే కాస్తా ఎక్కువగానే ఉంటుంది. హీరోకు, నాకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. పార్ట్ -2లో మొత్తం ఎక్కువగా ఫైట్స్ ఉండనున్నాయి.' అని అన్నారు. ఇది విన్న బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీక్వెల్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. కాగా..పుష్ప-2లో టాలీవుడ్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప-2లో కూడా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బన్నీ సరసన నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్! ) -
సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?
ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది? 'మామన్నన్' కథేంటి? కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) టాక్ ఏంటి? మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్‌తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలెక్షన్స్ ఎంత? గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
పుష్ప 2పై అదిరిపోయే అప్డేట్.. ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదట!
‘పోలీసాఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అయ్యారు.. ఈసారి ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదు’ అంటూ ‘పుష్ప–2 ది రూల్’ యూనిట్ పేర్కొంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’ తొలి భాగం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్‌గా నిలిచింది. (చదవండి: మరోసారి విలన్‌గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే.. ) ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప–2 ది రూల్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా ‘పుష్ప: ది రైజ్’లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ప్రేక్షకుల్ని అలరించింది. ‘ పుష్ప–2 ది రూల్’లోనూ ఆయన పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఫాహద్ ఫాజిల్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. ఆ షెడ్యూల్ పూర్తవడంతో సుకుమార్, ఫాహద్ ఫాజిల్ సెట్లో ఉన్న వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. A key schedule of #Pushpa2TheRule completed with 'Bhanwar Singh Shekhawat' aka #FahadhFaasil 💥💥 This time he will return with vengeance ❤️🔥🔥 Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/xDOa82Ctc4 — Pushpa (@PushpaMovie) May 18, 2023 -
వీడేం హీరోరా బాబూ.. ఇలా ఉన్నాడు!
మాలీవుడ్‌లో బడా స్టార్లు ఎవరంటే.. టక్కున మమ్మూటీ, మోహన్‌లాల్‌ల పేర్లు, ఇతర భాషల్లోనూ వాళ్ల పోస్టర్లే ఎక్కువ కనిపిస్తాయి.మరి వీళ్లిద్దరి తర్వాత ఎవరంటే.. ఫహద్ ఫాజిల్ అనే పేరు మలయాళ సినిమాకు కొత్త పోస్టర్ ముఖంగా మారిపోయింది ఇప్పుడు. ఆ ముఖమే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది కూడా. సోకాల్డ్ హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ కనిపించవు. బక్కపల్చని శరీర సౌష్టవం, బట్టతల, ఐదున్నర అడుగుల ఎత్తు, గడ్డం, పొడి పొడి మాటలు. కానీ, నటనకొచ్చేసరికి విశ్వరూపం ప్రదర్శిస్తుంటాడు. ఏ విషయంలోనూ హెచ్చుతగ్గులు లేకుండా కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఆయన నటన. అందుకేనేమో ఆ క్రేజ్‌ను వాడుకునేందుకు అన్ని భాషలూ ఇప్పుడు అతన్ని అక్కున చేర్చుకుంటున్నాయి. నటన కొందరి బ్లడ్‌లో ఉంటుంది. మరికొందరికి శిక్షణ తీసుకుంటేనే అబ్బుతుంది. కానీ, ఈయనకి మాత్రం కంటిచూపులోనే ఉంది. ఈ మాట అంది ఎవరో కాదు.. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్. విక్రమ్‌లో తన కో-స్టార్ ఫహద్ ఫాజిల్‌ను ఆకాశానికి ఎత్తేశాడు కమల్. అంతపెద్ద సీనియర్ నటుడికే కాదు.. ఫహద్‌పై ఇండస్ట్రీలో, బయటా చాలామందికి ఉన్న అభిప్రాయం ఇదే. అందుకే ఫహద్‌ను విలక్షణ నటుడు అనడం కంటే అసాధారణమైన నటుడు అనడం కరెక్ట్. వీడేం హీరోరా బాబూ.. ఫహద్ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి ఫాజిల్ పెద్ద డైరెక్టర్ కావడంతో హీరో అయ్యేందుకు ఉవ్విళ్లూరాడు. డిగ్రీ చదివే టైంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకున్నాడు ఫహద్. 2002లో తొలి చిత్రం ‘కైయేథుమ్ దురత్’ రిలీజ్ అయ్యింది. తండ్రి డైరెక్షన్, లవ్ స్టోరీ, పైగా మమ్మూట్టి గెస్ట్ రోల్.. ఇంకేం సినిమాపై హైప్ పెరిగిపోయింది. కానీ, ఫలితం మాత్రం భారీ డిజాస్టర్. అందునా ఫహద్ ఫాజిల్ వల్లే సినిమా పోయిందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంట్రిలాక్విజం బొమ్మలా ఉన్నాడని.. ఏ కోణంలోనూ అతను హీరోగా పనికి రాడంటూ క్రిటిక్స్ సైతం రివ్యూలతో ఏకీపడేశారు. నిజాయితీగా ఒప్పుకుని.. తన తండ్రి ఫాజిల్ తప్పేం లేదని, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి ఆ అంచనాలు తానే అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు ఫహద్. ఆపై యాక్టింగ్‌ను వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు ఏంఎ ఫిలాసఫీ చేశాడు. ఘోరమైన అవమానం-విమర్శల తర్వాత యూఎస్ వెళ్లిపోయిన ఫహద్.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. తండ్రి ప్రొత్సాహంతో ఈసారి దర్శకుడు రంజిత్ డైరెక్షన్లో ‘కేరళ కేఫ్’(2009)తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి నటుడిగా ఫహద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇతనొక ప్రయోగశాల చప్పా ఖురిష్, డైమండ్ నెక్లెస్, 22 ఫిమేల్ కొట్టాయం, అన్నయుమ్ రసూలుమ్, బెంగళూరు డేస్, మహేషింటే ప్రతీకారం.. ఇలా వరుస హిట్లు నటుడిగా ఫహద్‌ను ఎస్టాబ్లిష్ చేశాయి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోయింది ఫహద్ సినీ కెరీర్. ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి మాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోల జాబితాలోకి చేరిపోయాడు ఫహద్. ‘కుంబళంగి నైట్స్’, ‘టేకాఫ్’, ‘ఎన్జన్ ప్రకాశన్’, ‘వారాతన్’ లాంటి కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు..‘ట్రాన్స్’, ‘సీయూసూన్’, ‘జోజి’ ‘మాలిక్’, ‘మలయన్కుంజు’లాంటి ప్రయోగాలు చేసి మాలీవుడ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. నేషనల్ అవార్డు ప్రత్యేకించి మలయాళ సినీ పరిశ్రమకు ప్రయోగాలకు, కొత్త జానర్లను, కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడిగా ఫహద్ పేరు ముద్రపడిపోయింది. ఇక తొండిముథలం ద్రిక్సాక్షియుం(2017) ఏకంగా నేషనల్ అవార్డును(బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్) తెచ్చిపెట్టగా.. స్టేట్, సౌత్ అవార్డులను సైతం అందుకున్నాడు. కరోనా తర్వాత వరుస ఓటీటీ రిలీజ్‌లతో సౌత్ ఆడియొన్స్‌కు బాగా దగ్గరయ్యాడు ఫహద్. నిర్మాతగానూ సూపర్ హిట్లు అందుకుంటున్నాడు ఫహద్. ఇక తమిళంలో శివకార్తీకేయన్ ‘వెళ్లైక్కారన్’(తెలుగులో జాగో)తో డెబ్యూ ఇచ్చిన ఫహద్.. ఆపై సూపర్ డీలక్స్‌లో సమంత భర్త పాత్రలో అలరించాడు. తెలుగులో పుష్ప భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ‘పార్టీ లేదా పుష్ప?’ అంటూ మెప్పించాడు. ఇక ఈ ఏడాది ఓటీటీ సినిమాల ద్వారా తన హవా కొనసాగించిన ఫహద్ పాజిల్.. ఈ ఏడాది రిలీజ్ అయిన కమల్ హాసన్ ‘విక్రమ్’లో ఏజెంట్ అమర్ రోల్‌తో మరింత మంచి పేరు సంపాదించుకున్నారు. :::ఇవాళ ఫహద్ ఫాజిల్ 40వ పుట్టినరోజు సందర్భంగా.. -
ఆహాలో ఫహద్ ఫాజిల్ కొత్త మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఫహద్ ఫాజిల్.. మలయాళ సినిమాలు ఇష్టపడే వారికి ఈ పేరు బాగా సుపరిచితమే. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడీ హీరో. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మాలిక్. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో రిలీజై విశేషాదరణ పొందింది మాలిక్. ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మాలిక్‌ను తెలుగులో అందుబాటులోకి తీసుకువస్తోంది.ఇప్పటికే సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 12 నుంచి ఆహాలో అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో నిమిష సజయన్, వినయ్ ఫోర్ట్, జలజ, జోజు జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రన్స్, సలీమ్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. సజు వర్గీస్ సినిమాటోగ్రఫీ అందించాడు. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. For their rights, for their lives, here's MALIK✊🏻#MalikOnAHA premieres August 12 ▶️ https://t.co/ZROeVwoXvP#FahadhFaasil @NimishaSajayan @C_I_N_E_M_A_A @ActorIndrans #AntoJosephFilmCompany pic.twitter.com/kcdGTCCgAQ — ahavideoin (@ahavideoIN) July 28, 2022 చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్ భారీ బడ్జెట్, అత్యంత ఘోరమైన ఫ్లాప్.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు -
పుష్ప-2 లో ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ పై సుమంత్ రియాక్షన్ చూస్తే..
-
బాక్సాఫీస్‌పై ‘విక్రమ్’ దాడి.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’తో వెండితెరపై సందడి చేశాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘ఖైదీ’,‘మాస్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.యాక్షన్ సీన్స్‌లో కమల్ హాసన్ చూపించిన యాటీట్యూడ్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 67 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్ సీన్స్ చేశాడు. కమల్ని ఫ్యాన్స్ తెరపై ఎలా చూడాలని కోరుకున్నారో అలా చూపించాడు. అందుకే ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.45 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఒక్క తమిళనాడులో రూ.20 కోట్లు వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో రూ.4.02 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.3.70, కేరళలో రూ.5.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.11.50 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వారంతంలో ఈ చిత్రం ఈజీగా రూ.100 కోట్ల క్లబ్ చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. చదవండి: Vikram Telugu Movie Review: ‘విక్రమ్’ మూవీ రివ్యూ -
‘విక్రమ్’ మూవీ రివ్యూ
టైటిల్: విక్రమ్: హిట్ లిస్ట్ నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు దర్శకత్వం: లోకేష్ కనకరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాణ సంస్థ : రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ విడుదల తేది: జూన్ 3, 2022 యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 3న 'విక్రమ్'గా సందడి చేసేందుకు వచ్చేశారు కమల్ హాసన్. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్లో అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మరి ఇన్ని అంచనాల మధ్య శుక్రవారం(జూన్ 3) విడుదలైన 'విక్రమ్'ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. విక్రమ్ కథేంటంటే... మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠా వరుస హత్యలకు పాల్పడుతుంది. అందులో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసు అధికారి ప్రభంజన్, అతని తండ్రి కర్ణణ్ (కమల్ హాసన్) కూడా ఉంటారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు స్పై ఏజెంట్ అమర్(ఫాహద్ ఫాజిల్). అతని టీమ్‌తో కలిసి ఈ కేసును ఛేదించే క్రమంలో ప్రభంజన్ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం(విజయ్ సేతుపతి)ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అందరూ అనుకున్నట్లుగా కర్ణణ్ చనిపోలేదనే విషయం కూడా తెలుస్తుంది. మరి కర్ణణ్ చనిపోయినట్లు ఎందుకు నటించాడు? అతని నేపథ్యం ఏంటి? అతనికి ఏజెంట్ విక్రమ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కర్ణణ్ వేసిన ప్లాన్ ఏంటి? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరకు అమర్ వారికి ఏవిధంగా సహాయం చేశాడు? ఈ కథలోకి సూర్య ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనేది తెలియాలంటే విక్రమ్ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టైలిష్ యాక్షన్‌కి పెట్టింది పేరు లోకేష్ కనకరాజన్. అలాంటి దర్శకుడికి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి దిగ్గజ నటులు దొరికితే.. ఎలా ఉంటుంది? యాక్షన్ సీన్స్‌ని వేరే లెవల్లో చూపించొచ్చు. విక్రమ్‌లో కనకరాజన్ అదే చేశాడు. ఫుల్ యాక్షన్స్ సీన్స్‌తో దుమ్ము దులిపేశాడు. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఎలివేషన్స్ ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా చుట్టూ విక్రమ్ కథ తిరుగుతుంది. భారీ స్థాయిలో డ్రగ్స్‌ని పట్టుకోవడం, దాని ఆచూకీ కోసం సంతానం ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో వరుస హత్యలు.. స్పై ఏజెంట్ అమర్ రంగంలోకి దిగడం.. కర్ణణ్ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌లో సాదా సీదాగా అనిపించిన సీన్లను సెకండాఫ్‌కు ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో అయితే యాక్షన్ డోస్ భారీగా పెంచేశాడు. 1987 నాటి ‘విక్రమ్’ సినిమాకు, అలాగే లోకేష్ కనకరాజన్ గత చిత్రాలు ‘ఖైదీ’, ‘మాస్టర్’కి ఈ చిత్రాన్ని లింక్ చేసిన విధానం బాగుంది. ఇక క్లైమాక్స్‌లో అయితే కమల్ హాసన్ చేసే యాక్షన్ సీన్స్.. రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. అంతేకాదు పార్ట్ 2 ఉంటుందని సూర్య పాత్రతో చెప్పించాడు దర్శకుడు. ఎప్పుడెప్పుడు కమల్, సూర్యలను తెరపై పూర్తి స్థాయిలో చూస్తామా అని వెయిట్ చేసేలా చేశాడు. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ పాత్రలో లోక నాయకుడు కమల్ హాసన్ ఒదిగిపోయాడు. 67 ఏళ్ల వయసులోనూ ఇలాంటి పాత్రలో నటించడం ఒక్క కమల్‌కే సాధ్యమయింది. యాక్షన్ సీన్స్‌లో కమల్ చూపించే యాటిట్యూడ్ అదిరిపోయింది. అలాగే ఫస్టాఫ్‌లో తాగుబోతుగా, డ్రగ్స్ బానిసగా తనదైన నటనతో ఆదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో కమల్ చేసే ఫైట్స్ సీన్ సినిమాకే హైలైట్. ఇక స్పై ఏజెంట్ అమర్‌గా ఫహద్ ఫాజిల్ మంచి నటనను కనబరిచాడు. యాక్షన్ సీన్స్‌లో దుమ్ము దులిపేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. డ్రగ్స్ మాఫీయా లీడర్ సంతానం పాత్రలో విజయ్ సేతుపతి పరకాయ ప్రవేశం చేశాడు. అతని గెటప్ కానీ, యాక్టింగ్ కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. తెరపై ఉన్నది కొద్ది క్షణాలే అయినా.. తనదైన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాదు పార్ట్2పై ఆసక్తిని కూడా పెంచేశాడు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
అదరగొట్టిన కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్..
Vikram Trailer: Kamal Haasan Vijay Sethupathi Fahadh Faasil Gripping Action: లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్డేట్ ప్రకారం ఆదివారం సాయంత్రం 'విక్రమ్' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండుగగా ఉంది. ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడం, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇదేకాకుండా ఈ సినిమాలో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే సినీ ప్రియులకు మంచి విందు దొరికినట్టే. చదవండి: కమల్ హాసన్ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్ హీరోగా రాజమౌళి చిత్రం..? -
ఆహాలో మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కరోనా సమయంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్‌కు వెళ్లాలంటనే జంకిన సినీప్రేక్షకుడు ఎంచక్కా ఉన్నచోటునే సినిమా చూసే అవకాశం కల్పించడంతో ఓటీటీకి జై కొట్టాడు. అలా దేశంలో పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వాటికి గట్టి పోటీనిస్తూ తెలుగులో ఆహా ఓటీటీ లాంచ్ చేశారు. దీనికి సినీప్రియుల నుంచి విశేషాదరణ లభించింది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఆహా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ శుక్రవారం మరో మలయాళ మూవీని ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఫహద్ ఫాజిల్ నటించిన తొందిముతలమ్ దృక్షక్షియుం అనే మూవీని దొంగాట పేరుతో మే 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్వీట్ చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ సినిమాను ఈ ఫ్రైడే చూసేయండని పేర్కొంది. Friday release alert!! #FahadhFaasil's National Award winning film Thondimuthalum Driksakshiyum as #DongataOnAHA in Telugu premieres May 6. Witness the rich performance of the thief 🙌#DileeshPothan #SandeepSenan #SurajVenjaramoodu #NimishaSajayan pic.twitter.com/uNKJebaA0V — ahavideoin (@ahavideoIN) April 30, 2022 చదవండి: అనిల్ అదృష్టం, బిగ్‌బాస్ నుంచి హమీదా ఎలిమినేట్! -
ఫహద్ ఫాజిల్, నజ్రియాల ట్రాన్స్ తమిళ్ ట్రైలర్ రిలీజ్
సబ్బుల యాడ్ తరహాలో కొందరు మతాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత హెచ్.రాజా అన్నారు. ఫహద్ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా జంటగా నటించిన మళయాళ చిత్రం ట్రాన్స్. దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ తెరకెక్కించారు. అక్కడ మంచి విజయాన్ని సాధించిన దీన్ని ధర్మ విజువల్ క్రియేషన్స్ సంస్థ అధినేత తమిళంలో నిలై మరందవన్ అనే పేరుతో అనువదిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఇందులో బీజేపీ నాయకుడు హెచ్.రాజా, కల్యాణరామన్, అశ్వథ్థామన్, హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ తదితరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్.రాజా మాట్లాడుతూ తమిళ ప్రజలను ఒక స్థాయికి తీసుకురావడానికే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు భావించవచ్చునన్నారు. వివేకానంద చెప్పినట్లుగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూనే ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్ ఫాజిల్!
మెగా పవర్ స్టార్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ పాన్ ఇండియా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పై రానుంది. ఈ మూవీ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఖారరైన సంగతి తెలిసిందే. అయితే పాపులర్ క్యాస్ట్ అండ్ క్రూతో ఈ మూవీ రూపొందిస్తున్నాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ క్రమంలో కొంతమంది స్టార్ నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో విలన్ కోసం మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్‌ను శంకర్ టీం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ సినిమాలో హీరోకు బలమైన పోటీగా ప్రతినాయకుడు పాత్ర ఉంటుంది. ఈ మూవీలో కూడా బలమైన క్యారెక్టరైషన్తో విలన్ పాత్ర ఉండబోతుందట. అందుకోసమే చరణ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతి నాయకుడిగా ఫహద్ అయితే బాగుంటుందని శంకర్ భావించారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అయితే ఫహద్ ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ మూవీతో పాటు మలయాళం, తమిళంలో పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంకర్ మూవీ ఆఫర్ రావడంతో ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అతడు ధైర్యం చేయడం లేదట. అందుకే కాస్తా టైం అడిగి తన డేటు సర్దుబాటు చేసుకుని చెప్తానని చెప్పినట్లు సమాచారం. అదంతా ఒకే అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువనుందట. కాగా ఇటీవల ఫహాద్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ పుష్పలోని ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇందులో ‘చెడు చూడటానికి ఎప్పుడూ ప్రమాదకరంగా కనిపించదు. హ్యాపీబర్త్‌డే ఫహద్ ఫాజిల్’ అని కేవలం ఫహద్ కన్ను చిత్రాన్ని మాత్రమే పోస్టర్‌పై ఉంచారు. -
కంటిచూపుతోనే నటించడం ఈయన స్పెషాలిటీ
Fahadh Faasil Birthday Special: నటన కొందరి రక్తంలో ఉంటుంది. మరికొందరికి అలవాటు చేసుకుంటే అబ్బుతుంది. ఇంకొందరికి శిక్షణ తప్పనిసరి. కానీ, ఈయనకి మాత్రం కంటిచూపులోనే ఉంటుందట. ఈ మాట అంది ఎవరో కాదు.. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్. విక్రమ్‌లో తనతో పాటు నటిస్తున్న ఫహద్ ఫాజిల్‌ను ఆకాశానికి ఎత్తేశాడు కమల్. ఆ మాటకొస్తే.. ఫహద్‌పై చాలామందికి ఉన్న అభిప్రాయం ఇదే. బట్టతల, ఐదున్నర అడుగులు, గడ్డం, బక్కపల్చని రూపం, పొడి పొడిగా మాట్లాడే ఫహద్.. నటనకొచ్చేసరికి విశ్వరూపం చూపిస్తుంటాడు. అందుకేనేమో సౌత్ నార్త్ ఆడియొన్స్ మొత్తం అతన్ని ఇష్టపడుతుంటే.. ఆ క్రేజ్‌ను వాడుకునేందుకు అన్ని భాషలూ అతన్ని అక్కున చేర్చుకుంటున్నాయి. నటుడు ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు ప్రత్యేకం.. ఇవాళ ఫహద్ 39 పుట్టినరోజు.. 1982 ఆగష్టు 8న అలపుజ్జాలో జన్మించాడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్. పెద్ద దిక్కులేని కుటుంబానికి షమ్మీనే దిక్కు. బావ మంచోడని అనుకుని తన ప్రేమ విషయం చెప్తే.. ఆ ‘చెత్త’ కుటుంబంలోకి మరదల్ని పంపడం ఇష్టంలేని షమ్మీ తన సైకోయిజం చూపించి అందరినీ హడలకొట్టిస్తాడు. ఈ ఒక్క ‘కుంబళంగి నైట్స్’లోనే కాదు.. చాలా సినిమాల్లో ఫహద్ సైకిక్ క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది కూడా. కేవలం కళ్లతోనే అతను పలికే హవభావాలు కట్టిపడేస్తుంటాయి. ప్రేయసిని నమ్మించి మోసం చేసే పాత్ర అయితేనేం, తన్నులు తిన్న ప్రతీకారంతో.. తిరిగి తంతేగానీ చెప్పులేసుకోనని ప్రతిజ్ఞ చేసే అమాయకుడైతేనేం, ప్రేమభగ్నమైన తర్వాత భర్త, దొంగ, సైకో, మానసిక రోగి, గ్యాంగ్‌స్టర్.. ఇలా పాత్రకు తగ వేరియేషన్స్‌ను అలవోకగా ప్రదర్శించడం ఫహద్‌కు నటనతో పెట్టిన విద్య. ‘టేకాఫ్’, ఎన్జన్ ప్రకాశన్, వారాతన్ లాంటి కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు.. ఈమధ్యకాలంలో ‘ట్రాన్స్’, ‘సీయూసూన్’, ‘జోజి’ ‘మాలిక్’.. ఇలా వరుస ప్రయోగాత్మక సినిమాలతో ఇండియన్ వ్యూయర్స్‌కు దగ్గరైన ఫహద్ ఫాజిల్‌ను.. విలక్షణ నటుడు అనడం కంటే అసాధారణమైన నటుడు అనడం కరెక్ట్. కుంబళంగి నైట్స్‌లో షమ్మీగా పనికిరాడన్నారు! అవమానంతో.. ఫహద్ది స్టార్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. తండ్రి ఫాజిల్ పెద్ద డైరెక్టర్ కావడంతో హీరో అయ్యేందుకు ఉవ్విళ్లూరాడు. డిగ్రీ చదివే టైంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకున్నాడు ఫహద్. 2002లో తొలి చిత్రం ‘కైయేథుమ్ దురత్’ రిలీజ్ అయ్యింది. తండ్రి డైరెక్షన్, లవ్ స్టోరీ, పైగా మమ్మూట్టి గెస్ట్ రోల్.. ఇంకేం సినిమా సూపర్ హిట్ అని అంతా అనుకున్నారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడగా.. ఫాజిల్ నటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంట్రిలాక్విజం బొమ్మలా ఉన్నాడని.. ఏ కోణంలోనూ అతను హీరోగా పనికి రాడంటూ క్రిటిక్స్ ఏకీపడేశారు. తొలి సినిమా పోస్టర్ ఆ సినిమా దర్శకుడు ఫాజిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇందులో తన తండ్రి అంచనాలు తప్పలేవని, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి ఆ అంచనాలు తానే అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు ఫహద్. ఆపై యాక్టింగ్‌ను వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు ఏంఎ ఫిలాసఫీ చేశాడు. కమ్‌బ్యాక్.. ఘోరమైన అవమానం-విమర్శల తర్వాత యూఎస్ వెళ్లిపోయిన ఫహద్.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. తండ్రి ప్రొత్సాహంతో ఈసారి దర్శకుడు రంజిత్ డైరెక్షన్లో ‘కేరళ కేఫ్’(2009)తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి నటుడిగా ఫహద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చప్పా ఖురిష్(మలయాళం సినిమాల్లో సుదీర్ఘ కిస్ సీన్ ఉంది ఈ మూవీలోనే), డైమండ్ నెక్లెస్, 22 ఫిమేల్ కొట్టాయం, అన్నయుమ్ రసూలుమ్, బెంగళూరు డేస్, మహేషింటే ప్రతీకారం.. ఇలా వరుస హిట్లు నటుడిగా ఫహద్‌ను ఎస్టాబ్లిష్ చేశాయి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోయింది ఫహద్ సినీ కెరీర్. ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి మాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోల జాబితాలోకి చేరిపోయాడు ఫహద్. తొండిముథలం ద్రిక్సాక్షియుంలో సూరజ్ వెంజరమూడుతో ఫహద్.. గొలుసు మింగేసి ఆపై ఇక్కట్లు పడే దొంగగా ఫహద్ నటన బాగుంటుంది. ప్రత్యేకించి మలయాళ సినీ పరిశ్రమకు ప్రయోగాలకు, కొత్త జానర్లను, కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడిగా ఫహద్ పేరు ముద్రపడిపోయింది. ఇక తొండిముథలం ద్రిక్సాక్షియుం(2017) ఏకంగా నేషనల్ అవార్డును(బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్) తెచ్చిపెట్టగా.. స్టేట్, సౌత్ అవార్డులను సైతం అందుకున్నాడు. కరోనా తర్వాత వరుస ఓటీటీ రిలీజ్‌లతో సౌత్ ఆడియొన్స్‌కు బాగా దగ్గరయ్యాడు ఫహద్. నిర్మాతగానూ సూపర్ హిట్లు అందుకుంటున్నాడు ఫహద్. ఇక తమిళంలో శివకార్తీకేయన్ ‘వెళ్లైక్కారన్’తో డెబ్యూ ఇచ్చిన ఫహద్.. ఆపై సూపర్ డీలక్స్‌తో అలరించగా, కమల్ హాసన్ ‘విక్రమ్’తో మరోసారి సందడి చేయనున్నాడు. తెలుగుకొచ్చేసరికి అల్లుఅర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ ఆయన డెబ్యూ మూవీ కానుంది. జోజిలో ఫహద్ మహేషింటే ప్రతీకారం(దీని రీమేకే సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య) ఆండ్రియాతో ఎఫైర్.. నజ్రియాతో పెళ్లి వివాదాలకు దూరంగా ఉండే ఫహద్.. వ్యక్తిగత జీవితంతో మాత్రం ఓసారి వార్తల్లో నిలిచాడు. కోలీవుడ్ సింగర్ కమ్ నటి ఆండ్రియాతో ఎఫైర్ ఉందంటూ 2013లో ఓ మ్యాగజీన్ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నాడు ఫహద్. అయితే అలాంటిదేం లేదని, ఫహద్ పేరు కోసం అలాంటి ప్రకటన చేసి ఉంటాడని ఆండ్రియా ఖండించింది. కానీ, తమ మధ్య ప్రేమాయణం నడించిందని, బ్రేకప్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టొచ్చంటూ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫహద్. ఈ వివాదంలో ఆండ్రియా పరువు నష్టం దావాకు సిద్ధపడగా.. ఫహద్ క్షమాపణలు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి కూడా. ట్రాన్స్ మూవీలో భార్య నజ్రియాతో ఫహద్ ఇది జరిగిన మరుసటి ఏడాదే.. మాలీవుడ్‌లో బిజీ హీరోయిన్గా ఉన్న నజ్రియా నజీమ్(26)ను వివాహం చేసుకున్నాడు ఫహద్. అయితే ఈ జంట మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉండడంతో అక్కడి మీడియాలోనూ ఇదో పెద్ద చర్చగా నడిచింది అప్పట్లో. -
లక్కీగా వారిద్దరితో నటించే చాన్స్ వచ్చింది, హ్యాపీ: ఫాహద్ ఫాజిల్
మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటించిన మాలిక్ చిత్రం ఈరోజు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసందే. విభిన్న కథలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్‌కు మాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గురువారం విడుదలైన ‘మాలీక్’ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఫాహద్ ఓ ఛానల్‌తో ముచ్చటిచ్చాడు. ఈ సందర్భంగా పుష్ప మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ‘పుష్ప ఆఫర్ రావడానికి ముందే నేను డైరెక్టర్ సుకుమార్ సినిమాలు చూసేవాడిని. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. దీంతో ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే బాగుండని తరచూ అనుకునేవాడిని. అలాగే అల్లు అర్జున్ సినిమాలు కూడా చూశాను. తను ఎంచుకునే కథలు.. పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా బన్ని డాన్స్ బాగా చేస్తాడు. తనతో కలిసి ఒక సినిమా అయినా చేయాలనుకున్నాను. లక్కీగా ఇద్దరితో కలిసి చేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే షూటింగులో జాయిన్ అవుతాను’ అని ఫాహద్ పేర్కొన్నాడు. -
Malik Movie Review: ఫహద్ ఫాజిల్ ‘మాలిక్’ రివ్యూ
వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ నటనతో సౌత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ‘పుష్ప’, ‘విక్రమ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. గతేడాది ఆయన నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్’ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టైటిల్: మాలిక్ కాస్టింగ్: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్రట్, జోజూ జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రాన్స్, పార్వతి కృష్ణ, సనల్ అమన్ తదితరులు నిర్మాణ సంస్థ: యాంట్స్ టూ ఎలిఫంట్స్స్ సినిమాస్ కో నిర్మాతలు: అనీల్ కె రెడ్డి, కిషోర్ రెడ్డి సమర్పణ: మొజ్విత్,నినిన్ డైరెక్టర్: మహేష్ నారాయణన్ సంగీతం : సుశిన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ: సను వర్గీస్ ఓటీటీ: ఆహా(ఆగస్ట్12, 2022) కథ కేరళ తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి. బంధువుల కోలాహలం నడుమ హజ్ యాత్రకు బయలుదేరుతాడు సులైమాన్ అలీ అహమ్మద్ అలియాస్ మాలిక్ అలియాస్ అలీ ఇక్కా(ఫహద్ ఫాజిల్). అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే ఆ పెద్దాయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసులు నమోదు చేసి అతన్ని జైళ్లో పెడతారు. అనూహ్యంగా మాలిక్ తల్లి జలజ అప్రూవర్‌గా మారిపోయి వ్యతిరేకంగా సాక్క్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. మరోవైపు భార్య రోస్లిన్ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ లోపు మాలిక్ గతం తెర మీదకు కదలాడుతుంది. దశాబ్దాలపాటు పోలీసులు.. రాజకీయ నేతల కుట్రల నుంచి తన నేలను, ప్రజలను కాపాడుకుంటూ ఉద్యమనేతగా ఎదిగిన మాలిక్, ‘బడా డాన్‌గా, మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్’గా ఎందుకు జైలుపాలు కావాల్సి వస్తుంది? సొంతవాళ్లే అతన్ని వెన్నుపోటు పొడిచేంత నేరం మాలిక్ ఏం చేస్తాడు? రాజకీయ కుట్రల నడుమ మాలిక్ కథ ఎలా ముగుస్తుందనేది చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. ‘టేకాఫ్, సీయూ సూన్’ తర్వాత ఫహద్-మహేష్ నారాయణన్ కాంబోలో వచ్చిన మూవీ ఇది. ‘గాడ్ ఫాదర్, నాయకన్(నాయకుడు), అభిమన్యు(1991 మలయాళం), వన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికా’.. ఇలా టైంలైన్ కథల తరహాలో సాగే డాన్ కమ్ పొలిటికల్ థ్రిల్లర్ కథల తరహాలోనే ‘మాలిక్’ ఉంటుంది. కానీ, ‘రెలిజియన్ టచ్’ ఇచ్చి ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మహేష్. భూముల ఆక్రమణలు-దాడులు, బతుకు దెరువు కోసం అక్రమ వ్యాపారాలు.. ఇలా కొన్ని వాస్తవ ఘటనలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. నలభై మూడు నిమిషాల తర్వాత మొదలయ్యే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కథను జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టించాడు. పవర్ఫుల్ పాత్రలు- వాటి మధ్య పేలే డైలాగులు, సెంటిమెంట్, పొలిటికల్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే మధ్య కథలో కొంచెం సాగదీత, అక్కడక్కడా కొన్ని సీన్ల కట్టింగ్‌తో కొంత గందరగోళంగా అనిపించినప్పటికీ.. పవర్ఫుల్ స్టోరీ ముందు ఆ మైనస్‌లు తేలిపోయాయి. నటనపరంగా.. ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏజ్ వైజ్ క్యారెక్టర్లలో వేరియేషన్‌తో రఫ్ఫాడించేశాడు. ఆయా పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం చూస్తే.. ఫహద్ ఆ క్యారెక్టర్ కోసం పడ్డ కష్టం ఏంటో కనిపిస్తుంది. అప్పటిదాకా అగ్రెసివ్ క్యారెక్టర్‌గా కనిపించి.. కొడుకు ప్రాణం పోయాక శవాన్ని పట్టుకుని విలపించే సీన్ హైలైట్‌గా అనిపిస్తుంది. అటుపై జైళ్లో ఉన్నప్పుడు మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో కట్టిపడేస్తాడు. రోజ్లిన్గా నిమిషా.. ఫహద్‌తో పోటీ నటన కనబర్చింది. ఒకరకంగా సినిమాకు మాలిక్-రోజ్లిన్లు మెయిన్ పిల్లర్లుగా నిలిచారు. ఇక మాలిక్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో వినయ్ నటన మెప్పిస్తుంది. కెరీర్లో ఎక్కువగా కామెడీ వేషాలే వేసిన వినయ్.. డేవిడ్ పాత్రలో ఛాలెంజిగ్ రోల్‌తో అలరించాడనే చెప్పొచ్చు. వీళ్ల తర్వాత మేనల్లుడు ఫ్రెడ్డీ క్యారెక్టర్లో సనల్ అమన్, డాక్టర్ షెర్మిన్గా పార్వతీ కృష్ణన్లు మెప్పించారు. కలెక్టర్‌గా జోజూ జార్జ్ హుందా పాత్రలో అలరించాడు. మాలిక్ తల్లిగా జమీల, మాలిక్ గురువుగా సలీం కుమార్, పార్టీ నేతగా దిలీష్పోతన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్‌గా.. మాలిక్లో దర్శకుడి స్టోరీ టెల్లింగ్‌తో పాటు టెక్నికల్ బ్రిలియన్స్ కూడా కనిపిస్తుంది. 60వ దశకం నుంచి 2000 వరకు టైం లైన్‌గా మాలిక్ కథ సాగుతుంది. గతంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ డ్రామాల స్ఫూర్తితో ఈ కథను తీసినప్పటికీ.. ప్రత్యేకించి కొన్ని పాయింట్లను తెరపై చూపించడం మాత్రం ఆకట్టుకుంటుంది. సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గ మూడ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యిది. సుషిన్ శ్యామ్ సంగీతం ‘తీరమే’లాంటి సాంగ్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనూ మెప్పించాడు. మేకప్..కాస్టూమ్స్ కథకు తగ్గట్లు బాగున్నాయి. కథ, దర్శకత్వం బాధ్యతతో పాటు తన కథను తానే ఎడిటింగ్ చేసుకుని ‘మాలిక్’ను మరింత పక్కాగా చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు మహేష్ నారాయణన్. వెరసి.. మాలిక్‌ను తప్పకచూడాల్సిన ఓ పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దాడు. -
అదృష్టవశాత్తూ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ: ఫాహద్
సినిమా షూటింగ్స్‌లో.. ప్రత్యేకించి పోరాట సన్నివేశాలు చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు నటీనటులకు గాయాలు అవుతుంటాయి. తాజాగా మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ కూడా షూటింగ్లో జరిగిన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘‘అదృష్టవశాత్తూ బతికిపోయా’’ అని పేర్కొన్నారాయన. ‘మలయాన్ కుంజు’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ఈ సినిమా షూటింగ్లో ఉండగా ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తు నుంచి కిందకి పడిపోయారు. ఆ సమయంలో చేతులు ముందుకు చాచడంతో తలకి దెబ్బ తగలకుండా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ– ‘‘సాధారణంగా పై నుంచి కిందకి పడేటప్పుడు చేతులు ముందుకు చాచడం అంత సులభం కాదు.. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నా మెదడు చురుగ్గా పనిచేయడంతో బతికిపోయాను.. అయితే ఆ ప్రమాదంలో నా ముక్కుకి గాయం కావడం వల్ల మూడు కుట్లు పడ్డాయి.. ఆ గాయం నొప్పి తగ్గడానికి కొంత టైమ్ పడుతుంది’’ అన్నారు ఫాహద్ ఫాజిల్. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. చదవండి: లాక్డౌన్లో ‘పుష్ప’ కోసం నటుడు ఫహద్ ఫాసిల్ కసరత్తు! -
లాక్డౌన్లో ‘పుష్ప’ కోసం నటుడు ఫహద్ ఫాసిల్ కసరత్తు!
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీలో ఆయనకు డబ్బింగ్ చెప్పేందుకు ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్, హీరో తరుణ్‌తో ఇటీవల పుష్ప టీం చర్చలు జరిపినట్లు ఫిలీంనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. తాజా బజ్ ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఫహాద్ తెలుగు నేర్చుకునే పనిలో పడ్డాడట. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుని రోజు తెలుగు భాషపై కసరత్తు చేస్తున్నాడని సమాచారం. అయితే ఇందులో ఫహాద్ అవినీతి పోలీసు అధికారిగా, చిత్తూరు యాసలో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఈ యాసపై పట్టుసాధించేందుకు రోజు ప్రాక్టీస్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడట. అంతేకాదు దీనికి ప్రత్యేకంగా కోర్స్ కూడా తీసుకుంటున్నాడని వినికిడి. కాగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పుష్పను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
హీరో తరుణ్‌తో ‘పుష్ప’ మూవీ టీం చర్చలు!
ఒకప్పుడు టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ లవ్ స్టోరీ చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు హీరో తరుణ్. స్టార్ హీరోగా రాణిస్తున్న క్రమంలోనే దివంగత నటి ఆర్తీ అగర్వాల్‌తో ప్రేమవ్యవహరం వివాదంతో తరుణ్‌కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన తరుణ్ ఆ తర్వాత ఆడపదడపా చిత్రాల్లో నటించినప్పటికి అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణ్‌ను తాజాగా ‘పుష్ప’ మూవీ టీం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఏ కీ రోల్ కోసమో అనుకుంటే మీరు పొరపాటు పడ్డంటే. అవును.. తమ సినిమాకు వాయిస్ అందించాలని మేకర్స్ తరుణ్ కోరినట్లు వినికిడి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పుష్ప’లో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఫహద్ ఫాసిల్‌కు తరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలని, ఇందుకు సంబందించిన విషయమై మేకర్స్ తరుణ్‌తో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ అంతా ఒకే అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ఇక మొత్తానికి చాలా కాలం తర్వాత తరుణ్ ఇలా ప్రేక్షకులను పలుకరించడానికి రావడం ఆయన అభిమానులు ఆనందించే విషయమే. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
పుష్ప: హీరోకు ధీటుగా విలన్‌కు పారితోషికం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో పారితోషకం అధికంగా ఇచ్చేది టాలీవుడ్లోనే. అందుకే ఇతర భాషల్లో హీరోలుగా చేసే నటులు సైతం మన దగ్గర విలన్.. కీలక క్యారెక్టర్లు చేసేందుకు అంగీకరిస్తారు. ఆయా పాత్రలకు గాను వారు భారీ పారితోషికం తీసుకుంటారు. కథలో పాత్ర డిమాండ్‌ను బట్టి మన దర్శక, నిర్మాతలు కూడా భారీ పారితోషికాలకు సై అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పుష్ప మూవీలో ఓ క్యారెక్టర్‌కి భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఫాజిల్‌కు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు(జీఎస్టీ అదనం) పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మన దగ్గర చిన్న హీరోలు సైతం ఈ రేంజ్లో పారితోషికం డిమాండ్ చేయడం లేదు. అలాంటిది విలన్ పాత్ర చేసే ఫాజిల్‌కు ఇన్ని కోట్లు ఇవ్వడం టూమచ్ అని కొందరు అంటుండగా.. మరి కొందరు మాత్రం అతడి రేంజ్‌కు ఇది తక్కువే అనడం కొసమెరుపు. గతంలో ఫాజిల్ పలు అవార్డులు దక్కించుకున్నాడు. మళయాలంలో అతడికి ఎంతో క్రేజ్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పుష్ప మేకర్స్ ఇంత భారీ పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. చదవండి: పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు -
అఫీషియల్: పుష్ప కోసం భయంకర విలన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ కథలో హీరోయిన్ రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విలన్ ఎవరనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా చివరాఖరకు మలయాళ స్టార్ పేరును ఖరారు చేశారు. జాతీయ అవార్డు గ్రహీత ఫహద్ ఫాజిల్ పుష్పలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన అతడికి ఇదే తొలి తెలుగు చిత్రం. ఇతడు హీరోయిన్ నజ్రియా భర్తగానూ సుపరిచితుడే. అసలే బన్నీకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఇక విలన్‌ను కూడా అదే ఇండస్ట్రీ నుంచి ఎంపిక చేసుకోవడంతో సినిమాకు మరింత హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుంది. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో పుష్పపై భారీ అంచనాలే నెలకొన్నాయి. Welcoming #FahadhFaasil on board for the biggest face-off 😈@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie #VillainOfPushpa #Pushpa పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/ndweB09rXi — Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2021 చదవండి: -
బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన స్టార్ హీరోయిన్ భర్త
ప్రముఖ మలయాళ నటుడు, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త ఫాహద్ ఫాసిల్ షూటింగ్లో గాయపడ్డారు. కొచ్చిలో 'మలయన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్ అదుపుతప్పి నటుడు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను కొచ్చిలోని ఓ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు బలమైన గాయం కాగా, కొన్ని స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఫాహద్ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్దిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాల్లో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ఆయన 'సూపర్ డీలక్స్' సినిమాలో కనిపించారు. 2014లో ఫాహద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అంజలీ మీనన్’ కూడె’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని సరసన ‘అంటే సుందరానికీ!’ అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి : (నజ్రియా నజీమ్ ‘వాది’ కమింగ్!.. ఎందుకంటే..) (‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’) -
మణిరత్నంకు షాక్ ఇచ్చిన హీరో
దక్షిణాది లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, జ్యోతిక లాంటి భారీ స్టార్ కాస్ట్ తో ఓ సినిమాను ప్లాన్ చేశారు మణి. అయితే చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఏ హీరో అయినా కాదనడూ.. కానీ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ మాత్రం మణి సినిమాలో నటించేందుకు ముందు అంగీకరించి తరువాత నో చెప్పేశాడట. సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఫహాద్ తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. -
మణిరత్నం సినిమాకు నో చెప్పిన యంగ్ హీరో
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించేందుకు స్టార్ హీరోలు క్యూ కడతారు. యువ తరం హీరోలకైతే మణి సినిమాలో నటించటం ఓ కల. అందుకే మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం అలాంటి గోల్డెన్ ఛాన్స్ కు కూడా నో చెప్పేశాడట. చెలియా సినిమా తరువాత లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, అరవింద్ స్వామిల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకు ముందుకు విజయ్ దేవరకొండను తీసుకోవాలని భావించాడట మణిరత్నం. కానీ ఆ పాత్రలో నటించేందుకు విజయ్ అంగీకరించకపోవటంతో మరొకరిని తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మణి సినిమాకు విజయ్ ఎందుకు నో చెప్పాడో మాత్రం బయటి రాలేదు. అదే సమయంలో మరో యంగ్ హీరో నానికి కూడా మణి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపారు. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వదులుకున్నట్టుగా తెలిపాడు. -
ముహూర్తం కుదిరింది
తమిళ సినిమా, న్యూస్‌లైన్: నటి నజ్రియా వివాహ నిశ్చితార్థం శనివారం మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురంలోని తాజ్ హోటల్లో జరిగింది. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ భామ నజ్రియా నజీమ్. ఆ మధ్య నయ్యాండి చిత్రంలో తన పొట్ట చూపించారంటూ నానా రభస చేసిన ఈ బ్యూటీ రాజారాణి, తదితర చిత్రాల్లో నటించింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ కొడుకు, నటుడు పాహత్ పాజిల్‌తో ప్రేమ పెళ్లికి బాటలు వేసింది. వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఆగస్టు 21న తిరువనంతపురంలోని కళాకూట్టం అల్తాజ్ హాల్లో జరగనుంది. ఆ తర్వాత 24న వివాహ రిసెప్షన్ జరగనుంది. వివాహానంతరం తన భర్త, తల్లిదండ్రుల అనుమతితో నటనను కొనసాగిస్తానని నజ్రియా స్పష్టం చేసింది.