
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా 'కిష్కింద కాండం' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)
'పుష్ప 2'లో భన్వర్ సింగ్ షెకావత్‌గా త్వరలో రాబోతున్న ఫహాద్ ఫాజిల్.. రీసెంట్‌గా మలయాళంలో 'బౌగెన్‌విల్లా' అనే సినిమా చేశారు. కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మాదిరి హిట్ అయిన ఈ చిత్రాన్ని డిసెంబరు 13 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు.
'బౌగెన్‌విల్లా' విషయానికొస్తే డాక్టర్ రాయిస్ థామస్ (కుంచకో బోబన్), రీతు (జ్యోతిర్మయి) భార్యాభర్తలు. వీళ్లిద్దరూ ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో రీతు గతం మర్చిపోతుంది. అంతకు కొన్నిరోజుల క్రితం రీతు.. ఓ అమ్మాయిని ఫాలో అవుతుంది. ఆమె మినిస్టర్ కూతురు. కొన్నాళ్లకు మిస్ అవుతుంది. దీంతో ఆమె కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ కోషి (ఫహాద్ ఫాజిల్) రీతు దగ్గరకు వస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Every petal tells a story, every twist leaves you guessing. #Bougainvillea blooms this 13th December only on #SonyLIV.#Bougainvillea #BougainvilleaOnSonyLIV #SonyLIV #AmalNeerad #KunchackoBoban #Jyothirmayi #FahadFaasil #Srindaa #VeenaNandakumar #Sharafudheen pic.twitter.com/NdXQkBMWiZ
— Sony LIV (@SonyLIV) November 30, 2024