ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్! | Actor Rajinikanth 170 Movie Crew Details Nani | Sakshi
Sakshi News home page

Rajinikanth 170 Movie: రజినీ సినిమాలో ఆ 'నలుగురు'.. కాన్సెప్ట్ అదే!

Published Fri, Aug 4 2023 2:16 PM | Last Updated on Fri, Aug 4 2023 2:24 PM

Actor Rajinikanth 170 Movie Crew Details Nani - Sakshi

సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈసారి తలైవా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి అలా వదిలేస్తే.. రజినీ తర్వాత మూవీ కోసం భారీ సెటప్ సిద్ధమవుతోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్లానింగ్ అదీ చూస్తుంటే పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

స్టార్స్ ఎవరెవరు?
రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఒకే మూసలో సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒక‍్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. 'జైలర్' మీద పెద్దగా అంచనాల్లేవు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. అయితే  ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!)

నిజమైతే మాత్రం!
ప్రస్తుతానికి రూమర్ అయినప్పటికీ.. దాదాపు ఇదే నిజం కావొచ్చని తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలో ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా సమ్‪‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరో రెండు వారాల్లో ప్రకటన రానుందని సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీ పోలీస్ గా కనిపిస్తారట. అందులో భాగంగా తాజాగా హెయిర్ కట్ చేయించుకుని లుక్ మార్చేశారు.

నానికి లక్కీ ఛాన్స్?
ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమైతే మాత్రం తెలుగు హీరో నాని లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఎందుకంటే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే నాని.. పాన్ ఇండియా ఆశలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. మరి ఈ న్యూస్‌పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement