రజనీకాంత్‌తో హుక్‌ స్టెప్‌.. డబుల్‌ హ్యాపీ: మంజు వారియర్‌ | Manju Warrier Talk About Rajinikanth Vettaiyan Movie | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌తో హుక్‌ స్టెప్‌.. డబుల్‌ హ్యాపీ: మంజు వారియర్‌

Published Sun, Sep 15 2024 9:31 AM | Last Updated on Sun, Sep 15 2024 11:58 AM

Manju Warrier Talk About Rajinikanth Vettaiyan Movie

రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్‌’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీని టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సుభాస్కరన్‌ నిర్మించారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్, రానా, ఫాహద్‌ ఫాజిల్, మంజు వారియర్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్‌’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్‌ కానుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘మెరుపై వచ్చాడే’ అంటూ సాగే ‘మనసిలాయో...’ సాంగ్‌ విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాదు... ఈ పాటలో అదిరి పోయే స్టెప్పులేసి మంజు వారియర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

(చదవండి: ఒక్కసారి ఫిక్స్‌ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ!)

ఇక ‘వేట్టయాన్‌’ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘మనసిలాయో...’ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్‌ సాంగ్‌ను నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఈ తరహా సాంగ్‌లో డ్యాన్స్‌ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది. అంతమంది డ్యాన్సర్స్‌ సెట్స్‌లో ఉన్నప్పుడు ఒకే రిథమ్‌లో హుక్‌ స్టెప్‌ చేయడం నాకు చాలా బాగా అనిపించింది.

(చదవండి: ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సినిమా)

అలాగే అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌లో నేను చేసిన తొలి పాట కూడా ఇదే. ఇక జ్ఞానవేల్‌గారి ‘జై భీమ్‌’ సినిమా చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సమయంలో ‘వేట్టయాన్‌’ సినిమాతో ఆయన నన్ను అ్రప్రోచ్‌ అయ్యారు. పైగా రజనీకాంత్‌గారు కూడా ఉంటారని చెప్పారు. దీంతో డబుల్‌ హ్యాపీ ఫీలయ్యాను. రజనీగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను రజనీగారి భార్య తారగా కనిపిస్తాను. ఇంకా విజయ్‌ సేతుపతి ‘విడుదలై 2’, మోహన్‌లాల్‌ ‘ఎల్‌: ఎంపురాన్‌’ (లూసిఫర్‌ సీక్వెల్‌) చిత్రాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ఇక అక్టోబరులో ‘వేట్టయాన్‌’తో, డిసెంబరులో ‘విడుదలై  2’తో రెండు నెలల గ్యాప్‌తో తెరపై కనిపిస్తారు మంజు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement