TJ Gnanavel
-
వేట్టయాన్ కలెక్షన్స్.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. 18 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఇంతటి కలెక్షన్స్ రావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టయాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా భారత్‌లో రోజుకు రూ. 2 కోట్ల కలెక్షన్స్ వేట్టయాన్ రాబడుతుంది. అయితే, ఓవర్సీస్లో ఎక్కువగా ఈ మూవీ సత్తా చాటుతుంది. కేవలం భారత్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ సినిమా అంతటి పాజిటివ్ టాక్ వేట్టయాన్‌కు రాలేదు. అయినా, కలెక్షన్స్ పరంగా మెరుగ్గానే రాబడుతుంది.వేట్టైయన్ నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అన్ని భాషలలో డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రజినీకాంత్ వేట్టయాన్.. వారికి బిర్యానీ వడ్డించిన డైరెక్టర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన పది రోజుల్లోనే రూ.129 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా వేట్టయాన్ చిత్రబృందం థ్యాంక్స్ గివింగ్ మీట్ పేరుతో చెన్నైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో చిత్రబృందంతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ భోజనాలు వడ్డించారు.(ఇది చదవండి: వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్)ఈ సక్సెస్ మీట్లో వేట్టయాన్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ స్వయంగా చిత్రబృందంతో పాటు మీడియా ప్రతినిధులకు బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలను లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. A gathering of gratitude and celebration! 🤩 The VETTAIYAN 🕶️ family comes together, thankful for the overwhelming support and love from the press and media. ✨ #VettaiyanRunningSuccessfully 🕶️ in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan… pic.twitter.com/W0yA6yqgYH— Lyca Productions (@LycaProductions) October 20, 2024 -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను: జ్ఞానవేల్
‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.→ రజనీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.వెట్టయన్'కి ప్రీక్వెల్‌ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్ఫార్మర్గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.→ నిజ-జీవిత ఎన్కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను. -
రాజమౌళి బాహుబలి-3 .. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు బాహుబలి, బాహుబలి-2. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. దీంతో పార్ట్-3 కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే బాహుబలి-3 గురించి కోలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య భారీ యాక్షన్ చిత్రం కంగువా ప్రమోషన్స్‌లో భాగంగా బాహుబలి పార్ట్-3 గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. కంగువా సీక్వెన్స్‌ల మధ్య గ్యాప్‌ను సమర్థిస్తూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..'గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించా. పార్ట్- 3 కోసం ప్లాన్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాని కంటే ముందు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే కల్కి- 2, సలార్- 2 రిలీజ్ అవుతాయని అన్నారు. దీంతో బాహుబలి-3ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్)కాగా.. బాహుబలి రెండు పార్ట్‌లకు తమిళంలో నిర్మాతగా కేఈ జ్ఞానవేల్ రాజా వ్యవహరించారు. గతంలో బాహుబలి-3 గురించి ఎస్ఎస్ రాజమౌళి కూడా హింట్ ఇచ్చారు, కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిని తర్వాతే బాహుబలి-3 మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
'వేట్టయాన్' భారీ ఆఫర్.. టికెట్ల రేట్లు తగ్గింపు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్‌కు మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్‌తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్‌కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
యముడొచ్చి దిగినాడు!
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 10న విడుదల కానుంది. తెలుగులో ‘వేట్టయాన్: ద హంటర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి టీజర్ తరహాలో ప్రివ్యూ వీడియో విడుదలైంది. బుధవారం విడుదలైన ఈ తెలుగు వెర్షన్ వీడియోలో ‘ఈ దేశంలో లక్షలాదిమంది ΄ోలీసు అధికారులు ఉన్నారు. కానీ వీళ్లను మాత్రం చూడగానే గుర్తు పడుతున్నారంటే... హౌ ఈజ్ ఇట్ ΄ాజిబుల్, సో... ఎన్కౌంటర్ పేరుతో ఒక మనిషిని హత్య చేయడం అదొక హీరోయిజం...ఈజ్ ఇట్’ (అమితాబ్ బచ్చన్), ‘ఎన్కౌంటర్ అనేది నేరం చేసినవాళ్లకి విధించే శిక్ష మాత్రమే కాదు... ఇక మీదట ఎలాంటి నేరం మళ్లీ జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’ (రజనీకాంత్), ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భయపడకుండా ఎన్కౌంటర్ చేసినందు వల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ (రితికా సింగ్), ‘మన ఎస్పీ అన్న పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అనే డైలాగ్స్ ఈ ప్రివ్యూ వీడియోలో ఉన్నాయి. -
రజనీకాంత్‌తో హుక్ స్టెప్.. డబుల్ హ్యాపీ: మంజు వారియర్
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేట్టయాన్’ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ‘మెరుపై వచ్చాడే’ అంటూ సాగే ‘మనసిలాయో...’ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాదు... ఈ పాటలో అదిరి పోయే స్టెప్పులేసి మంజు వారియర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.(చదవండి: ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ!)ఇక ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ– ‘‘మనసిలాయో...’ పాటకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్ సాంగ్‌ను నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఈ తరహా సాంగ్‌లో డ్యాన్స్ చేయడం నాకు చాలా సరదాగా అనిపించింది. అంతమంది డ్యాన్సర్స్ సెట్స్‌లో ఉన్నప్పుడు ఒకే రిథమ్‌లో హుక్ స్టెప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది.(చదవండి: ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సినిమా)అలాగే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌లో నేను చేసిన తొలి పాట కూడా ఇదే. ఇక జ్ఞానవేల్గారి ‘జై భీమ్’ సినిమా చూసిన తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సమయంలో ‘వేట్టయాన్’ సినిమాతో ఆయన నన్ను అ్రప్రోచ్ అయ్యారు. పైగా రజనీకాంత్‌గారు కూడా ఉంటారని చెప్పారు. దీంతో డబుల్ హ్యాపీ ఫీలయ్యాను. రజనీగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను రజనీగారి భార్య తారగా కనిపిస్తాను. ఇంకా విజయ్ సేతుపతి ‘విడుదలై 2’, మోహన్‌లాల్ ‘ఎల్: ఎంపురాన్’ (లూసిఫర్ సీక్వెల్) చిత్రాల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ఇక అక్టోబరులో ‘వేట్టయాన్’తో, డిసెంబరులో ‘విడుదలై 2’తో రెండు నెలల గ్యాప్‌తో తెరపై కనిపిస్తారు మంజు. -
వేట్టయాన్ లో ఎంట్రీ
‘వేట్టయాన్ ’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు రానా. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. రజనీకాంత్– అమితాబ్ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో తొలిసారి సోమవారం రానా జాయిన్ అయ్యారు. రజనీకాంత్–రానా కాంబినేషన్ సీన్స్‌ని ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట జ్ఞానవేల్. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, బూటకపు ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని తెలిసింది. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
కన్యాకుమారిలో వేటగాడు
కన్యాకుమారిలో తిరుగుతున్నాడు వెట్టయాన్ (తెలుగులో ‘వేటగాడు’ అని అర్థం). రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వెట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తాజా చిత్రీకరణ కన్యాకుమారి పరిసరాల్లోని లొకేషన్స్‌లో జరుగుతోందని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్, ఫాహాద్ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ నటిస్తున్నారని, నకలీ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. సుభాస్కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
రజనీకాంత్ బర్త్‌డే.. రెండు సర్ప్రైజ్లు..
‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని అంటున్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘వేట్టయాన్ ’ (వేటగాడు అని అర్థం) టైటిల్‌ను ఖరారు చేసి, ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మంగళవారం రజనీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘వేట్టయాన్ ’ టైటిల్ వీడియోను విడుదల చేశారు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని రజనీకాంత్ చెప్పే డైలాగ్, విజువల్స్‌తో ఈ వీడియో సాగుతుంది. అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకాప్రోడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అలాగే లైకా ప్రోడక్షన్స్ సంస్థలో రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. రజనీ బర్త్ డే సందర్భంగా మొయిద్దీన్ భాయ్ పాత్రకు సంబంధించిన యాక్షన్ టీజర్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలే కాకుండా.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
తలైవా బర్త్‌డే నేడు! ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్?
తమిళ సినిమా: రజనీకాంత్ ఈ పేరే ఒక ప్రభంజనం. అశేష ప్రేక్షకుల గుండెల్లో కొలువైన పేరు. శివాజీ రావు గైక్వాడ్ అనే ఒక సాధారణ బస్ కండక్టర్‌ను దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ 1975లో రజనీకాంత్‌గా మార్చి నటుడిగా పునర్ఃజన్మను ఇచ్చారు. అలా అపూర్వ రాగంగల్ చిత్రంతో ప్రతి నాయకుడిగా మెరిసిన రజనీకాంత్ ఆ తర్వాత కథానాయకుడిగా అవతారం ఎత్తి తనకు తానుగా ఎదుగుతూ ఇప్పుడు ఎవర్ గ్రీన్ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. మధ్యలో రాజకీయాల వైపు మొగ్గు చూపినా, ఆ తర్వాత అది తన స్వభావానికి సరిపడదని భావించి అభిమానులను అలరించడమే తన సరైన రూటు అని నటనపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టారు. రజనీకాంత్ ఇటీవల నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆయన పని అయిపోయిందని.. ఇక నటన నుంచి స్వచ్ఛందంగా వైదొలగడం మంచిదనే మాటలు వినిపించాయి. అలాంటి వాటికి రజనీకాంత్ జైలర్ చిత్రంతో గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసిన రజినీకాంత్ తన 170వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. నేడు (డిసెంబర్ 12) రజనీకాంత్ 73వ పుట్టినరోజు. ఈ స్టైల్ కింగ్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండుగ రోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారందరూ రజనీకాంత్ పుట్టిన రోజు పండుగను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వనున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన కొత్త విషయాలను ప్రకటిస్తారా? లేక తన 171వ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) -
బర్త్ డే కానుక?
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని, రజనీకాంత్– ఫాహద్ కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఈ సినిమా టీజర్ విడుదలకు వేళ అయిందట. ఈ నెల 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, ఫేక్ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లైకా ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అప్డేట్ కూడా ఈ నెల 12న రావొచ్చని టాక్. -
ఆనందం ఉప్పొంగుతోంది
రజనీకాంత్ పట్ట లేనంత ఆనందంలో ఉన్నారు. అందుకే ‘‘నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారాయన. ఈ ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్‌తో 33 ఏళ్ల తర్వాత రజనీ స్క్రీన్ షేర్ చేసుకోవడమే. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘అంథా కానూన్ (1983), గిరఫ్తార్ (1985), హమ్’ (1991) చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ కుదింరింది. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనే అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘‘లైకా ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న నా 170వ సినిమాలో నా గురువు, గొప్ప నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నాను. నా హృదయం ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
రజనీకాంత్ 170 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
రజనీకాంత్ 'తలైవార్ 170' చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక కథాచిత్రానికి 'జై భీమ్' చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర కళాకారుల గురించి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇందులో టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా నటి మంజు వారియర్, దసరా విజయన్, రిత్విక సింగ్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బుధవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అందులో భాగంగా నటుడు రజనీకాంత్ మంగళవారమే చైన్నె నుంచి తిరువంతపురం బయలుదేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పూజలో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఆయన నటించే 170వ చిత్రం గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది మంచి సందేశంతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలోనే పేరును వెల్లడించనున్నట్లు చెప్పారు. తాను ఇంతకు ముందు నటించిన జైలర్ చిత్రం ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్ సలామ్ చిత్రం కూడా ఊహించిన దానికంటేబ్రహ్మాండంగా వచ్చిందని పేర్కొన్నారు. Lights ☀️ Camera 📽️ Clap 🎬 & ACTION 💥 With our Superstar @rajinikanth 🌟 and the stellar cast of #Thalaivar170🕴🏼 the team is all fired up and ready to roll! 📽️ Hope you all enjoyed the #ThalaivarFeast 🍛 Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ — Lyca Productions (@LycaProductions) October 4, 2023 -
రజనీకాంత్ సినిమాలో యంగ్ హీరోయిన్స్‌కు ఛాన్స్
నటుడు రజినీకాంత్ జైలర్ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్ చిత్రం టీజే. జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు) ఆ మధ్య దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా ఇందులో నటి దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్ ముఖ్యపాత్రను పోషించిన లాల్ సలామ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం. -
రజనీ 171 షురూ
ఏడు పదుల వయసులో జోరుగా సినిమా తర్వాత సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ఇటీవల విడుదలైన రజనీ 169వ చిత్రం ‘జైలర్’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. 170వ చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయనున్నారు. సోమవారం రజనీకాంత్ 171వ సినిమా ప్రకటన వెల్లడైంది. రజనీతో ‘జైలర్’ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గత ఏడాది కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, ప్రస్తుతం విజయ్ హీరోగా ‘లియో’కి దర్శకత్వం వహిస్తున్న లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, ఫైట్స్: అన్బు–అరివు. -
రజనీ కొత్త సినిమా.. స్టార్ట్ అప్పుడే
‘జైలర్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు హీరో రజనీకాంత్. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాల్లో కొంత సమయం గడిపారు రజనీ. అలాగే దేశంలోని మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారాయన. అయితే రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందట. దీంతో ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమాపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని, సెప్టెంబరు రెండోవారంలో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్, ప్రతినాయకుడి ఛాయలు ఉండే మరో కీలక పాత్రలో శర్వానంద్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఆగస్టు 10న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈసారి తలైవా హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి అలా వదిలేస్తే.. రజినీ తర్వాత మూవీ కోసం భారీ సెటప్ సిద్ధమవుతోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్లానింగ్ అదీ చూస్తుంటే పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. స్టార్స్ ఎవరెవరు? రజినీకాంత్ గత కొన్నేళ్లుగా ఒకే మూసలో సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని చెప్పొచ్చు. 'జైలర్' మీద పెద్దగా అంచనాల్లేవు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. దీని తర్వాత 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. అయితే ఇందులో రజినీతోపాటు అమితాబ్ బచ్చన్(హిందీ), ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్(మలయాళం), నాని (తెలుగు) కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) నిజమైతే మాత్రం! ప్రస్తుతానికి రూమర్ అయినప్పటికీ.. దాదాపు ఇదే నిజం కావొచ్చని తెలుస్తోంది. అయితే ఒక్క సినిమాలో ఇంతమంది అద్భుతమైన స్టార్స్ ఉన్నారనే విషయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే ఈ మూవీ కాన్సెప్ట్ కూడా సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరో రెండు వారాల్లో ప్రకటన రానుందని సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీ పోలీస్ గా కనిపిస్తారట. అందులో భాగంగా తాజాగా హెయిర్ కట్ చేయించుకుని లుక్ మార్చేశారు. నానికి లక్కీ ఛాన్స్? ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమైతే మాత్రం తెలుగు హీరో నాని లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. ఎందుకంటే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే నాని.. పాన్ ఇండియా ఆశలు కూడా నెరవేరుతాయని చెప్పొచ్చు. మరి ఈ న్యూస్‌పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
రజనీకాంత్‌ను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన చిత్రాల వేగాన్ని పెంచుతున్నారు. గ్యాప్ లేకుండా చిత్రాలు చేస్తూ ఈతరం హీరలను మించిపోతున్నారు. ఏడుపదుల వయసులోనూ అవిశ్రాంతిగా నటిస్తున్న రజనీకాంత్‌ను చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే జైలర్ చిత్రంలో నటించారు. దీన్ని సన్ పిచ్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. నెల్సన్ దర్శకత్వం వహించారు. ఇందులో జైలర్‌గా నటిస్తున్న రజినీకాంత్ రెండు గెటప్పుల్లో కనిపిస్తారా? లేక రెండు పాత్రల్లోనా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు 10వ తేదీన జైలర్ చిత్రం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న లాల్ సలాం చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతోంది. దీంతో రజినీకాంత్ తన 170వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) జైభీమ్ చిత్రం టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. బోగస్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. -
'జై భీమ్' డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా.. షూటింగ్ అప్పుడే
హీరో రజనీకాంత్ మే మొదటి వారంలో పోలీస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకోనున్నారుట. 'జై భీమ్' ఫేమ్ టీజే ఙ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మే మొదటివారంలో ప్రారంభం కానుందని, ఇందుకు తగ్గట్లుగా ఙ్ఞానవేల్ ప్రీ పొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారని కోలీవుడ్ టాక్. కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమాలో ఓ ముస్లిం పోలీస్ అధికారి పాత్రలో రజనీకాంత్ నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్. అలాగే లాల్‌సలామ్ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. -
అఫీషియల్: రజనీకాంత్ 170 చిత్రం అప్డేట్, ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌తో..
ఫలితాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 70 ఏళ్లలో కూడా యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన నెక్ట్స్ తన కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్‌లో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నారు. మార్చి 7న సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే బ్యానర్ నుంచి తలైవా 170వ చిత్రం రాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు(మార్చి 2న) లైకా సంస్థ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ సుభాకరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తలైవా ఫ్యన్స్కి లైకా ప్రొడక్షన్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో రజనీ 170 చిత్రాన్ని ఆయన ఏ రేంజ్లో ప్లాన్ చేశారనేది ఆసక్తిని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth 🌟 for #Thalaivar170 🤗 Directed by critically acclaimed @tjgnan 🎬 Music by the sensational “Rockstar” @anirudhofficial 🎸 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran#தலைவர்170 🤗 pic.twitter.com/DYg3aSeAi5 — Lyca Productions (@LycaProductions) March 2, 2023 -
జై భీమ్ డైరెక్టర్‌తో రజనీకాంత్ కొత్త సినిమా!
వయసుకు, మనసుకు సంబంధం లేదంటారు. అయితే వయసుకు, నటనకు సంబంధం లేదని నిరూపిస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఈయన వయసు జస్ట్ ఏడు పదులే. చేసిన చిత్రాలు 170. ప్రస్తుతం 169, 170 చిత్రాల్లో నటిస్తున్నారు. 169వ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, టాలీవుడ్ నటుడు సునీల్, తమిళ నటుడు యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రజనీకాంత్‌కు సంబంధించిన షూటింగ్ 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అందులో ఒకటి జైలర్ పాత్ర. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురానున్నట్టు తాజా సమాచారం. ఇక 169వ చిత్రం విషయానికొస్తే దీని పేరు లాల్ సలాం. ఇందులో రజనీకాంత్ అతిథిగా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు. విష్ణువిశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ వారసురాలు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న దీన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇకపోతే రజనీకాంత్ 171వ చిత్రం కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. దీనికి జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది జై భీమ్ చిత్రం మాదిరిగానే యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి లాఠీ పట్టనున్నట్లు సమాచారం. ఇంతకుముందు అన్బుక్కు నాన్ అడిమై, కొడి పరక్కుదు, నాట్టుక్కు ఒరు నల్లవన్, పాండియన్ ఇటీవల దర్బార్ చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించారు. దీంతో మరోసారి పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో దర్శకుడు జ్ఞానవేల్ బిజీగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. చదవండి: 10 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్