రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 10న విడుదల కానుంది. తెలుగులో ‘వేట్టయాన్: ద హంటర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి టీజర్ తరహాలో ప్రివ్యూ వీడియో విడుదలైంది. బుధవారం విడుదలైన ఈ తెలుగు వెర్షన్ వీడియోలో ‘ఈ దేశంలో లక్షలాదిమంది ΄ోలీసు అధికారులు ఉన్నారు.
కానీ వీళ్లను మాత్రం చూడగానే గుర్తు పడుతున్నారంటే... హౌ ఈజ్ ఇట్ ΄ాజిబుల్, సో... ఎన్‌కౌంటర్ పేరుతో ఒక మనిషిని హత్య చేయడం అదొక హీరోయిజం...ఈజ్ ఇట్’ (అమితాబ్ బచ్చన్), ‘ఎన్‌కౌంటర్ అనేది నేరం చేసినవాళ్లకి విధించే శిక్ష మాత్రమే కాదు... ఇక మీదట ఎలాంటి నేరం మళ్లీ జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’ (రజనీకాంత్), ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భయపడకుండా ఎన్‌కౌంటర్ చేసినందు వల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ (రితికా సింగ్), ‘మన ఎస్పీ అన్న పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అనే డైలాగ్స్ ఈ ప్రివ్యూ వీడియోలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment