– టీజే జ్ఞానవేల్
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు.
రజనీకాంత్ లీడ్ రోల్‌లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.
→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్‌కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది.
→ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్‌కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్‌కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్‌కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం.
→ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment