సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్‌లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.
‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్‌లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్
వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment