రజనీకాంత్ పట్ట లేనంత ఆనందంలో ఉన్నారు. అందుకే ‘‘నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారాయన. ఈ ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్‌తో 33 ఏళ్ల తర్వాత రజనీ స్క్రీన్ షేర్ చేసుకోవడమే. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘అంథా కానూన్ (1983), గిరఫ్తార్ (1985), హమ్’ (1991) చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ కుదింరింది.
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనే అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘‘లైకా ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న నా 170వ సినిమాలో నా గురువు, గొప్ప నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నాను. నా హృదయం ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment