రజనీకాంత్‌ 170 ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభం.. ఎక్కడో తెలుసా? | Thalaivar 170: Rajinikanth's Movie Shooting Started Today | Sakshi
Sakshi News home page

Thalaivar 170: రజనీకాంత్‌ 170 ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభం..

Published Wed, Oct 4 2023 11:43 AM | Last Updated on Wed, Oct 4 2023 11:56 AM

Rajinikanth Thalaivar 170 Movie Shooting Now Began - Sakshi

రజనీకాంత్‌ 'తలైవార్‌ 170' చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. లైకా ప్రొడక్షనన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక కథాచిత్రానికి 'జై భీమ్‌' చిత్రం ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర కళాకారుల గురించి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇందులో టాలీవుడ్‌ నటుడు దగ్గుపాటి రానా నటి మంజు వారియర్‌, దసరా విజయన్‌, రిత్విక సింగ్‌ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

(ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్‌)

బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌, మలయాళ స్టార్‌ నటుడు ఫాహత్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రజనీకాంత్‌ ఇందులో పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బుధవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అందులో భాగంగా నటుడు రజనీకాంత్‌ మంగళవారమే చైన్నె నుంచి తిరువంతపురం బయలుదేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పూజలో పాల్గొని  మీడియాతో ముచ్చటించారు.

ఆయన నటించే 170వ చిత్రం గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది మంచి సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలోనే పేరును వెల్లడించనున్నట్లు చెప్పారు. తాను ఇంతకు ముందు నటించిన జైలర్‌ చిత్రం ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్‌ సలామ్‌ చిత్రం కూడా ఊహించిన దానికంటేబ్రహ్మాండంగా వచ్చిందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement