వేట్టయాన్ లో ఎంట్రీ  | rana daggubati joins rajinikanths vettaiyan set | Sakshi
Sakshi News home page

వేట్టయాన్ లో ఎంట్రీ 

Published Tue, Mar 5 2024 1:21 AM | Last Updated on Tue, Mar 5 2024 1:21 AM

rana daggubati joins rajinikanths vettaiyan set - Sakshi

‘వేట్టయాన్ ’ సెట్స్‌లో జాయిన్  అయ్యారు రానా. రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్  ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ , ఫాహద్‌ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్  ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్‌’ లేటెస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది.

రజనీకాంత్‌– అమితాబ్‌ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో తొలిసారి సోమవారం రానా జాయిన్  అయ్యారు. రజనీకాంత్‌–రానా కాంబినేషన్‌ సీన్స్‌ని ఈ షెడ్యూల్‌లో ప్లాన్‌ చేశారట జ్ఞానవేల్‌. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఓ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారని, బూటకపు ఎన్ కౌంటర్స్‌ నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని తెలిసింది. సుభాస్కరన్  నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement