రజనీకాంత్‌ సినిమాలో యంగ్‌ హీరోయిన్స్‌కు ఛాన్స్‌ | Thalaivar 170 : Young Heroine In Rajinikanth And TJ Gnanavel Raja's Project | Sakshi
Sakshi News home page

Rajinikanth 170: రజనీకాంత్‌ సినిమాలో యంగ్‌ హీరోయిన్స్‌కు ఛాన్స్‌

Published Tue, Oct 3 2023 7:17 AM | Last Updated on Tue, Oct 3 2023 11:03 AM

Young Heroine In Rajinikanth And TJ Gnanavel Raja 170 Project - Sakshi

నటుడు రజినీకాంత్‌ జైలర్‌ చిత్ర విజయాన్ని బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర 50 రోజుల వేడుకల్లోనూ పాల్గొన్నారు. తర్వాత తన 170వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని లైకా ప్రొడక్షనన్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి జైభీమ్‌ చిత్రం టీజే. జ్ఞానవేల్‌ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమని ఆయన ఇదివరకే తెలిపారు. ఇందులో రజనీకాంత్‌ మరోసారి పోలీస్‌ అధికారిగా నటించటానికి సిద్ధమవుతున్నారు.

(ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్‌ మార్చేసిన మహేశ్‌ బాబు)

ఆ మధ్య దర్బార్‌ చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించిన రజనీకాంత్‌ ఇటీవల విడుదలైన జైలర్‌ చిత్రంలో జైలు అధికారిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పనిచేసే నటీనటులు సాంకేతిక వర్గం గురించి రోజుకో ప్రకటన విడుదల చేస్తూ వెల్లడిస్తున్నారు. అలా ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. జైలర్‌ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత మళ్లీ రజనీకాంత్‌, అనిరుధ్‌ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

తాజాగా ఇందులో నటి దుషారా విజయన్‌, రిత్విక సింగ్‌ వంటి యంగ్‌ హీరోయిన్స్‌ నటించనున్నట్లు ప్రకటించారు. కాగా ఇందులో రజనీకాంత్‌ సరసన మలయాళ నటి మంజు వారియర్‌ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా రజనీకాంత్‌ ముఖ్యపాత్రను పోషించిన లాల్‌ సలామ్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్‌ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement