Rajinikanth-Gnanavel to shoot in May; who will helm #Thalaivar171? - Sakshi
Sakshi News home page

Rajinikanth: 'జై భీమ్‌' డైరెక్టర్‌తో రజనీకాంత్‌ సినిమా.. షూటింగ్‌ అప్పుడే

Published Mon, Apr 10 2023 12:20 PM | Last Updated on Mon, Apr 10 2023 1:21 PM

Rajinikanth To Team Up With Jai Bhim Director Gnanavel Shoot In May - Sakshi

హీరో రజనీకాంత్‌ మే మొదటి వారంలో పోలీస్‌ ఆఫీసర్‌గా ఛార్జ్‌ తీసుకోనున్నారుట. 'జై భీమ్‌' ఫేమ్‌ టీజే ఙ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ మే మొదటివారంలో ప్రారంభం కానుందని, ఇందుకు తగ్గట్లుగా ఙ్ఞానవేల్‌ ప్రీ పొడక్షన్‌ పనుల్ని వేగవంతం చేశారని కోలీవుడ్‌ టాక్‌.

కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమాలో ఓ ముస్లిం పోలీస్‌ అధికారి పాత్రలో రజనీకాంత్‌ నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో జైలర్‌ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్‌. అలాగే లాల్‌సలామ్‌ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement