
కన్యాకుమారిలో తిరుగుతున్నాడు వెట్టయాన్ (తెలుగులో ‘వేటగాడు’ అని అర్థం). రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వెట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా తాజా చిత్రీకరణ కన్యాకుమారి పరిసరాల్లోని లొకేషన్స్‌లో జరుగుతోందని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్, ఫాహాద్ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ నటిస్తున్నారని, నకలీ ఎన్‌కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. సుభాస్కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment