Rajinikanth, Jai Bhim Director Shooting Starts On September 2023 - Sakshi
Sakshi News home page

రజనీ కొత్త సినిమా.. స్టార్ట్‌ అప్పుడే

Published Mon, Aug 21 2023 4:07 AM | Last Updated on Mon, Aug 21 2023 10:50 AM

Rajinikanth jai bhim shooting starts on september 2023 - Sakshi

‘జైలర్‌’ సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్నారు హీరో రజనీకాంత్‌. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాల్లో కొంత సమయం గడిపారు రజనీ. అలాగే దేశంలోని మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారాయన. అయితే రజనీకాంత్‌ ఆధ్యాత్మిక యాత్ర ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందట.

దీంతో ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమాపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని, సెప్టెంబరు రెండోవారంలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారని కోలీవుడ్‌ టాక్‌. రజనీకాంత్‌ కెరీర్‌లో 170వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్, ప్రతినాయకుడి ఛాయలు ఉండే మరో కీలక పాత్రలో శర్వానంద్‌ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్‌ నిర్మించనున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement