రాజమౌళి బాహుబలి-3 .. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్! | Kanguva Producer KE Gnanavel Raja Interesting Comments On Baahubali Part-3 | Sakshi
Sakshi News home page

Bahubali-3: రాజమౌళి బాహుబలి-3.. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్!

Published Thu, Oct 17 2024 2:46 PM | Last Updated on Thu, Oct 17 2024 3:08 PM

Kanguva Producer KE Gnanavel Raja Interesting Comments On Baahubali Part-3

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్‌ సినిమాలు బాహుబలి, బాహుబలి-2. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. దీంతో పార్ట్-3 కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాహుబలి-3 గురించి కోలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య భారీ యాక్షన్ చిత్రం కంగువా ప్రమోషన్స్‌లో భాగంగా బాహుబలి పార్ట్-3 గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. కంగువా సీక్వెన్స్‌ల మధ్య గ్యాప్‌ను సమర్థిస్తూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.

కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..'గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించా. పార్ట్‌- 3 కోసం ప్లాన్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాని కంటే ముందు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే కల్కి- 2, సలార్-‌ 2 రిలీజ్‌ అవుతాయని అన్నారు. దీంతో బాహుబలి-3ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌)

కాగా.. బాహుబలి రెండు పార్ట్‌లకు తమిళంలో నిర్మాతగా కేఈ జ్ఞానవేల్‌ రాజా వ్యవహరించారు. గతంలో బాహుబలి-3 గురించి ఎస్ఎస్ రాజమౌళి కూడా హింట్ ఇచ్చారు, కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిని తర్వాతే బాహుబలి-3 మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement